అల్లరి నరేష్ తాజాగా నటించిన ‘ఉగ్రం’ మూవీలో ‘మిర్నా మీనన్’ హీరోయిన్‌గా నటించింది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఈ భామ తన అందచందాలతో ఆకట్టుకుంది.
తమిళ చిత్రం ‘సంతానథెవన్’ చిత్రంతో మిర్నా మీనన్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే చిన్న సినిమా కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.
తన తర్వాతి చిత్రంలో ఏకంగా మోహన్ లాల్ పక్కనే ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. బిగ్ బ్రదర్ చిత్రంలో ఆర్య శెట్టి పాత్రలో మిర్నా మెరిసింది
ఆది సాయికుమార్ హీరోగా గతేడాది వచ్చిన ‘క్రేజీ ఫెల్లో’ సినిమా ద్వారా మిర్నా మీనన్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. రెండో చిత్రం ఉగ్రం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
ఉగ్రం సినిమాలో తన పాత్ర పూర్తి స్థాయిలో ఉంటుందని మిర్నా మీనన్ ఓ ఇంటర్యూలో చెప్పింది. నరేష్‌తో పాటే తన పాత్ర సాగుతుందని చెప్పుకొచ్చింది.
ఉగ్రంలో పాత్ర కోసం చాలా హోంవర్క్ చేసినట్లు ఈ ముద్దుగుమ్మ చెప్పింది. కాలేజీ అమ్మాయిగా, భార్యగా, తల్లిగా కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది.
ఉగ్రం సినిమా షూటింగ్‌లో 75 రోజులు పాల్గొన్నట్లు నటి చెప్పింది. అయితే అందులో 55 రోజులు నైట్ షూట్లేనని వివరించింది.
కెరీర్ ఆరంభంలో ఇలాంటి పాత్ర చేయడమంటే ఏ నటికైనా సవాలేనని నటి చెప్పింది. ఆ సవాల్‌ను స్వీకరించి ఎంతో కష్టపడి చేసినట్లు చెప్పుకొచ్చింది.
ఉగ్రంలో నరేష్‌తో పాటు తాను కూడా రియల్ స్టంట్స్‌లో పాల్గొన్నట్లు ఈ భామ తెలిపింది. ట్రైలర్‌లో చూపించిన కారు ప్రమాదం రియల్ స్టంట్‌లో భాగమేనని స్పష్టం చేసింది.
కారు స్టంట్ చేస్తున్నపుడు నరేష్‌కు గాయమైందని మిర్నా మీనన్ తెలిపింది. ఆ సమయంలో తాను కూడా కింద పడిపోయినట్లు చెప్పుకొచ్చింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!