Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్‌ జర్నీ.. సుధీర్‌ బాబు హిట్‌ కొట్టినట్లేనా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్‌ జర్నీ.. సుధీర్‌ బాబు హిట్‌ కొట్టినట్లేనా?

    Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్‌ జర్నీ.. సుధీర్‌ బాబు హిట్‌ కొట్టినట్లేనా?

    October 10, 2024

    నటీనటులు : సుధీర్‌ బాబు, షియాజీ షిండే, హర్షిత్ రెడ్డి, ఆమని, రాజ్‌ సుందరం, శశాంక్‌, సాయి చంద్‌, ఆర్నా, చంద్ర వేంపతి తదితరులు

    దర్శకత్వం : అభిలాష్ కంకర

    సంగీతం : జై కృష్ణ

    సినిమాటోగ్రఫీ : సమీర్ కల్యాణి

    ఎడిటింగ్‌ : అనిల్‌ కుమార్‌. పి

    నిర్మాత : సునీల బలుసు

    విడుదల తేదీ: 11-10-2024

    సుధీర్‌ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’ (Maa Nanna Super Hero Review). ఆర్ణా కథానాయికగా చేసింది. షాయాజీ షిండే, సాయిచంద్‌ కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 11న ఈ మూవీ రిలీజ్‌ కానుండగా ఒక రోజు ముందే ప్రీమియర్స్‌ ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తండ్రి సెంటిమెంట్‌ ప్రేక్షకులను మెప్పించిందా? వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సుధీర్‌ బాబుకు సక్సెస్‌ అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం. 

    కథేంటి

    ప్రకాష్‌ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. బిడ్డని ప్రసవించి భార్య చనిపోవడంతో రోజుల బిడ్డను అనాథశ్రమంలో ఉంచి పనికోసం బయటకు వెళ్తాడు. అనూహ్యంగా అరెస్టై 20 ఏళ్లు జైల్లో ఉండిపోతాడు. మరోవైపు ఆ పిల్లాడు జానీ (సుధీర్‌ బాబు)ని స్టాక్‌ బ్రోకర్‌ శ్రీనివాస్‌ (షియాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. జానీ ఇంటికి వచ్చినప్పటి నుంచి శ్రీనివాస్‌ జీవితం తలకిందులు అవుతుంది. వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పులపాలవుతాడు. ఈ కష్టాలన్నీ జానీ వల్లే అని భావించి అతడిపై ద్వేషం పెంచుకుంటాడు. ఊరంతా అప్పులు చేస్తుంటాడు. కానీ జానీకి మాత్రం శ్రీనివాస్ అంటే చాలా ప్రేమ. తండ్రి చేసిన అప్పులు కడుతూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ పవర్‌ఫుల్‌ రాజకీయ నాయకుడికి శ్రీనివాస్‌ రూ.కోటి బాకీ పడతాడు. అదే సమయంలో తన అసలైన తండ్రి ప్రకాష్‌ను జానీ కలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? శ్రీనివాస్‌ అప్పు తీర్చడానికి జానీ ఎన్ని పాట్లు పడ్డాడు? జానీ ప్రేమను శ్రీనివాస్‌ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    ఇప్పటివరకూ చేసిన చిత్రాలతో పోలిస్తే ఇందులో డిఫరెంట్‌ సుధీర్‌ బాబుని చూడవచ్చు. గతంలో బాడీ చూపిస్తూ యాక్షన్‌ సినిమాలు చేసిన అతడు ఇందులో మెచ్యూర్డ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. చక్కగా భావోద్వేగాలు పలికించాడు. పరిపూర్ణ నటుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. పెంపుడు తండ్రిగా షాయాజీ షిండే మంచి నటన కనబరిచాడు. అయితే అతడి క్యారెక్టర్‌లో డెప్త్‌ మిస్‌ అయ్యింది. మరోవైపు అసలు తండ్రిగా చేసిన సాయి చంద్‌ తనదైన యాక్టింగ్‌తో పాత్రలో జీవించేశాడు. సినిమాలో మేజర్‌ సన్నివేశాలన్నీ ఈ మూడు పాత్రల చుట్టే తిరుగుతాయి. హీరోయిన్‌గా ఆర్ణా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అక్కడక్కడ తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    తమిళం, మలయాళ భాషల చిత్రాలు చూసి తెలుగులో ఎందుకు ఇలాంటి ఫీల్‌గుడ్‌ చిత్రాలు రావని భావించేవారికి ఈ చిత్రం గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. దర్శకుడు అభిలాష్‌ కంకర ఎమోషనల్‌ టచ్‌ ఉన్న కథను ఈ సినిమాకు ఎంచుకున్నారు. చిన్నప్పుడే కొడుకును దూరం చేసుకున్న తండ్రి, పక్కనే ఉన్నా పట్టించుకొని పెంపుడు తండ్రి ఇలా భావోద్వేగాల నడుమ కథను నడిపించారు. అయితే నాన్నపై కొడుకుకి ఉన్న ప్రేమను ఎస్టాబ్లిష్‌ చేయడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. ఎమోషన్‌ క్యారీ అయిన తర్వాతే అసలైన కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. ఫస్టాఫ్‌ మెుత్తం సుధీర్‌ బాబు, షాయాజీ షిండేల మధ్య కథ నడిపిన దర్శకుడు సెకాండాఫ్‌లో సాయి చంద్‌ పాత్రను తెరపైకి తీసుకొచ్చారు. సెకాండాఫ్‌ను మరింత ఎమోషనల్‌గా నడిపే ప్రయత్నం చేశారు. లాస్ట్‌ 20 నిమిషాలు ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించారు. నెమ్మదిగా సాగే కథనం, కమర్షియల్‌ హంగులు లేకపోవడం మైనస్‌గా మారాయి. 

    టెక్నికల్‌గా

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే జై కృష్ణ నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఎడిటింగ్‌ మాత్రం ఇంకాస్త బెటర్‌గా చేసి ఉంటే బాగుండేది. ల్యాగ్‌ సీన్లను తొలగించి సినిమాను ఇంకాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • కథ
    • సుధీర్ బాబు నటన
    • నేపథ్య సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • స్లో న్యారేషన్‌
    • కమర్షియల్‌ హంగులు లేకపోవడం
    Telugu.yousay.tv Rating : 3/5 
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version