టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj), బాలీవుడ్ నటి మహిరా శర్మ (Mahira Sharma)తో రిలేషన్‌లో ఉన్నట్లు ఒక్కసారిగా వార్తలు ఊపందుకున్నాయి.
ఇటీవల మహిరా పోస్టు చేసిన బ్యాక్‌లెస్ డ్రెస్ ఫొటోకి సిరాజ్ లైక్ కొట్టడంతో ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.
సిరాజ్ లైక్‌ను గమనించిన నెటిజన్లు ఒక్కసారిగా దాన్ని వైరల్ చేశారు. దీంతో అప్రమత్తమైన సిరాజ్ ఆ లైక్ తీసేయడం గమనార్హం.
అంతేకాదు వీరిద్దరూ డేట్‌కు సైతం వెళ్లారని , ఒకే లోకేషన్స్‌లో చాలా సార్లు కనిపించారని కూడా కొందరు నెట్టింట పోస్టులు చేస్తున్నారు.
సిరాజ్ గర్ల్‌ఫ్రెండ్ (Mahira Sharma) అంటూ బాలీవుడ్‌లో సైతం ప్రచారం జరుగుతుండటంతో అందరి దృష్టి మహిరా శర్మపై పడింది. ఆమె గురించి తెలుసుకునేందుకు క్రికెట్ లవర్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
మహిరా వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1997 నవంబర్ 25న జమ్ము కశ్మీర్‌లో జన్మించింది. స్కూలింగ్ అనంతరం ఆమె ఫ్యామిలీ ముంబయికి షిఫ్ట్ అయ్యింది.
ఆ తర్వాత ముంబయి విశ్వవిద్యాలయంలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్‌లో మహిరా డిగ్రీ చేసింది. ఆపై మోడల్‌గాను కెరీర్‌ను ప్రారంభించింది.
‘తారక్ మెహతా రివర్స్ గ్లాసెస్’ అనే టెలివిజన్ సిరీస్‌తో తొలిసారి బుల్లితెరపై మహిరా అడుగుపెట్టింది.
ఆ తర్వాత నుంచి హిందీలో వరుసగా సీరియల్స్, టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా చేస్తూ తక్కువ కాలంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.
ముఖ్యంగా హిందీ బిగ్‌బాస్ సీజన్ 13లో అడుగుపెట్టడం ఈ భామ కెరీర్‌ను మలుపు తిప్పందని చెప్పవచ్చు. ఆ షో ద్వారా విపరీతమైన క్రేజ్‌ను మహిరా సొంతం చేసుకుంది.
మహిరా శర్మ (Mahira Sharma) కన్నా బిగ్‌బాస్ మహిరా అంటేనే బాలీవుడ్‌లో ఎక్కువ మంది ఆమెను గుర్తుపడతారు. అంతలా బిగ్‌బాస్ ఆమెకు ఫేమ్‌ను తీసుకొచ్చింది.
దీంతో పంజాబీ చిత్రాల్లో ఈ అమ్మడి (Mahira Sharma)కి వరుస అవకాశాలు వచ్చాయి. లంబోర్గినీ, రరాద్వా రిటర్న్స్ చిత్రాల్లో ఆమె నటించింది.
ఆ తర్వాత ‘ర్యాన్సమ్‌వేర్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి మహిరా అడుగుపెట్టింది. ‘ఫిరోతి బాజ్’ ఫిల్మ్‌లోనూ ఈ ముద్దుగుమ్మ కనిపించింది.
మహిరా తన సినిమాలు, సీరియల్స్ కంటే మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కనిపించడం ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యింది.
ఇప్పటివరకూ ఏకంగా 26 మ్యూజిక్ ఆల్బమ్స్‌లో మహిరా (Mahira Sharma) నటించింది. తన అందం, డ్యాన్స్, గ్లామర్‌తో యూట్యూబ్ సహా సోషల్ మీడియాను షేక్ చేసింది.
మహిరాకి ప్యారిస్ అంటే చాలా ఇష్టం. అక్కడి వెళ్లిన ప్రతీసారి ఓ పెర్‌ఫ్యూమ్ బాటిల్‌ను కొనుగోలు చేస్తానని చెబుతోంది.
ఫేవరేట్ స్టార్స్ విషయానికి వస్తే బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ అంటే ఈ భామకు చాలా ఇష్టం.
రెస్టారెంట్ ఫుడ్ కంటే స్ట్రీట్ ఫుడ్‌ను చాలా ఇష్టపడతానని మహిరా శర్మ (Mahira Sharma) ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ముఖ్యంగా వడాపావ్ అంటే తనకు బాగా ఇష్టమని చెప్పుకొచ్చింది.
మహిరా శర్మ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 8.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