Motorola Edge 40 Neo: ఇదికదా ఫోన్ అంటే.. మోటో నయా స్మార్ట్‌ఫోన్‌.. దీని ప్రత్యేకతలు తెలిస్తే షాకే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Motorola Edge 40 Neo: ఇదికదా ఫోన్ అంటే.. మోటో నయా స్మార్ట్‌ఫోన్‌.. దీని ప్రత్యేకతలు తెలిస్తే షాకే..!

    Motorola Edge 40 Neo: ఇదికదా ఫోన్ అంటే.. మోటో నయా స్మార్ట్‌ఫోన్‌.. దీని ప్రత్యేకతలు తెలిస్తే షాకే..!

    September 21, 2023

    ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ మోటోరోలా (Motorola) మరో సరికొత్త ఫోన్‌తో భారతీయ మార్కెట్‌లో అడుగుపెట్టింది. మెుబైల్‌ ప్రియుల కోసం ‘మోటరోలా ఎడ్జ్‌ 40 నియో’ (Motorola Edge 40 Neo) పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ మెుబైల్స్‌ ఇవాళ్టి నుంచే అందుబాటులోకి వచ్చాయి. టెక్‌ లవర్స్ అంచనాలకు అనుగుణంగా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు మోటోరోలా తెలిపింది. మిడ్‌ రేంజ్‌బడ్జెట్‌లోనే దీన్ని తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మొబైల్‌కి సంబంధించిన ధర, ఫీచర్స్‌ వివరాలను ఇప్పుడు చూద్దాం.

    ఫోన్‌ స్క్రీన్‌

    Motorola Edge 40 Neo స్మార్ట్‌ఫోన్‌ 6.55 అంగుళాల P-OLED HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 409ppi సాంద్రత కలిగిన కర్వ్‌డ్‌ డిస్‌ప్లేను దీనికి అందించారు. MediaTek Dimensity 7030 ప్రాసెసర్‌,  Android 13 OSతో ఈ మెుబైల్‌ వర్క్‌ చేయనుంది. Android 14, Android 15 వంటి భవిష్యత్‌ అప్‌గ్రేడ్‌లను కూడా ఉచితంగా యూజర్లకు అందించనున్నట్లు మోటో వెల్లడించింది. 

    స్టోరేజ్‌ సామర్థ్యం

    ఈ మెుబైల్‌ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 8GB RAM +  128GB ROM, 12GB RAM + 256GB స్టోరేజ్‌ సామర్థ్యాలతో మార్కెట్‌లో విడుదలైంది. మీ అవసరాన్ని బట్టిన నచ్చిన వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు. 

    వాటర్‌ రెసిస్టెన్స్‌

    Motorola Edge 40 Neo మెుబైల్‌ ప్రమాదవశాత్తు నీటిలో తడిచిన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కంపెనీ చెబుతోంది. ఎందుకంటే దీనికి వాటర్, డెస్ట్ రెసిస్టెన్స్ డివైజ్ IP68 రేటింగ్‌ను అందించినట్లు స్పెసిఫికేషన్స్‌లో పేర్కొంది. 

    కెమెరా క్వాలిటీ

    ఈ మెుబైల్‌ను డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో తీసుకొచ్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ రియర్ కెమెరాను అందించారు. డెప్త్, మాక్రో మోడ్‌లకు సపోర్టు ఇచ్చే 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌ను బ్యాక్‌ కెమెరా సెటప్‌లో ఫిక్స్‌ చేశారు. సెల్ఫీల కోసం ముందు వైపు 32MP కెమెరాను అమర్చారు. ఈ కెమెలా సెటప్‌తో నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.

    బిగ్‌ బ్యాటరీ

    Motorola Edge 40 Neo స్మార్ట్‌ఫోన్‌కు Li-Po 5000mAh శక్తివంతమైన బ్యాటరీని ఫిక్స్‌ చేశారు. దీనికి 68W ఫాస్ట్‌ఛార్జింగ్‌ సపోర్ట్‌ను అందించారు. దీని వల్ల ఫోన్‌ను 15 నిమిషాల్లోనే 50% మేర ఛార్జ్‌ చేసుకోవచ్చు. 

    కలర్స్‌ 

    మెుత్తం మూడు కలర్‌ ఆప్షన్స్‌లో Motorola Edge 40 Neo  మెుబైల్‌ అందుబాటులోకి వచ్చింది. బ్లాక్‌ (Black), సూతింగ్‌ సీ (Soothing Sea), క్యానీల్ బే (Caneel Bay) రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంపికచేసుకోవచ్చు. 

    ధర ఎంతంటే?

    Moto Edge 40 Neo ఫోన్‌ ధరను వేరియంట్‌ ఆధారంగా నిర్ణయించారు. 8GB RAM + 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ.20,999గా కంపెనీ నిర్ధారించింది. 12GB RAM + 256GB స్టోరేజ్‌ ప్రైస్‌ను రూ.22,999గా పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌ డెబిట్‌ / క్రెడిట్‌ కార్డ్‌పై 5% డిస్కౌంట్‌ కూడా ఉంది. అలాగే ఫోన్‌ Exchangeపై రూ.1000, క్యాష్‌బ్యాక్‌ – కూపన్స్‌ను కలుపుకుంటే రూ.7,000 వరకూ ప్రయోజనం పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ చేబుతోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version