Lal Salaam Movie Review In Telugu: రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Lal Salaam Movie Review In Telugu: రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?

    Lal Salaam Movie Review In Telugu: రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?

    February 9, 2024

    నటీనటులు : రజనీకాంత్‌, విష్ణు విశాల్‌, విక్రాంత్‌, కపిల్‌ దేవ్‌, నిరోషా రాధా, సెంథిల్‌, జీవిత, తంబి రమేష్‌ తదితరులు

    దర్శకత్వం:  ఐశ్వర్య రజనీకాంత్‌

    సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌

    సినిమాటోగ్రఫీ : విష్ణు రంగస్వామి

    నిర్మాత: సుభాస్కరణ్‌ అల్లిరాజా

    విడుదల తేదీ : 09 ఫిబ్రవరి, 2024

    సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో (Lal Salaam Movie Review In Telugu) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam). ఈ సినిమాకు ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ ముఖ్యపాత్రలు పోషించారు. భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ కూడా అతిథి పాత్రలో నటించారు. క్రికెట్‌ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్‌ మూవీ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతో ప్రముఖ హీరోయిన్ జీవితా రాజశేఖర్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రజనీ మరోమారు తన నటనతో మెప్పించాడా? కూతురికి విజయాన్ని అందించాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథ

    తిరు (విష్ణు విశాల్‌), మెుయిద్దీన్ భాయ్‌ (రజనీకాంత్‌) కొడుకు షంశుద్దిన్‌ చిన్నప్పటి నుంచి ప్రత్యర్థులు. మెుయిద్దీన్ భాయ్‌ స్థాపించిన త్రీ స్టార్‌ క్రికెట్‌ జట్టులో కీలక ప్లేయర్లుగా ఉంటారు. తిరు సక్సెస్‌ పట్ల అసూయ పడే కొందరు వ్యక్తులు అతడు జట్టు నుంచి బయటకొచ్చి కొత్త టీమ్‌ పెట్టుకునేలా ప్రేరేపిస్తారు. ఈ క్రమంలో తిరు.. ఎంసీసీ టీమ్‌ను ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ జట్లు రెండు విభిన్న మతాలను (హిందూ – ముస్లిం) రిప్రెజెంట్‌ చేస్తాయి. ఊర్లో ఈ రెండు జట్ల మ్యాచ్‌ అంటే అది ఇండియా – పాక్‌ మ్యాచ్‌ను తలపిస్తుంది. ఈ క్రమంలో ఓ మ్యాచ్‌ తిరు-షంశు జీవితాలను మలుపు తిప్పుతుంది. జాతీయ జట్టుకు ఆడాలన్న షంశు కలను ప్రశ్నార్థకం చేస్తుంది. ఇంతకీ ఆ మ్యాచ్‌లో ఏం జరిగింది? మతాల వారిగా విడిపోయిన ఊరు, జట్లను మెుయిద్దీన్ భాయ్ ఎలా కలిపాడు? అన్నది స్టోరీ. 

    ఎవరెలా చేశారంటే?

    లాల్‌ సలాం చిత్రంలో రజనీకాంత్ (Lal Salaam Movie Review In Telugu) ప్రత్యేక పాత్రలో కనిపించినా కథను ఆయన పూర్తిగా ఆక్రమించేశారు. మరోమారు తన అద్భుతమైన నటనతో మెప్పించారు. ఒక కొడుక్కి తండ్రిగా, మత పెద్దగా మెుయిద్దీన్‌ పాత్రలో ఆయన జీవించారు. కనిపించింది కొద్దిసేపే అయినా సినిమాకు రజనీ  వెన్నెముకగా మారారు. ఇక ప్రత్యర్థులుగా విష్ణు విశాల్‌, విక్రాంత్‌ నటన ఆకట్టుకుంది. వారు ప్రొఫెషనల్‌ క్రికెటర్స్‌లా స్క్రీన్‌పై కనిపించారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకలకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. నిరోషా రాధా, సెంథిల్‌, జీవిత, తంబి రమేష్‌ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే?

    డైరెక్టర్‌ ఐశ్వర్య రజనీకాంత్‌.. రెండు విభిన్న మతాలను (Lal Salaam Movie Review In Telugu) తన కథాంశంగా ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆమె కథను తీర్చిదిద్దారు. పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ను ఆమె ఎంచుకున్నప్పటికీ దానిని సరిగ్గా ప్రజెంట్ చేయడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. విష్ణు-విక్రాంత్‌ల సీన్లు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. కొన్ని అంశాలను క్లారిటీగా చెప్పకపోవడంలోనూ డైరెక్టర్ల వైఫల్యం కనిపిస్తుంది. ఇక రజనీకాంత్‌ పాత్ర నిడివి మరి తక్కువగా ఉంది. సినిమాలో ఆయన ప్రెజెన్స్‌ను ఇంకాస్త పెంచి ఉంటే ప్లస్‌ అయ్యేది. ఇంకా సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డైలాగ్స్‌. ముస్లింలను రిప్రెజెంట్‌ చేస్తూ తాము ఈ దేశ పౌరులమేనంటూ రజనీ చెప్పే డైలాగ్స్ థియేటర్లో చప్పట్లు కొట్టిస్తాయి. 

    టెక్నికల్‌గా..

    టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే (Lal Salaam Movie Review In Telugu).. ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా రజనీకాంత్‌ పాత్రకు ఎలివేషన్స్‌ ఇస్తూ ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. రెహమాన్ BGM.. రజనీపాత్ర మరింత ఎలివేట్ అయ్యేందుకు దోహదపడింది. ఇక విష్ణు రంగస్వామి కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • కథ, కథనం
    • రజనీకాంత్‌ నటన
    • సంగీతం

    మైసన్‌ పాయింట్స్‌

    • స్పష్టత లేని సన్నివేశాలు
    • సాగదీత సీన్స్‌

    Telugu.yousay.tv Rating: 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version