కొన్ని సినిమాల్లో కొన్ని సీన్లు, డైలాగ్స్ చూసేందుకు ఇబ్బందికరంగా ఉంటాయి. కొన్ని లాజిక్ లేకుండా ఉంటాయి. అది సినిమానే కదా అని సర్దుకుపోవడం తప్ప ఇంకేం చేయలేం. అలా 2021 లో విడుదలైన సినిమాల్లో కొన్ని సీన్స్, డైలాగ్స్ ఏంటో తెలుసుకుందాం.
1.క్రాక్
క్రాక్‌లో ఒక సీన్‌లో క్రూరమృగాళ్లా కనిపించే రౌడీలు గాడిదను చంపి దాని రక్తం తాగుతారు. ఈ సీన్ రియల్-లైఫ్ ఇన్‌స్పిరేషన్ నుంచి తీసుకున్నది. అలా చేసేవాళ్లు చాలామంది ఉన్నారు. గాడిద రక్తం తాగితే బలం వస్తుంది అని నమ్ముతారు అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఒక సందర్భంలో చెప్పాడు. అయితే ఆ రక్తం తాగే సీన్ చూసేందుకు మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.
2. అల్లుడు అదుర్స్
అల్లుడు అదుర్స్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ ఆటో పంచులు తలనొప్పి తెప్పిస్తాయి. మాటమీద నిలబడవేంట్రా అంటే..ఎవరైనా కాళ్ల మీద నిలబడతాడు కాని మాటమీద నిలబడతాడా అంటూ పాత చింతకాయ పచ్చడి జోకులు చిరాకు తెప్పిస్తాయి. ఇక కాంచనలో లారెన్స్‌లా బెల్లంకొండ శ్రీనివాస్ చేసే కామెడీ సీన్స్‌తో రోత పుట్టించారు.
3. ఉప్పెన
ఉప్పెన సినిమాలో క్లైమాక్స్ సీన్ గురించి ఈ ఏడాది చాలా టాక్ నడిచింది. తన కూతురిని ప్రేమిస్తున్నాడన్న పగతో ఆమె తండ్రి.. హీరోకి మగతనం లేకుండా చేస్తానని చెప్పి పురుషాంగాన్ని కోసేసినట్లు చూపించారు. ఈ సీన్‌పై అప్పట్లో చాలా మీమ్స్ వైరల్ అయ్యాయి. విదేశాల్లో మొదట ఈ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్‌లో లీక్ చేయడంతో అందరూ క్లైమాక్స్ సీన్ కోసం వెయిట్ చేశారట.
4. నాంది
సాధారణంగా తమిళ సినిమాల్లో హీరోలను సహజంగా చూపించేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా కొత్తగా ప్రయత్నిస్తున్నారు. అలా మొదటిసారిగా నాంది సినిమాలో అల్లరినరేశ్ పూర్తిగా నగ్నంగా కనిపిస్తాడు. అలా అతడిని పోలీస్‌లు క్రూరంగా హింసించే సీన్ చూసేందుకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.
5. చెక్
చెక్ సినిమాలో కొన్ని సీన్లు అసలు లాజిక్ లేకుండా ఉంటాయి. జైలులో హీరో నితిన్ చెస్‌లో ప్రావిణ్యం పొందడం, ఏకంగా విశ్వనాథన్ ఆనంద్‌తో గెలవడం, వేట సినిమాలో చిరంజీవి శిష్యుడిలా మూడు నెలలు జైలు లోపల సొరంగం తవ్వడం. ఆ సొరంగంలోనే ఎవరికీ దొరకకుండా ఆరు నెలలు విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఎవరికీ దొరక్కుండా దాక్కోవడం వంటి సన్నివేశాలు ఇల్లాజికల్‌గా అనిపిస్తాయి.
2021 లో విడుదలైన సినిమాల్లో ఇలాంటి మరికొన్ని సీన్స్ గురించి పార్ట్-2లో చదివేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి