Manchu Manoj: తండ్రి చేసిన తప్పెంటో చెప్పేసిన విష్ణు.. కంటతడి పెట్టిన మనోజ్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Manchu Manoj: తండ్రి చేసిన తప్పెంటో చెప్పేసిన విష్ణు.. కంటతడి పెట్టిన మనోజ్‌

    Manchu Manoj: తండ్రి చేసిన తప్పెంటో చెప్పేసిన విష్ణు.. కంటతడి పెట్టిన మనోజ్‌

    December 11, 2024

    మంచు మోహన్‌ బాబు కుటుంబం (Manchu Family)లో చెలరేగిన వివాదం రోజు రోజుకి ముదిరి పాకాన పడుతోంది. గంటకో మలుపు తిరుగుతూ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు తావిస్తోంది. మోహన్‌ బాబు (Mohan Babu), మంచు మనోజ్‌ (Manchu Manoj) మధ్య రాజుకున్న వివాదంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తొలుత ఆస్తుల వ్యవహారంలా కనిపించినా రోజులు గడుస్తున్న కొద్ది కుటుంబంలోని మరిన్ని లొసుగులు వెలుగు చూస్తున్నాయి. పరస్పరం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం, ఫ్యామిలీ గొడవలు ప్రస్తావిస్తూ లేఖలు విడుదల చేయడం, ప్రెస్‌మీట్‌లు పెట్టి ఒకరినొకరు విమర్శించుకోవడం, మీడియాపై మోహన్‌ బాబు దాడి ఇలా వరుస ఘటనలతో మంచు లొల్లి తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారుతోంది. 

    మోహన్‌ బాబు హెల్త్‌ బులెటిన్‌

    మంగళవారం రాత్రి ఘర్షణ అనంతరం మోహన్‌బాబు అస్వస్థకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు తాజాగా హెల్త్‌ బులెటిన్‌ రిలీజ్‌ చేశారు. ‘డిసెంబర్ 10న రాత్రి 8 30 గంటలకు మోహన్ బాబు గారిని హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. బాడీ పెయిన్స్, యాంగ్జైటీతో సృహలేని స్థితిలో ఆయన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హుటాహుటిన ఆయకు ఎమర్జెనీ వైద్యాన్ని అందించాం.. ఆయన ఎడమ కంటి కింద గాయం అయింది.. రక్తపోటు చాలా పెరిగింది.. హార్ట్ రేట్ కూడా చాలా ఎక్కువగా పెరిగింది.. తగిన చికిత్సను అందించాం.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిమితంగానే ఉంది’ అని వైద్యులు తెలిపారు.

    రచ్చ పెట్టుకుంటే గెలవలేరు: విష్ణు

    కుటుంబంలో చెలరేగిన వివాదం నేపథ్యంలో మంచు విష్ణు (Manchu Vishnu) తాజాగా ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ క్రమంలో మంచు మనోజ్‌ చేస్తోన్న ఆరోపణలు గురించి మీడియా ప్రతినిధులు వివరణ కోరారు. అయితే ఫ్యామిలీ విషయాల గురించి తాను స్పందించనని విష్ణు తేల్చిచెప్పారు. కానీ, ఆత్మ గౌరవ పోరాటమంటూ మనోజ్‌ చేసిన వ్యాఖ్యలపై విష్ణు స్పందించాడు. ‘ప్రేమతో గెలవాల్సింది.. రచ్చ పెట్టుకుంటే ఎవరు గెలవలేరండి’ అంటూ చెప్పుకొచ్చాడు. మీరు మనోజ్‌ను శత్రువుగా చూస్తున్నారన్న ప్రశ్నపై ‘దాని గురించి చెప్పేదేమి లేదండి. ఇమ్మెచ్యూర్‌గా ఫ్యామిలీ గురించి తను మాట్లాడొచ్చు. చిన్నవాడిగా అవగాహన లేకుండా ఏదైనా చెప్పవచ్చు. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఫ్యామిలీ గురించి మాట్లాడను’ అని అన్నాడు. 

    మా నాన్న చేసిన తప్పు అదే: విష్ణు

    తాజా ప్రెస్‌ మీట్‌లో మంచు మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా నాన్న చేసిన పెద్ద తప్పు ఏదైన ఉందంటే అది ముగ్గురు పిల్లలను ఎక్కువగా ప్రేమించడమేనని అన్నారు. ‘ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం. ఇండస్ట్రీలో ఉన్నవారందరికీ ఇది తెలుసు. మీడియాకు నాదొక రిక్వెస్ట్‌. మీకు ఫ్యామిలీస్‌ ఉన్నాయి.. ఫాదర్స్‌ ఉన్నారు. ఏ కుటుంబం పర్ఫెక్ట్‌గా ఉండదు. పెద్దలంటారు ఫ్యామిలీస్ ఆర్‌ కాంప్లికేటెడ్ అని. నేననుకున్నా నా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని, కలిసిమెలిసి ఉంటామని అనుకున్నాం. అన్‌ఫార్చ్యునేట్‌గా ఇలా ప్రెస్‌ మీట్‌ పెట్టాల్సి వస్తది, ఇలా మాట్లాడాల్సి వస్తది, ఇలాంటి పరిస్థితి నా ఫ్యామిలీకి వస్తదని ఎప్పుడు ఊహించలేదు’ అని విష్ణు అన్నారు. 

