ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ లావా (Lava) మరో సరికొత్త బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. లావా యువ 3 ప్రో (Lava Yuva 3 Pro) పేరుతో భారత్‌లో విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన Yuva 2 Pro మెుబైల్‌కు అనుసంధానంగా దీన్ని తీసుకొచ్చింది. గత మోడల్‌తో పోలిస్తే నయా ఫోన్‌లో ఎన్నో అప్‌డేట్స్ తీసుకొచ్చినట్లు లావా వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో Yuva 3 Pro ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఫోన్ స్క్రీన్
లావా యువ 3 ప్రో మెుబైల్ 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌ను ఫోన్‌కు అందించారు. Unisoc’s T616 chipset ప్రొసెసర్, Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో మెుబైల్ వర్క్ చేయనుంది.
ర్యామ్ & స్టోరేజ్
Lava Yuva 3 Pro పవర్‌ఫుల్ ర్యామ్‌తో తీసుకొచ్చారు. 8GB RAMను ఫోన్‌కు ఫిక్స్ చేశారు. 128GB స్టోరేజ్ సామర్థ్యాన్ని మెుబైల్‌కు అందించారు. వర్చువల్‌గా ర్యామ్‌ను 16GB వరకూ పెంచుకోవచ్చని లావా వర్గాలు వెల్లడించాయి. అటు microSD కార్డు ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని 512GB వరకూ పెంచుకోవచ్చని పేర్కొన్నాయి.
బ్యాటరీ
ఈ బడ్జెట్ మెుబైల్‌ను లావా శక్తివంతమైన బ్యాటరీతో రూపొందించింది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ఫోన్‌కు అమర్చింది. సింగిల్ ఛార్జ్‌తో ఈ ఫోన్ 38 గంటల టాక్‌టైమ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
కెమెరా
Lava Yuva 3 Pro స్మార్ట్‌ఫోన్‌ను డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో తీసుకొచ్చారు. 50MP AI సెన్సార్‌ను ప్రైమరి కెమెరాగా ఫిక్స్ చేశారు. ముందు వైపు సెల్ఫీల కోసం 8MP కెమెరాను అమర్చారు. వీటితో నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని లావా చెబుతోంది.
కనెక్టివిటీ ఫీచర్లు
మెుబైల్‌లోని కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 4జీ వోల్ట్, బ్లూటూత్ 5, GPRS, ఓటీజీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్/ఎసి, 3.5nm ఆడియో జాక్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్‌కు అందించారు.
కలర్ ఆప్షన్స్
Lava Yuva 3 Pro మెుబైల్‌ను మూడు కలర్ వేరియంట్లలో తీసకొచ్చారు. డిసెర్ట్ గోల్డ్ ( Desert Gold), ఫారెస్ట్ విరిడియన్ (Forest Viridian), మీడౌ పర్పుల్ (Meadow Purple) రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు.
ధర ఎంతంటే?
ఈ లావా మెుబైల్ ధర విషయానికి వస్తే 8GB RAM + 128GB ROM వేరియంట్ ధర రూ. 8,999గా ఉంది. లావా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు రీటైల్ స్టోర్లలో ఫోన్‌ను పొందవచ్చు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం