Mishan Impossible Movie Review
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mishan Impossible Movie Review

    Mishan Impossible Movie Review

    July 20, 2022

    ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ‘ఆర్ఆర్ఆర్’ హ‌వా న‌డుస్తుంది. అయితే అంత పెద్ద బ‌డ్జెట్ మూవీ త‌ర్వాత‌ ఈ వారం ‘మిష‌న్ ఇంపాజిబుల్’ అనే చిన్న సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది.  చాలా కాలం గ్యాప్ త‌ర్వాత తాప్సీ తెలుగులో మ‌ళ్లీ క‌నిపించింది. ఇక ఇందులో ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించింది. ముగ్గురు బాల‌న‌టులు హ‌ర్ష రోష‌న్‌, భాను ప్ర‌కాశ్, జ‌య‌తీర్థ మొలుగు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ ఆర్ఎస్‌జె ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. నిరంజ‌న్ రెడ్డి, అవినాష్ రెడ్డి నిర్మాత‌లు. కె.రాబిన్ మ్యూజిక్ అందించాడు.

    RRRగా చెప్పుకునే ముగ్గురు పిల్ల‌లు రఘుపతి, రాఘవ, రాజారాం. ముంబ‌యి వెళ్లి దావూద్‌ ఇబ్ర‌హీంని కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డ‌బ్బు సంపాదించాల‌ని అనుకుంటారు. దీని కోసం ప్ర‌య‌త్నం మొద‌లుపెడ‌తారు. మ‌రోవైపు ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ శైల‌జ‌(తాప్సీ) పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణా గురించి వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ పిల్ల‌లు, తాప్సీ ఎలా క‌లుసుకుంటారు? అంద‌రూ క‌లిసి ఒక మిష‌న్ కోసం ఎలా ప‌నిచేస్తారు? అనేదే సినిమా క‌థ‌.

    రఘుపతి, రాఘవ, రాజారామ్‌లుగా నటించిన ఈ ముగ్గురు పిల్లలు హర్ష్, భాను, జయతీర్థ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. క‌థ మొత్తం వారి చుట్టూనే తిరుగుతుంది. వారి నుంచి గొప్ప నటనను వెలికితీసినందుకు స్వరూప్ RSJకి క్రెడిట్ ఇవ్వాల్సిందే. శైలజ పాత్రలో తాప్సీ ఆమెకు అల‌వాటైన పాత్ర‌లో పూర్తిగా న్యాయం చేసింది. హర్ష వర్ధన్, రిషబ్ శెట్టి, సుహాస్‌తో సహా మిగిలిన సహాయ‌ నటీనటులు వాళ్ల పరిధి మేర‌కు న‌టించారు.

    ఈ సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది. మొద‌టి బాగం అంతా చ‌క్క‌గా సాగిపోతుంది. అయితే రెండో బాగం వ‌చ్చేస‌రికి క‌థ ప‌ట్టును కోల్పోయింది. ఏజెంట్ సాయి శ్రీనివాస సినిమాలా ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తించ‌డంలో విఫ‌ల‌మ‌యింది. కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా అనిపిస్తాయి. అవి ప్రేక్ష‌కుల‌కు రుచించ‌క‌పోవ‌చ్చు. పిల్ల‌లు, తాప్సీ మధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉంటాయి.

    రాబిక్ కె అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.దీప‌క్ యెర‌గ‌ర సినిమాటోగ్ర‌ఫీతో చిన్న సినిమాను కూడా చాలా చ‌క్క‌గా చూపించాడు. ర‌వితేజ గిరిజాల ఎడిటింగ్‌కు కూడా మంచి మార్కులు ప‌డ‌తాయి. టెక్నిక‌ల్ ప‌రంగా సినిమాకు పూర్తి న్యాయం చేశారు. కానీ సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే ప‌ట్టుత‌ప్పింది. చిన్న‌పిల్ల‌ల న‌ట‌న, తాప్సీ, క‌థ ఈ సినిమాకు బ‌లాలుగా చెప్ప‌వ‌చ్చు. అయితే సెకండాఫ్‌, క్లైమాక్స్, లాజిక్ కోల్పోవ‌డం మూవీకి బ‌ల‌హీన‌త‌లుగా మారాయి. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే రీచ్ ఎక్కువ‌గా ఉండేది అని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

    రేటింగ్ 2.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version