    ‘నాన్నను  క్షమించండి’

    మంగళవారం రాత్రి జర్నలిస్టుపై మోహన్‌ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా మంచు విష్ణు స్పందించారు. ‘జర్నలిస్టుపై దాడి విచారకరం. జర్నలిస్ట్‌పై దాడిని ఖండిస్తున్నా. మా నాన్న తప్పు చేసుంటే క్షమించాలి. ఆయన మీడియాతో చాలా గౌరవంగా ఉంటారు. తరాలుగా మా నాన్న అంటే ఏంటో అందరికీ తెలుసు. సమాజంలో ఎవరూ పర్‌ఫెక్ట్‌ కాదు. ఉమ్మడి కుటుంబంలో కొన్ని గొడవలు వచ్చాయి. చివరికి అన్నీ సర్దుకుంటాయని అనుకుంటున్నా. నిన్నటి దాడిలో నాన్నకు గాయాలయ్యాయి. గొడవలతో మా అమ్మ ఆస్సత్రి పాలైంది. గేట్లు పగలగొట్టి మనోజ్‌ ఇంట్లోకి వచ్చాడు’ అని విష్ణు అన్నారు.

    కంటతడి పెట్టిన మనోజ్‌..

    మంచు విష్ణు కంటే ముందు సోదరుడు మనోజ్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో కంటతడి పెట్టి బావోద్వేగానికి గురయ్యారు.‘నా కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదు. ఇంట్లో వాళ్ల ఆదాయం మీద ఆధారపడలేదు. సొంతకాళ్లపై పనిచేసుకుంటున్నాను.  ఆస్తికోసం మా నాన్నతో గొడవ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. మా నాన్న దేవుడు.. కానీ.. ఈరోజు చూస్తున్నది మా నాన్నను కాదు. ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతాను. నేను ఎవరిపై దాడి చేశానో సీసీ కెమెరాల దృశ్యాలు చూపించండి. పోలీసుల విచారణ తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తా’ అని మనోజ్‌ వ్యాఖ్యానించారు.

    ‘అందుకే ఇంటికి వచ్చా’..

    కొంతమంది బంధువులు, నాన్న సన్నిహితుల సూచనతో ఈ ఇంటికి వచ్చానని మనోజ్‌ తెలిపారు. ‘ఎన్నో ఏళ్లుగా బయట ఉంటున్నావు. ఇంట్లో అమ్మానాన్న మాత్రమే ఉన్నారు. మీ అన్న ఫ్యామిలీతో దుబాయ్‌కు షిఫ్ట్‌ అయ్యాడు. నీ భార్య గర్భవతిగా ఉంది. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఈ సమయంలో నీ భార్యకు మీ తల్లి, పెద్దవాళ్ల అవసరముంది. ఒక్కడివే ఎలా చూసుకుంటావు?’ అని వారు నాతో అన్నట్లు చెప్పారు. తన భార్య కూడా వారిని సమర్థించి..  మాట వినాలని కోరడంతో ఈ ఇంటికి తిరిగి వచ్చానని వివరించారు. 

    ‘అన్న కోసం గొడ్డులా పనిచేశా’

    తనపై చాలా ఆరోపణలు చేస్తున్నారని మంచు మనోజ్‌ అన్నారు. ‘దీనికి నేనేమీ చెప్పలేను. ఆధారాలు మాత్రమే చూపించగలను. నేనెప్పటినుంచో కూర్చొని మాట్లాడదామన్నాను. ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకున్నాను. ఆమె కోసం పోరాడాను. అందులో తప్పేముంది? పది మంది కోసం నిలబడినందుకు నేను చెడ్డవాడిని అయ్యాను. ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ చేశాను. రమ్మంటే వచ్చాను.. పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని చేశాను. అన్న కంపెనీల్లో పనిచేశాను. గొడ్డులా కష్టపడ్డాను. మనస్ఫూర్తిగా, సంతోషంగా చేశాను. ఏ రోజూ ఒక్క రూపాయి అడిగింది లేదు.. ఆశించింది లేదు’ అని అన్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version