ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ మోటోరోలా (Motorola) నుంచి మరో సరికొత్త ఫోన్ భారత్‌లోకి రానుంది. బడ్జెట్ ధరకే ఈ కొత్త మోడల్ లాంచ్ కానుంది. జనవరి 9న Moto G34 5G పేరుతో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్లు మోటొరోలా ప్రకటించింది. గతేడాది డిసెంబర్‌లోనే ఈ ఫోన్ చైనాలో లాంచ్ కాగా అక్కడి యూజర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా దేశీయ మార్కెట్‌లోకి ఈ మెుబైల్ వస్తుండటంతో టెక్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో Moto G34 5G మెుబైల్ ధర, ఫీచర్లు, ఇతర విశేషాలను ఇప్పుడు చూద్దాం.
మెుబైల్ స్క్రీన్
Moto G34 5G ఫోన్.. 6.5 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో రానుంది. దీనికి 1080×2400 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. octa-core Snapdragon 695 SoC ప్రొసెసర్, Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై మెుబైల్ వర్క్ చేయనుంది.
ర్యామ్ & స్టోరేజ్
ఈ నయా మోటో ఫోన్ 8GB RAM / 128GB స్టోరేజ్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి వర్చువల్ RAM సపోర్ట్‌ను కూడా మోటోరోలా అందించింది. అలాగే డాల్బీ అట్మాస్ మద్దతు కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఫోన్‌లో ఉన్నాయి.
బ్యాటరీ
ఈ మెుబైల్‌ను పవర్‌ఫుల్ బ్యాటరీతో తీసుకొస్తున్నారు. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగిన 5,000mAh బ్యాటరీని అందించారు. దీని సాయంతో మెుబైల్‌ను త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చని మోటోరోలా వర్గాలు పేర్కొన్నాయి.
కెమెరా
Moto G34 5G ఫోన్ వెనుక భాగంలో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా కాగా 2MP సపోర్టింగ్ సెన్సార్‌ను సమకూర్చారు. ఇక ముందు వైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరాను ఫిక్స్ చేశారు.
కలర్ ఆప్షన్స్
ఈ మెుబైల్ మూడు కలర్ వేరియంట్లలో దేశీయ మార్కెట్‌లో లభించనుంది. చార్‌కోల్ బ్లాక్ (Charcoal Black), ఐస్ బ్లూ (Ice Blue), ఓషియన్ గ్రీన్ (Ocean Green) రంగుల్లో మీకు నచ్చిన దానిని కొనుగోలు చేయవచ్చు.
ధర ఎంతంటే?
Moto G34 5G మెుబైల్ జనవరి 9 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఆ రోజే ఫోన్ ధరపై అధికారిక ప్రకటన రానుంది. అయితే Moto G34 5G ధర రూ.11,990 వరకూ ఉండవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫోన్‌ను 9వ తేదీ నుంచి మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!