అది సార్… మహేష్ బాబు రేంజ్ అంటే..బిల్ గేట్స్ తోనే మూవీ ప్లాన్?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అది సార్… మహేష్ బాబు రేంజ్ అంటే..బిల్ గేట్స్ తోనే మూవీ ప్లాన్?

    అది సార్… మహేష్ బాబు రేంజ్ అంటే..బిల్ గేట్స్ తోనే మూవీ ప్లాన్?

    సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇటీవల తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లిన మహేష్ న్యూయార్క్ లో బిల్ గేట్స్ ను కలిశాడు. ఆయనతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై బిల్ గేట్స్.. రిప్లై ఇవ్వడమే కాదు.. ఏకంగా మహేష్ బాబును ఇన్ స్టాగ్రాం, ట్విట్టర్ లో ఫాలో అయ్యారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిల్ గేట్స్ కేవలం మహేష్ బాబును మాత్రమే ఫాలో అవుతున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. “అది సార్ సూపర్ స్టార్ రేంజ్ అంటే” అని.. సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తున్నారు. ఇదే సమయంలో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట విజయవంతంగా 50రోజులు పూర్తి చేసుకుని రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. దీంతో ఈ రెండూ సందర్భాలు ఒకేసారి రావడంతో మహేష్ బాబు అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

       సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం న్యూయార్క్ వెళ్లాడు. తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆయన బిల్ గేట్స్ ను కలిశాడు. తాను, నమ్రత.. బిల్ గేట్స్ తో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ లో  షేర్ చేశాడు. “బిల్ గేట్స్ ను కలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచం చూసిన అతి కొద్దిమంది దార్శనికులలో ఆయన ఒకరు, అయినా.. ఆయన చాలా సింపుల్ గా ఉంటూ, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు” అంటూ వ్యాఖ్యానించాడు.

     మహేష్ బాబు పోస్టుకు బిల్ గేట్స్ కూడా ట్లిట్టర్ లో రిప్లై ఇస్తూ.. “న్యూయార్క్‌లో ఉండటం ఎల్లప్పుడూ సరదాగా ఉంటుంది – మీరు ఎవరిని కలుస్తారో మీకు ఎప్పటికీ తెలియదు. మిమ్మల్ని(మహేష్ బాబు) నమ్రతను కలవడం చాలా గొప్పగా ఉంది” అంటూ మహేష్ దంపతులను కలవడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇన్ స్టాలోనూ “గొప్ప మనసులు ఒకేలా ఉంటాయి. మిమ్మల్ని, నమ్రతను కలవడం సంతోషంగా ఉంది” అంటూ పోస్ట్ చేశారు. అంతే కాదు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో మహేష్ బాబును.. బిల్ గేట్స్ ఫాలో అయ్యారు.

       భారత చలనచిత్ర పరిశ్రమలో బిల్ గేట్స్ ఒక్క మహేష్ బాబును మాత్రమే ఆయన ఫాలో అవుతున్నారు. ఇదంతా చూసిన సూపర్ స్టార్ అభిమానులు ఉబ్బితబ్బిబ‌వుతున్నారు.  రకరకాలుగా ఫోస్టులు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. “అది సార్ మహేష్ రేంజ్ అంటే, సూపర్ స్టార్ క్రేజ్ టాలీవుడ్ కే కాదు ఏకంగా హాలీవుడ్ వరకు చేరింది” అంటూ సోషల్ మీడియాలో తెగ సంబరపడి పోతున్నారు.

     ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోకు దక్కని గౌరవం మహేష్ కు దక్కిందంటూ కామెంట్ చేస్తున్నారు. బిజినెస్ మ్యాన్ మూవీలోని ఓ డైలాగ్ గుర్తు చేస్తూ.. సూర్య ఇంపోర్ట్ అండ్ ఎక్స్ పోర్ట్ కంపెనీ సీఈవో అయిన మహేష్ బాబు.. “సూర్య ట్యాక్స్” గురించి బిల్ గేట్స్ కు వివరిస్తున్నాడని ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. మరోవైపు వీరిద్దరూ అసలు కలవడం వెనుక ఉన్న రహస్యం ఏమిటని సామాజిక మాధ్యమాల్లో ఎత్తున చర్చ మొదలైంది. మహేష్ బాబు బిల్ గేట్స్ ను కలవడం.. యాదృచ్చికమేనా? లేక ఏదైనా వ్యాపారరీత్యా కలిశారా? అని చర్చిస్తున్నారు. ఎందుకంటే మహేష్ బాబు ఒకవైపు నటుడిగా రాణిస్తూనే మరోవైపు నిర్మాతగా చిత్రాలు నిర్మిస్తూ మంచి విజయాలు అందుకుంటున్నాడు. కొన్ని వ్యాపారాలు కూడా చేస్తున్నారు. కొంత మంది అభిమానుల ఊహా మరోలా ఉంది. త్రిక్రిమ్, మహేష్ బాబు కలయికలో త్వరలో రానున్న  #MAHESHBABU28 మూవీలో బిల్ గేట్స్ తో ఓ కీలక పాత్ర చేయించేందుకు కలిశారని అనుమానిస్తున్నారు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ బాధ్యతల నుంచి బిల్ గేట్స్ తప్పుకోవడం, తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఫౌండేషన్ కార్యక్రమాలకే బిల్ గేట్స్ పరిమితం అయ్యారు. ఈ క్రమంలోనే ఆయనతో సినిమా చేసేందుకు మహేష్ కలిశారని తమదైన శైలీలో ఫ్యాన్స్ వివరణలు ఊదరగొడుతున్నారు .

    ఇదే సమయంలో సర్కారువారి పాట మూవీ 50రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుని దూసుకెళ్తోంది.  దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందం రెట్టింపైంది. తొలుత ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా… క్రమంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మూవీపై డివైడ్ టాక్ తీసుకొచ్చిన ఇతర హీరోలా ఫ్యాన్స్ కి ఈ విజయమే గట్టి సమాధానమని సామాజిక మాధ్యమాల్లో మహేష్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ‘ఇకపై అనవసరంగా గొడవలు పడి మహేష్ బాబు రేంజ్, మన ఫ్యాన్స్ రేంజ్ తగ్గించొద్దని’ కామెంట్ చేస్తున్నారు. 50రోజుల ఫంక్షన్ ను మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా నిర్మాణ సంస్థ నిర్వహించి అభిమానులకు సూపర్ ట్రీట్ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version