దేశంలో ఎన్నో రకాల కార్లు ఉన్నప్పటికీ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz)కు ఉన్న క్రేజే వేరు. ఆ కారు వినియోగించడాన్ని చాలా మంది గౌరవంగా భావిస్తుంటారు. అందుకే ఇతర కార్లతో పోలిస్తే బెంజ్‌కు గుడ్‌విల్ ఎక్కువ. ఇదిలా ఉంటే మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో కొత్త కారు Mercedes Benz AMG C43 4Matic సెడాన్‌ను విడుదల చేసింది. ఈ కారు అద్బుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని తయారీ సంస్థ పేర్కొంది. గత మోడల్స్‌తో పోలిస్తే ఎన్నో అడ్వాన్స్‌డ్ ఫీచర్లను ఈ కారులో ఫిక్స్ చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో వాటిపై ఓ లుక్కేద్దాం.
డైనమిక్ డ్రైవింగ్
Benz AMG C43 కారు ఇంజిన్ మునిపటి కార్లతో పోలిస్తే డైనమిక్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని తయారీ సంస్థ తెలిపింది. ఈ ఇంజిన్‌ను టర్బోఛార్జర్ టెక్నాలజీతో తీసుకొచ్చారు. ఫార్ములా F1 నుంచి నేరుగా ఈ టెక్నాలజీని తీసుకున్నారు. 48v ఆన్‌బోర్డ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆధారంగా ఎలక్ట్రిక్ టర్బోఛార్జర్ 175000 rpm వేగంతో పనిచేస్తుంది.
ఇంజిన్ సామర్థ్యం
ఈ కారు ఇంజిన్ 6750 rpm వద్ద 402bhp శక్తి, 5500 rpm వద్ద 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ఆల్‌వీల్ డ్రైవ్ ద్వారా శక్తి నాలుగు చక్రాలకు పంపబడుతుంది. స్టార్టర్ జనరేటర్ సిస్టమ్ ద్వారా అవసరమైనప్పుడు మరో 13.4 bhp శక్తిని ఇంజిన్ అందించవచ్చు.
గరిష్ట వేగం
ఈ మెర్సిడెస్ C43 కారు కేవలం 4.6 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 250 కి.మీ వేగంతో ప్రయాణం చేయగలదు. ఈ కారు ముందు భాగంలో సిగ్నేచర్ గ్రిల్ & అడాప్టివ్ LED హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. దీంతోపాటు అగ్రెసిప్ బంపర్‌లు, స్టాండర్డ్ అల్లాయ్ వీల్స్, క్యాడ్ ఎగ్జాస్ట్ టెయిల్‌పైప్‌లు ఉన్నాయి.
డ్రైవింగ్ మోడ్
ఈ నయా బెంజ్ కారు.. కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్స్ + మోడ్‌లను కలిగి ఉంటుంది. ఇవి ఎయిర్ రైడ్ సస్పెన్షన్ సిస్టమ్‌ను సర్దుబాటు చేస్తాయి. ఈ మోడల్ గరిష్ఠంగా 2.5 డిగ్రీల యాంగిల్‌తో పనిచేసే రియర్ వీల్ స్టీరింగ్‌ను కలిగి ఉంది.
ఫ్యుయల్ ట్యాంక్ & మైలేజ్
ఈ కారుకు 66 లీటర్ల సామర్థ్యం కలిగిన పెట్రోల్ ట్యాంక్‌ను అందించారు. ఈ కారు లీటర్‌కు 14.5 KM మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే ప్రయాణికుల కోసం ఐదు సీట్లకు ఎయిర్ బ్యాగ్స్‌ను అందించారు.
కీలక ఫీచర్లు
ఈ కారు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, 11.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, AMG స్పోర్ట్ సీట్లు, 3 స్పోక్ స్టీరింగ్ వీల్, క్యాబిన్ చుట్టూ స్పోర్ట్స్ పెడల్స్ ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్
Benz AMG C43 కారును మెుత్తం ఐదు కలర్ వేరియంట్లలో లాంచ్ చేశారు. బ్రిలియంట్ బ్లూ (Brilliant Blue), గ్రాఫైట్ గ్రే (Graphite Grey), పోలార్ వైట్ (Polar White), మెుజావే సిల్వర్ (Mojave Silver), ఒబ్సిడియన్ బ్లాక్ (Mojave Silver) రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉంది.
ధర ఎంతంటే?
Mercedes AMG C 43 కారు ధరను రూ.98 లక్షలు (ఎక్స్ షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. దీనికి ప్రధాన పోటీగా ఉన్న BMW M340i (రూ.71.5 లక్షలు), Audi S5 (రూ.75.74 లక్షలు) కార్లతో పోలిస్తే ఇది అధిక ధరను కలిగి ఉంది.