Lava Agni 2 5G Review: తొలి దేశీయ 5G ఫోన్‌.. విదేశీ ఫోన్లను తలదన్నేలా ఫీచర్లు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Lava Agni 2 5G Review: తొలి దేశీయ 5G ఫోన్‌.. విదేశీ ఫోన్లను తలదన్నేలా ఫీచర్లు!

    Lava Agni 2 5G Review: తొలి దేశీయ 5G ఫోన్‌.. విదేశీ ఫోన్లను తలదన్నేలా ఫీచర్లు!

    May 24, 2023

    దేశీయ మెుబైల్‌ తయారీ కంపెనీ లావా నుంచి మరో సరికొత్త 5G ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చింది. విదేశీ ఫోన్లను కాకుండా ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ స్మార్ట్‌ఫోన్‌ కొనాలని భావించే వారికి Lava Agni 2 5G చక్కటి ఆప్షన్‌ అని సదరు కంపెనీ ప్రకటించింది. విదేశీ ఫోన్లను తలదన్నే ఫీచర్లు ఇందులో ఉన్నట్లు పేర్కొంది. వాటితో పోలిస్తే బడ్జెట్‌ కూడా తక్కువేనని చెప్పుకొచ్చింది. కాగా, గతంలో వచ్చిన Lava Agni 5G ఫోన్‌కు సక్సెసర్‌గా కొత్త మోడల్‌ను తీసుకొచ్చారు. మెుదటి ఫోన్‌ ఆకట్టుకోవడంతో ఆటోమేటిక్‌గా Lava Agni 2 5G అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నయా ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి అడ్వన్స్‌డ్‌ ఫీచర్లు ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. 

    హెడ్‌డీ డిస్‌ప్లే

    Lava Agni 2  స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల  Full HD + కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120 Hz

    స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేట్‌తో దీన్ని రూపొందించారు. 3D Dual Curved డిజైన్‍తో ఉన్న ఈ ఫోన్‌ డిస్‍ప్లే HDR, HDR10 HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. 

    ఫస్ట్‌ మెుబైల్‌

    Lava Agni 2 5G ఫోన్‌లో MediaTek Dimensity 7050 చిప్‌సెట్‌ను అమర్చారు. ఈ ప్రాసెసర్‌తో ఇండియాలో లాంచ్ అయిన ఫస్ట్ మొబైల్ ఇదే.  Android v13 ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ ఫోన్ పనిచేస్తుంది. రెండేళ్లపాటు OS అప్‌డేట్‌లు, మూడేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఫ్రీగా చేసుకోవచ్చని లావా చెప్పింది. 

    ఫాస్ట్‌ చార్జింగ్‌

    Lava Agni 2 5G ఫోన్‌ను 4700mAh బ్యాటరీతో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. 16 నిమిషాల్లోనే ఫోన్‌ను 50% మేర ఛార్జింగ్‌ చేసుకోవచ్చని ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌లో కంపెనీ తెలిపింది. 

    స్టోరేజ్‌

    Lava Agni 2 5G ఫోన్‌ 8GB RAM కలిగి ఉంది. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 256GB ఇచ్చారు. 5జీకి కూడా ఈ మెుబైల్ సపోర్టు చేస్తుంది. ఇందులో ఇన్‍డిస్‍ప్లే ఫింగర్ ప్రింట్‌ స్కానర్‌ ఉంది.

    కెమెరా క్వాలిటీ

    Lava Agni 2 5G ఫోన్‌కు వెనుక వైపున నాలుగు కెమెరాలను అమర్చారు. ప్రైమరి కెమెరా 50MP ఇచ్చారు. 8MP అల్ట్రా వైడ్, 2MP డెప్త్, 2MPమాక్రో కెమెరాలు అదనంగా ఉన్నాయి. ఫ్రంట్‌ కెమెరాను 16MP తీసుకొచ్చారు.  

    సూపర్‌ గేమింగ్‌

    Lava Agni 2 5G ఫోన్ గేమ్స్‌కి కూడా చాలా బాగా సపోర్టు చేస్తుంది. 8GB RAM + MediaTek Dimensity 7050 ప్రొసెసర్‌తో ఈ ఫోన్‌ వస్తుండటంతో గేమ్స్‌ను చాలా కంఫర్ట్‌బుల్‌గా ఆడుకోవచ్చని కంపెనీ తెలిపింది. 

    కలర్‌

    Lava Agni 2 5G ఫోన్‌ను ఒక రంగుతోనే మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. గ్లాస్‌ విరిడియన్ కలర్ ఆప్షన్‍లో ఈ ఫోన్ పొందవచ్చు.

    ధర ఎంతంటే?


    అమెజాన్‌ ఈ-కామర్స్‌ సైట్‌లో ఇవాళ (మే 24) ఉదయం 10 గంటల నుంచి  Lava Agni 2 5G ఫోన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. మెుబైల్‌ ధరను రూ.21,999 నిర్ణయించారు. ఏదైనా బ్యాంకుకు చెందిన డెబిట్/క్రెడిట్ కార్డును ఉపయోగించి మెుబైల్‌ను కొంటే రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు. రూ.19,999 ధరకే ఫోన్‍ సొంతం చేసుకోవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version