Maharaja Movie Review: కర్మ సిద్దాంతంతో వచ్చిన రీవేంజ్‌ డ్రామా.. ‘మహారాజా’ మెప్పించాడా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Maharaja Movie Review: కర్మ సిద్దాంతంతో వచ్చిన రీవేంజ్‌ డ్రామా.. ‘మహారాజా’ మెప్పించాడా?

    Maharaja Movie Review: కర్మ సిద్దాంతంతో వచ్చిన రీవేంజ్‌ డ్రామా.. ‘మహారాజా’ మెప్పించాడా?

    June 14, 2024

    నటీనటులు: విజయ్‌ సేతుపతి, అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌, నటరాజ్‌, భారతీరాజా, అభిరామి తదితరులు

    రచన, దర్శకత్వం: నిథిలన్‌ స్వామినాథన్‌

    సంగీతం: అజనీశ్‌ లోకనాథ్‌

    ఎడిటింగ్‌: ఫిల్లోమిన్‌ రాజ్‌

    సినిమాటోగ్రఫీ: దినేశ్ పురుషోత్త‌మ‌న్‌

    నిర్మాత: సుదర్శన్‌ సుందరమ్‌, జగదీశ్‌ పళనిస్వామి

    విడుదల : 14-06-2024

    తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మహా రాజా’ (Maharaja). అతడి కెరీర్‌లో 50వ చిత్రంగా ఇది రూపొందింది. దీంతో ఈ సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. నిథిలాన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మమతా మోహన్‌ దాస్‌, అనురాగ్‌ కశ్యప్‌, మునీశ్‌ కాంత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం సమకూర్చారు. జూన్‌ 14న ప్రపంచవ్యాప్తంగా తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజైంది. మరి ‘మహా రాజా’ ఎలా ఉంది? ఎప్పటిలాగే విజయ్‌ సేతుపతి తన నటనతో అదరగొట్టాడా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.

    కథేంటి

    బార్బర్‌గా పనిచేసే మ‌హారాజా (విజ‌య్ సేతుప‌తి) ఒక‌ ప్ర‌మాదంలో భార్య‌ను పోగొట్టుకుంటాడు. కూతురు జ్యోతియే ప్రాణంగా సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. కట్‌ చేస్తే ఒక రోజు మ‌హారాజా గాయాల‌తో పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్తాడు.  ఆగంత‌కులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి త‌న‌పై దాడి చేశార‌ని ఫిర్యాదు చేస్తాడు. ఈ క్ర‌మంలోనే త‌న బిడ్డ ప్రాణాల్ని కాపాడిన ల‌క్ష్మీని ఎత్తుకెళ్లిపోయార‌ని చెబుతాడు. ఎలాగైన ఆ ల‌క్ష్మిని వెతికి పెట్ట‌మ‌ని పోలీసుల‌ను వేడుకుంటాడు. ఇంతకీ ఆ ల‌క్ష్మి ఎవ‌రు? మహారాజాపై దాడి ఎందుకు జరిగింది? వారితో మహారాజాకు ఉన్న వైరం ఏంటి? మహారాజా కూతురికి జరిగిన అన్యాయం ఏంటి? చివరికీ లక్ష్మీ దొరికిందా? లేదా? అన్నది కథ. 

    ఎవరెలా చేశారంటే

    మహారాజా పాత్రలో విజయ్‌ సేతుపతి ఎప్పటిలాగే అద్భుత నటన కనబరిచాడు. సినిమా మెుత్తాన్ని తన భుజాలపై మోశారు. తన కూతురికి అన్యాయం చేసిన వారిని వెంటాడి హతమార్చే క్రమంలో వచ్చే మాస్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. ఇక కూతురు జ్యోతి పాత్రలో సచిన నటన మెప్పిస్తుంది. క్లైమాక్స్‌లో ఆమె నటన శభాష్‌ అనేలా ఉంటుంది. అటు ప్రతినాయకుడిగా సెల్వం పాత్రలో అనురాగ్‌ కశ్యప్‌ ఆకట్టుకున్నారు. మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌, భార‌తీరాజా, మ‌ణికంద‌న్‌, అరుళ్‌దాస్‌ త‌దిత‌రులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు నిథిల స్వామినాథన్‌.. ఒక రొటీన్‌ రివేంజ్‌ డ్రామాను తెరకెక్కించినట్లు అనిపించినా కథకు కర్మ సిద్దాంతాన్ని జోడించడం వల్ల సినిమా కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లేను ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా న‌డిపిన తీరు.. విజ‌య్ సేతుప‌తి విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌ ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా నిల‌బెట్టాయి. ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్టుల‌తో భావోద్వేగ‌భ‌రితంగా దర్శకుడు సినిమాను ముగించారు. ముఖ్యంగా ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో వ‌చ్చే మ‌లుపులు ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌ను పంచుతాయి. ప్ర‌థమార్ధంలో ఎక్కువ భాగం పాత్ర‌ల ప‌రిచ‌యాల‌కే కేటాయించినప్పటికీ డైరెక్టర్‌ ఎక్కడా బోర్‌ కొట్టించలేదు. ఓ వైపు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా.. మరోవైపు లక్ష్మీ, జ్యోతి ఎపిసోడ్స్‌ను సమాంతరంగా చూపిస్తూనే వాటన్నింటిని లింకప్‌ చేసిన విధానం మెప్పిస్తుంది. ఈ కథకు ముగింపు పలికిన తీరు ప్రేక్షకులకు సంతృప్తికరంగా అనిపిస్తుంది. 

    టెక్నికల్‌గా..

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతం సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. ఫిలోమిన్ ఎడిటింగ్ ప్ర‌తిభ‌.. దినేశ్ సినిమాటోగ్రఫీ ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. 

    ప్లస్‌ పాయింట్‌

    • విజయ్‌ సేతుపతి నటన
    • ట్విస్టులు
    • సంగీతం

    మైనస్‌ పాయింట్‌

    • స్లో నారేషన్‌
    • సాగదీత సన్నివేశాలు

    Telugu.yousay.tv Rating : 3/5  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version