Lavanya Tripathi: విదేశాల్లో వరుణ్‌ తేజ్‌తో కలిసి లావణ్య త్రిపాఠి ఎంజాయ్.. వరుణ్ బాధను తగ్గించేందుకే వెకేషన్?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Lavanya Tripathi: విదేశాల్లో వరుణ్‌ తేజ్‌తో కలిసి లావణ్య త్రిపాఠి ఎంజాయ్.. వరుణ్ బాధను తగ్గించేందుకే వెకేషన్?

    Lavanya Tripathi: విదేశాల్లో వరుణ్‌ తేజ్‌తో కలిసి లావణ్య త్రిపాఠి ఎంజాయ్.. వరుణ్ బాధను తగ్గించేందుకే వెకేషన్?

    September 6, 2023

    మెగా ఫ్యామిలీకి కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి విదేశాల్లో వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం కాబోయే భర్త వరుణ్‌తో  అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.

    వెకేషన్‌ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కాస్త హాట్ లుక్‌లో కనిపించింది. వంకాయ కలర్ డ్రెస్‌లో సోగసుల విందు చేసింది. స్లీవ్ లెస్‌టాప్‌లో మెరసిపోయింది. 

    లావణ్య త్రిపాఠి టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందాల రాక్షసి సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేసిన ఈ భామ తన అందం, నటనతో చాలా మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. 

    భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా లాంటి సినిమా హిట్స్  ఈ సొట్ట బుగ్గల చిన్నదాని ఖాతాలో ఉన్నాయి.

     విభిన్న పాత్రలు చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉండే లావణ్య అంతరిక్షం లాంటి భిన్నమైన సినిమాలోనూ నటించింది.

    కుర్రహీరోల నుంచి అగ్రహీరోల సరసన పలు హిట్ సినిమాల్లో నటించినా… ఎందుకనో లావణ్యకు అవకాశాలు బాగా తగ్గాయి.

    రీసెంట్‌గా మెగా హీరో వరుణ్ తేజ్‌తో నిశ్చితార్థం జరుపుకోవడంతో ఒక్కసారిగా లావణ్య టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.  మిస్టర్ మూవీ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్. 

    ఇక వీరి లవ్ స్టోరీ విషయానికి వస్తే.. ఈ ఇద్దరూ 2017లో వచ్చిన మిస్టర్ సినిమాలో మొదటి సారి కలిసి నటించారు.  ఈ సినిమాలో ఇటలీలో షూటింగ్ జరుపుకుంది.

     ఆక్రమంలోనే ఇద్దరి అభిప్రాయాలు కలిసి తొలుత స్నేహితులుగా మారి తర్వాత పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారు.

    విశేషమేమిటంటే.. వీరి పెళ్లి తర్వాత.. హనీమూన్‌ను వారి ప్రేమకు బీజం వేసిన ఇటలీలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారంట.

    ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే…  శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో తెరకెక్కిన ముకుందాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు.  క్రిష్ కంచె మూవీతో నటనలో పరిణతి చెందాడు.

     

    అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసిన F2, శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాడు.

    రీసెంట్‌గా రిలీజైన గాండీవధారి అర్జున ఆశించినంత విజయం సాధించకపోవడంతో నిరాశలో ఉన్నాడు వరుణ్ తేజ్. ఈ క్రమంలోనే అతని బాధను తగ్గించేందుకు వెకేషన్ చేపట్టారు వరుణ్- లావణ్య త్రిపాఠి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version