ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) సరికొత్త మెుబైల్‌తో భారత్‌లో అడుగుపెట్టబోతోంది. వచ్చే నెల ఏప్రిల్‌లో ‘మోటరోలా ఎడ్జ్ 50 ప్రో’ (Motorola Edge 50 Pro) పేరుతో నూతన మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ఆవిష్కరించిన మోటరోలా ఎడ్జ్40 ప్రో ఫోన్ కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా అధునాతన ఫీచర్లను నయా ఫోన్‌లో పొందుపరిచినట్లు పేర్కొంది. అయితే ఈ మెుబైల్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మెుబైల్ స్క్రీన్
ఈ Motorola Edge 50 Pro మెుబైల్.. 6.7 అంగుళాల కర్వ్‌డ్ డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. దీనికి ఏకంగా 165Hz రిఫ్రెష్ రేట్ అందించినట్లు తెలుస్తోంది. Qualcomm Snapdragon 8 Gen 3 ప్రొసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ వర్క్ చేయనున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ర్యామ్ & స్టోరేజ్
ఈ నయా మోటో ఫోన్ 12GB RAM / 256GB స్టోరేజ్‌తో మార్కెట్‌లోకి వచ్చే అవకాశముందని ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది. మెుబైల్ లాంచింగ్ తర్వాత ఇతర ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్స్‌పై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
బ్యాటరీ
లీకైన సమాచారాన్ని బట్టి Motorola Edge 50 Pro మెుబైల్.. 4,500mAh బ్యాటరీతో రాబోతున్నట్లు సమాచారం. 125W వైర్డ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు అందించినట్లు తెలుస్తోంది. ఇది మెుబైల్‌ను అత్యంత వేగంగా ఛార్జ్ చేసుకునేందుకు సహాయపడతుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
కెమెరా
Motorola Edge 50 Pro ఫోన్.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రాబోతున్నట్లు సమాచారం. ఫోన్ వెనక భాగంలో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఎఫ్/1.4 అపెర్చర్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్, 13 ఎంఎం వైడ్ యాంగిల్ కెమెరా, 73mm టెలిఫోటో షూటర్ విత్ 6x జూమ్ ఉండనున్నట్లు టెక్ వర్గాలు తెలిపాయి. అయితే సెల్ఫీ కెమెరాపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. లాంచింగ్ రోజునే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
కలర్ ఆప్షన్స్
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో మెుబైల్.. మెుత్తం మూడు రంగుల్లో లభించనున్నట్లు సమాచారం. బ్లాక్ (Black), పర్పుల్ (Purple), వైట్ విత్ స్టోన్ లైక్ ప్యాటర్న్ (White With Stone Like Pattern) కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశముంది.
ధర ఎంతంటే?
Motorola Edge 50 Pro మెుబైల్.. ఏప్రిల్ 3న భారత్‌లో లాంచ్ కానుంది. ఆ రోజున ధర, ఫీచర్లపై మరింత స్పష్టత రానుంది. అయితే ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ.89,990 వరకూ ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.