ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మడాక్ ఫిల్మ్స్ (MADDOCK Films).. హారర్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయింది. ఆ సంస్థ నిర్మాత దినేష్ విజన్ (Dinesh Vijan) ఇటీవల నిర్మించిన ’స్త్రీ 2’, ‘ముంజ్యా’ చిత్రాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ‘స్త్రీ 2’ చిత్రం బాలీవుడ్‌లో వసూళ్ల సునామీ సృష్టించింది. దీంతో ఈ విజయపరంపరను కొనసాగిస్తూ పలు హిట్ చిత్రాలకు సీక్వెల్స్‌ను మడాక్ ఫిల్స్మ్ తీసుకొస్తోంది. ఒకేసారి ఎనిమిది హారర్ చిత్రాలకు సంబంధించిన విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
రష్మిక ఫస్ట్ హారర్ ఫిల్మ్ ఎప్పుడంటే?
స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం అక్కడ కెరీర్‌లోనే తొలిసారి ఓ హారర్ చిత్రంలో రష్మిక నటిస్తోంది. ‘థామా’ (Thama) అనే పేరుతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఆదిత్య సర్పోత్ధార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ మూవీని 2025 దీపావళికి విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది. తన బ్యానర్‌లో వస్తోన్న 8 చిత్రాల విడుదల తేదీలతో పాటే వెల్లడించింది.
‘భేడియా’, ‘ముంజ్యా’కు సీక్వెల్స్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేసిన ‘భేడియా’ కొనసాగింపుగా ‘భేడియా 2’ రాబోతోంది. దీనిని 2026 ఆగస్టు 14న దీన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సాలిడ్ వసూళ్లు సాధించిన ‘ముంజ్యా’కు సీక్వెల్‌గా ‘మహా ముంజ్యా’ తెరకెక్కుతోంది. శార్వరీ వాఘ్, అభయ్ వర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం 2027 డిసెంబరు 24న థియేటర్లలోకి రాబోతుంది. వీటితో పాటు ‘శక్తి శాలిని’ (డిసెంబర్ 31), ‘పెహ్లా మహాయుద్ధ్’ (ఆగస్టు 11), ‘దూస్రా మహాయుద్ధ్’ (అక్టోబర్ 18) వంటి చిత్రాల విడుదల తేదీల్ని కూడా నిర్మాణ సంస్థ రివీల్ చేసింది.
‘స్త్రీ 3’ వచ్చేస్తోంది..
2018లో వచ్చిన ‘స్త్రీ’ (Stree) చిత్రం హిందీలో మంచి విజయాన్ని సాధించింది. ఇటీవలే దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘స్త్రీ 2’ (Stree 2) సైతం బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించింది. అమర్ కౌశిక్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రాజ్‌కుమార్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. హారర్ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకున్న ‘స్త్రీ’ మూవీ సిరీస్ నుంచి మూడో భాగాన్ని తీసుకొస్తున్నట్లు నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ ప్రకటించింది. ‘స్త్రీ’ చిత్రాల్లో మూడో భాగం 2027 ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. థ్రిల్ అవుతూ కడుపుబ్బా నవ్వులతో భయపడడానికి మీరంతా సిద్ధమేనా?’ అంటూ నిర్మాణ సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చింది.
భయపెట్టనున్న అలియా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో అలియా భట్ ఒకరు. ఇప్పటివరకూ ఆమె కమర్షియల్, కామెడీ, లవ్ ఎంటర్‌టైనర్ చిత్రాల్లో మాత్రమే చేసింది. అయితే రొటీన్‌కు భిన్నంగా అందర్నీ భయపట్టేందుకు అలియా రెడీ అయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో ‘చాముండ’ (Chamunda) అనే సినిమా రూపొందుతున్నట్లు కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. వాటిని నిజం చేస్తూ ఈ సినిమాను మడాక్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను 2026 డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. కాగా, ప్రస్తుతం అలియా ‘ఆల్ఫా’ సినిమా షూట్‌లో బిజీగా ఉంది.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?