LIFE CARING: మీ పిల్లలకు ఇవి నేర్పిస్తున్నారా? లేకపోతే భవిష్యత్తులో చాలా కష్టం.. ఓసారి చూడండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • LIFE CARING: మీ పిల్లలకు ఇవి నేర్పిస్తున్నారా? లేకపోతే భవిష్యత్తులో చాలా కష్టం.. ఓసారి చూడండి!

    LIFE CARING: మీ పిల్లలకు ఇవి నేర్పిస్తున్నారా? లేకపోతే భవిష్యత్తులో చాలా కష్టం.. ఓసారి చూడండి!

    August 19, 2023

    ఆడపిల్లైన, మగపిల్లాడైనా నిజ జీవితంలో తల్లిదండ్రులు తప్పకుండా వారికి నేర్పితీరాల్సిన లైఫ్‌ స్కిల్స్‌ కొన్ని ఉన్నాయి. బాల్యం నుంచే ఈ జీవన నైపుణ్యాలను వారికి పరిచయం చేయాలి. లేకపోతే పెద్దయ్యాక ఇబ్బంది పడతారు.  ఇప్పటి తల్లిదండ్రులు పిల్లలు అడిగిందల్లా ఇవ్వడమే ప్రేమ అనుకుంటారు. ఇలాగే గారాబం చేస్తే.. జీవితంలో ఏదీ కష్టపడకుండానే వచ్చేస్తాయనే భ్రమపడుతుంటారు. మీరు పడ్డ కష్టాలు మీ బిడ్డలు పడొద్దు అనుకోవడంలో తప్పు లేదు.  అలాగాని అన్ని అడగకుండనే చేసిపెడితే .. వారు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇలా జరగకూడదంటే పిల్లలకు కొన్నింటిని తప్పకుండా నేర్పించాలి అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

    మంచి అలవాట్లు

    సమయానికి నిద్ర, పరి శుభ్రత.. పసితనం నుంచే అలవాటు చేయాలి. అవసరమైతే ఈ విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక వ్యాధులబారిన పడుతున్నవారిలో అధికశాతం.. ఆరోగ్యకరమైన అలవాట్లు లేనివారే అని ఓ అధ్యాయనంలో తెలిసింది.

    వంట చేయడం

    వంట తెలిస్తే తంట ఉండదు. ఎవరో వండిపెట్టేదాకా ఎదురుచూడాల్సిన అవసరం రాదు. స్విగ్గీ, జొమాటో ఆర్డర్లతో వందల రూపాయలు వదిలించుకునే బాధ తప్పుతుంది. ఇష్టమైనవి వండుకోవడంలో, ఇష్టమైనవారికి వండిపెట్టడంలో ఎంతో సంతృప్తి ఉంటుంది.

    ఇల్లు సర్దుకోవడం

    పుస్తకాలు ఒక క్రమపద్ధతిలో ఉంటే.. రెఫరెన్స్‌ కోసమో, చదువుకోడానికో వెంటనే తీసేసుకోవచ్చు. బట్టల్ని ప్రాధాన్య క్రమంలో జోడించి పెట్టుకుంటే.. బయటికి వెళ్తున్నప్పుడు సమయం వృథా కాదు. ఔషధాలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు, రసీదులు.. ఎక్కడ ఉండాల్సినవి అక్కడే ఉండాలి. ఈ విషయంలో బాల్యం నుంచే బాధ్యత పెంచాలి.

    లక్ష్యం పట్ల అవగాహన

    పిల్లల వయసుకి తగ్గ లక్ష్యాలను మీరే నిర్దేశించండి. అవి చదువు, క్రీడలూ, ఇతరత్రా అలవాట్లు ఏవైనా కావొచ్చు. అవి వారు చేరుకోగలిగినప్పుడు మాత్రమే కోరుకున్నవి అందించండి. అప్పుడు ఉన్నత లక్ష్యాలను చేరుకునే కొద్దీ కోరుకున్నవి సులువుగా దక్కుతాయని తెలుసుకోగలుగుతారు.

    ఆర్థిక అక్షరాస్యత 

    ఖర్చు-సంపాదన.. ఈ నాలుగు అంశాల చుట్టూ తిరుగుతాయి మన జీవితాలు. ఆర్థిక పరిజ్ఞానం లేకపోతే కుబేరుడైనా ఏదో ఓ దశలో బికారి అవుతాడు. కాబట్టి, పిల్లలకు రూపాయి విలువ తెలియజెప్పండి. వృథా ఖర్చులు తగ్గించుకునేలా చూడండి.

    ఆత్మరక్షణ

    సిక్స్‌ ప్యాక్‌, ఫైవ్‌ ప్యాక్‌ అవసరం లేదు. దృఢంగా ఉంటే చాలు. అవసరమైనప్పుడు తమను తాము రక్షించుకోగలిగే సామర్థ్యాలను పిల్లలకు నేర్పాలి. కరాటేలాంటి ఆత్మరక్షణ విద్యలు నేర్పిస్తే మరీ మంచిది. శరీరం ఉక్కులా ఉంటే.. మనసుకూ బలమే. ఈత ఆరోగ్యకరం.  మీరు నేర్పించే ఈత ఒలింపిక్స్‌లో పతకం సాధించాల్సిన పన్లేదు. సప్త సముద్రాలు ఈదాల్సిన అగత్యమూ లేదు. అత్యవసర పరిస్థితుల్లో జల ప్రవాహంలోంచి ఒడ్డున పడగలిగేంత నైపుణ్యం నేర్పిస్తే సరిపోతుంది. ప్రమాదంలో ఉన్నవారిని గట్టుకు చేర్చగలిగితే ఇంకా మంచిది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version