ఇండియన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా నుంచి మరో స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. Lava Blaze 3 5G పేరుతో మార్కెట్‌లోకి విడుదల కానుంది. చౌకైన స్మార్ట్‌ఫోన్ విభాగంలో దీనికి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. Blaze 3 5G అధికారిక విడుదల తేదీ కూడా ప్రకటించింది. దీంతో పాటు డివైస్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు అమెజాన్ సైట్‌లో రన్ అవుతున్నాయి.
Lava Blaze 3 5G డిజైన్, ఇతర కీలక స్పెసిఫికేషన్లను అమెజాన్ ధృవీకరించింది. ప్రారంభ తేదీని ప్రకటించే ముందు, Blaze 3 5G ధరకు సంబంధించిన వివరాలను లావా ఇప్పటికే తెలిపింది.
Lava Blaze 3 5G ధర
అమెజాన్ ప్రకారం, Lava Blaze 3 5G ప్రారంభ ధర రూ. 9,999గా ఉంది. ఇది ‘స్పెషల్ లాంచ్ ప్రైస్’లో భాగంగా అందుబాటులో ఉంటుంది. ఈ ధరలో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉంటాయి. Lava Blaze 3 5G మొదటి సేల్ సెప్టెంబర్ 18న తెల్లవారుజామున 12:00 గంటలకు (IST) ప్రారంభం కానుందని లావా ధృవీకరించింది.
Lava Blaze 3 5G స్పెసిఫికేషన్లు
Lava Blaze 3 5Gలో MediaTek Dimensity 6300 SoC ప్రాసెసర్ చిప్‌తో రన్ కానుంది. ఇది 410K కంటే ఎక్కువ AnTuTu స్కోర్‌ను పొందింది. ఈ గ్యాడ్జెట్ 6GB వరకు RAM, 128GB UFS 2.2 స్టోరేజ్ సామర్థ్యంతో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ప్రత్యేకంగా నిలవనుంది. దీనికి అదనంగా, 6GB వర్చువల్ RAMగా ఉపయోగించుకునే వీలును కల్పించారు
డిస్‌ప్లే
ఈ ఫోన్‌లో 6.56-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. Lava Blaze 3 5Gలో డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి. 18W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్న 5,000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది. Lava Blaze 3 5G గ్యాడ్జెట్ Android 14 క్లీన్ వెర్షన్‌పై నడుస్తుంది.
కెమెరా ఫీచర్లు
ఇక ఆప్టిక్స్ విషయానికొస్తే, Lava Blaze 3 5Gలో ప్రధాన కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP AI లెన్స్‌తో కూడిన డ్యూయల్-కెమెరా ఉంది. LED ఫ్లాష్ మాడ్యూల్ కింద Vibe Light ఉంటుంది, ఇది లోలైట్‌లో మంచి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీని అందిస్తుంది. ముందు వైపున, హోల్-పంచ్ కటౌట్‌లో 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది నాణ్యమైన ఫొటోలు తీయనుంది.
కనెక్టివిటీ & కలర్స్
Lava Blaze 3 5G అన్ని సబ్ 6nm వేవ్ 5G బ్యాండ్‌లకు సపోర్ట్ చేస్తుంది. అదనంగా, Lava Blaze 3 5G సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్, ఫేస్ అన్‌లాక్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్ డిజైన్‌లో వస్తుంది. గ్లాస్ బ్లూ, గ్లాస్ గోల్డ్ రంగులలో అందుబాటులో ఉంటుంది.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?