Mohammed Siraj: ఏం బౌలింగ్‌రా స్వామి.. ఏకైక బౌలర్‌గా సిరాజ్ రికార్డు.. ఆసియ కప్ విజేతగా భారత్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mohammed Siraj: ఏం బౌలింగ్‌రా స్వామి.. ఏకైక బౌలర్‌గా సిరాజ్ రికార్డు.. ఆసియ కప్ విజేతగా భారత్

    Mohammed Siraj: ఏం బౌలింగ్‌రా స్వామి.. ఏకైక బౌలర్‌గా సిరాజ్ రికార్డు.. ఆసియ కప్ విజేతగా భారత్

    September 17, 2023

    ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 50 పరుగల లక్ష్యాన్ని 6.1. ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు గిల్ 27*(19), ఇషాన్ కిషన్ 23*(18) మెరుపులతో సులువుగా విజయం సాధించింది. వరల్డ్ కప్‌కు ముందు ఆసియా కప్‌ గెలిచి టీమిండియా సంబురాల్లో మునిగి తేలుతుంది.


    అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే వికెట్ సమర్పించుకుంది. బుమ్రా బౌలింగ్‌లో కుశాల్ పెరారా డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత సిరాజ్ వేసిన నాలుగో ఓవర్లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించాడు.


    సిరాజ్ వికెట్ల దాహం
    నాలుగో ఓవర్‌ మొదటి బంతికి పాతుమ్‌ నిసాంకను.. మూడో బంతికి సదీర సమరవిక్రమను ఎల్బీడబ్ల్యూగా.. ఆ మరుసటి బాల్‌కే చరిత్‌ అసలంకను అవుట్‌ చేశాడు. అంతటితో సిరాజ్‌ వికెట్ల దాహం తీరలేదు.. ఆఖరి బంతికి ధనుంజయ డిసిల్వను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. ఒకే ఓవర్లో ఏకంగా.. నాలుగు వికెట్లు తీసి శ్రీలంక వెన్ను విరిచాడు. ఇక్కడితో మన స్పీడ్‌స్టర్‌ సిరాజ్‌ జోరు ఆగిపోలేదు.. ఆ తర్వాత ఆరో ఓవర్‌ నాలుగో బంతికి లంక కెప్టెన్‌ దసున్‌ షనకను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేశాడు.

    ఆ తర్వాత మళ్లీ పన్నెండో ఓవర్లో రోహిత్‌ శర్మ మరోసారి సిరాజ్‌కు బంతినివ్వగా.. రెండో బాల్‌కే శ్రీలంక స్టార్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌ను బౌల్డ్‌ చేశాడు. ఫాస్ట్‌ ఇన్‌స్వింగర్‌తో అతడిని బోల్తా కొట్టించాడు.

    హార్దిక్ తీన్‌మార్
    ఆ తర్వాత భారత పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా రంగంలోకి దిగాడు. 13 ఓవర్‌ మూడో బంతికి లంక యువ ఆల్‌రౌండర్‌ దునిత్‌ వెల్లలగేను అవుట్‌ చేశాడు. అనంతరం.. పదహారో ఓవర్లో పాండ్యా బౌలింగ్‌లో ప్రమోద్‌ ఇచ్చిన క్యాచ్‌ విరాట్‌ కోహ్లి ఒడిసిపట్టడంతో లంక తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాతి బంతికే పతిరణ కూడా అవుట్‌! ఇంకేముంది 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్‌ అయింది.

    సిరాజ్ రికార్డుల మోత

    టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరాజ్ అరుదైన రికార్డు సాధించాడు. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు వన్డే మ్యాచ్‌ల్లో 16 బంతుల్లో వేగంగా ఐదు వికెట్లు పడగొట్టిన శ్రీలంక బౌలర్ చమిందవాస్ రికార్డు సమం చేశాడు. భారత్‌ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్‌గా సిరాజ్‌ రికార్డులకెక్కాడు. అతడి కంటే ముందు స్టువర్ట్ బిన్నీ (6/4), అనిల్ కుంబ్లే (6/12), బుమ్రా (6/19) ఉన్నారు. ఆసియా కప్‌లోనూ రెండో బెస్ట్‌ బౌలర్‌గా సిరాజ్ రికార్డులకెక్కాడు. శ్రీలంక మాజీ బౌలర్ అజంత మెండిస్‌ (6/13) తర్వాత సిరాజ్‌ తాజా 6/21 స్పెల్‌తో రెండో స్థానంలో నిలిచాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version