Macherla Niyojakavargam Review
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Macherla Niyojakavargam Review

    Macherla Niyojakavargam Review

    August 12, 2022

    నితిన్ హీరోగా న‌టించిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఒక క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉంటాయ‌ని చిత్ర‌బృందం మొద‌టినుంచి చెప్తుంది. కృతిశెట్టి, క్యాథ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు. శ్రేష్ఠ్ మూవీస్ నిర్మాణంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

    కథేంటంటే..

    సిద్ధార్థ్‌ రెడ్డి(నితిన్‌) ఒక ఐఏఎస్ ఆఫీస‌ర్‌. అత‌డికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా పోస్టింగ్ వ‌స్తుంది. అక్క‌డ రాజ‌ప్ప అనే బ‌డా రౌడీ, రాజ‌కీయ‌నాకుడితో సిద్ధార్త్ రెడ్డికి వైరం ఏర్ప‌డుతుంది. మ‌రి రాజ‌ప్ప‌ను ఎదిరించి క‌లెక్ట‌ర్‌గా మాచ‌ర్ల‌లో ఎలా ఎల‌క్షన్స్ జ‌రిపించాడు? ఈ క్ర‌మంలో ఎటువంటి సంఘ‌ట‌న‌లు ఎదుర‌య్యాయి? తెలియాలంటే వెండితెర‌పై చూడాల్సిందే. 

    విశ్లేష‌ణ‌:

    20 సినిమాల‌కు పైగా ఎడిట‌ర్‌గా ప‌నిచేసిని రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మొద‌టి సినిమా ఇది. క‌థ‌లో కొత్త‌గా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. హీరో-విల‌న్‌కు మ‌ధ్య జ‌రిగే గొడ‌వ‌. కానీ దాన్ని తెర‌పై ఎలా ఆస‌క్తిక‌రంగా చూపించాడు అనేదే అస‌లు పాయింట్. ఈ క‌థ‌లో ఒక క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు కావాల్సిన హంగుల‌న్నీ ఉన్నాయి. కామెడీ, యాక్ష‌న్, పాట‌లు, రొమాన్స్ అన్ని స‌మ‌పాళ్ల‌లో కుదిరాయి. మొద‌టిభాగంలో  వెన్నెల కిశోర్ కామెడీతో క‌థ‌ను న‌డిపించేశాడు. దీంతో క‌థ‌ను కాస్త సాగ‌దీసిన‌ట్లుగా అనిపిస్తుంది. ఇంట‌ర్వెల్ ట్విస్ట్, ఆ త‌ర్వాత రెండోభాగంలో యాక్ష‌న్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఈ క‌థ‌కు యాక్ష‌న్ సీన్స్ బ‌లంగా మారాయి. ప్ర‌త్యేకంగా దీని కోసం న‌లుగురు ఫైట్ మాస్ట‌ర్స్ ప‌నిచేశారు. కృతిశెట్టి నితిన్‌కు ప‌ర్‌ఫెక్ట్ జోడీగా క‌నిపించింది. సాంగ్స్‌లో డ్యాన్సుల‌తో ఇర‌గ‌దీసింది. క్యాథ‌రిన్ ఒక గ్లామ‌ర్ పాత్ర‌లో మెరిసింది. ఇక అంజ‌లి రారా రెడ్డి పాట‌లో ఎన‌ర్జిటిక్ డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టింది. 

    ఎవ‌రెలా చేశారంటే..

    నితిన్ మొద‌టిసారిగా ఇలా ఒక క్లాస్ లుక్‌తో మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టించాడు. చూసేందుకు క్లాస్‌గా క‌నిపించే హీరో, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లో అద‌ర‌గొట్టాడు. కృతి శెట్టి ఆమె పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించింది. క్యాథ‌రిన్ గ్లామర‌స్ పాత్ర‌లో కాసేపు మెరుస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వెన్నెల కిశోర్ , రాజేంద్ర ప్ర‌సాద్, ముర‌ళి శ‌ర్మ‌ల కామెడీ. బ్ర‌హ్మాజీ, శ్యామ‌ల‌, ఇంద్ర‌జ త‌దిత‌రులు వారి పాత్ర‌ల ప‌రిధిమేర‌కు న‌టించారు. 

    సాంకేతిక విష‌యాలు:

    రాజశేఖ‌ర్ రెడ్డికి ద‌ర్శ‌కుడిగా మొద‌టి సినిమా అయిన‌ప్ప‌టికీ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను తెర‌కెక్కించ‌డ‌లో స‌ఫ‌ల‌మ‌య్యాడు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో యాక్ష‌న్స్ సీన్స్‌కు ఎలివేష‌న్ తెచ్చాడు. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ఎడిట‌ర్ కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర రావు, డీఓపీ ప్ర‌సాద్ మూరెళ్ల ప‌నితీరు బాగుంది.

    బ‌లాలు:

    యాక్ష‌న్ సీన్స్‌

    బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

    బ‌ల‌హీన‌త‌లు:

    రొటీన్ స్టోరీ

    మొద‌టి భాగం సాగ‌దీసే క‌థ‌

    రేటింగ్: 2.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version