Movie like Manjummel Boys: ఓటీటీలో మంజుమ్మేల్ బాయ్స్ మాదిరి సూపర్బ్ సినిమా.. ఎందులో అంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Movie like Manjummel Boys: ఓటీటీలో మంజుమ్మేల్ బాయ్స్ మాదిరి సూపర్బ్ సినిమా.. ఎందులో అంటే?

    Movie like Manjummel Boys: ఓటీటీలో మంజుమ్మేల్ బాయ్స్ మాదిరి సూపర్బ్ సినిమా.. ఎందులో అంటే?

    May 15, 2024
    Movie like Manjummel Boys

    ఇటీవల వచ్చిన మలయాళ సినిమా మంజుమ్మేల్ బాయ్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ జనర్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో నెటిజన్లు పలువురు మంజుమ్మేల్ బాయ్స్ తరహా చిత్రాల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఎలాంటి సినిమాలు ఉన్నాయో ఓసారి చూద్దాం.

    ఈ సినిమాలో  స్నేహితులందరూ సరదాగా గుణ గుహలను చూసేందుకు వెళ్తారు. ప్రమాదవశాత్తు ఆ గుహలో ఫ్రెండ్ పడిపోతే ఇంకో స్నేహితుడు ఎలా కాపాడాడు అనేది కథాంశం. ఆద్యంతం ఈ సినిమా సస్పెన్స్‌ను హోల్డ్ చేస్తూ ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. అయితే ఇంచుమించు అదే కథాంశంతో(Movie like Manjummel Boys) ఓ హాలీవుడ్ సినిమా ఉంది. ఆ సినిమా గురించి ఇప్పడు తెలుసుకుందాం.

     127 హవర్స్

    ఇప్పుడు మేము చెప్పబోయే సినిమా పేరు 127 హవర్స్(127 Hours). ఈ సినిమాలో హీరో అనుకోకుండా ఓ లోయలో పడుతాడు. 5 రోజుల పాటు ఆ లోయలోనే చిత్ర హింసలు అనుభవిస్తాడు. చివరకు అతను ఎలా బయటకు వచ్చాడు అనేది కథాంశం.

    నిజ జీవితం ఆధారంగా..

    127 హవర్స్ చిత్రాన్ని నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాను అరన్ రాల్ట్సన్ అనే పర్వాతారోహకుడి నిజ జీవితం ఆధారంగా డైరెక్టర్ డానీ బోయ్లే చిత్రీకరించారు. తమాషా ఏమిటంటే… ఈ సినిమాలో చిత్రీకరించిన ప్రతి సన్నివేశం అరన్ రాల్ట్సన్ సమక్షంలో షూట్ చేయడం జరిగింది. ఎందుకంటే సినిమాలో ప్రతీ సీన్ ఫర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందా? లేదా? అని చూసుకోవడానికి తెరకెక్కించారు. ఇక అరన్ రాల్ట్సన్‌ పాత్రలో జేమ్స్ ఫ్రాన్స్‌కో నటించాడు. 

     ఇప్పుడు సినిమా కథలోకి వెళ్దాం 

    జేమ్స్ ఫ్రాన్స్ కో  సాహసాలంటే మహా  ఇష్టం. ఓ రోజు ఓ అడ్వెంచర్ ట్రిప్‌ కోసం బయల్దేరుతాడు. అలా వెళ్తుండగా అక్కడ ఓ ప్రదేశం బాగుందని ఆగుతాడు. ఆ ప్రాంతంలో రెండు కొండల మధ్య ఓ బండరాయి ఉంటుంది. ఆ బండరాయి  మీదకు ఎక్కితే ఎలా ఉంటుందని ఆలోచిస్తాడు. తన  బరువును ఆ బండరాయి మోస్తుందా లేదా అనే ఆలోచనతో దానిపైకి ఎక్కుతాడు. దీంతో ఆ బండరాయి అతని బరువుకు కుంగిపోవడంతో  ఒక్కసారిగా లోయలో పడిపోతాడు. ఆ బండరాయి కూడా అతనితో పాటు లోయలో పడిపోతుంది. బండరాయి మధ్యలో అతని చేయి చిక్కుకుంటుంది. ఇక చూడండి అతని కష్టం.. తినడానికి ఏమీ ఉండవు. లోయ చూస్తేనేమో చాలా లోతుగా ఉంటుంది. సాయం కోసం పిలుద్దామన్న ఎవరుండరు. 

    ఎలా బయటపడ్డాడంటే?

    లోయ నుంచి బయటపడేందుకు జేమ్స్ తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. బండరాయి మధ్యలో ఇరుక్కున్న తన చేయిని నరుక్కుని బయటపడుతాడు.ఈ సినిమా ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లింగ్ క్యారీ చేస్తుంది. సింగిల్ క్యారెక్టర్ చూట్టూ(Movie like Manjummel Boys) కథను నడిపించిన విధానం బాగుంటుంది. అప్పుడప్పుడు సినిమాలో ఇద్దరు అమ్మాయిలు వచ్చిపోతారు. ఆ తర్వాత కొన్ని సీన్లలో ఫ్యామిలీ క్యారెక్టర్స్‌ను చూపిస్తారు. అంతే తప్ప పెద్దగా క్యారెక్టర్స్‌ ఏమి ఉండవు. సినిమా మొత్తం సింగిల్ క్యారెక్టర్‌ ఫోకస్ మీదనే సాగుతుంది. లోతైన లోయలో బండరాయికి కొండకు మధ్య అతని చేయి ఇరుక్కున్నప్పుడు దాని నుంచి అతను బయటపడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది బాగా చూపించారు. చేయి నరుక్కునే పరిస్థితి అనివార్యంగా చూపిన తీరు కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది.

    ఓటీటీ ప్లాట్‌ఫామ్స్

    ఈ చిత్రం పలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో రెంట్ పర్పస్‌లో స్ట్రీమింగ్‌కు ఉంది.  డిస్నీ+ హాట్ స్టార్, యాపిల్ టీవీ, గూగుల్ ప్లే మూవీస్‌లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ  మంజుమ్మేల్ బాయ్స్  చిత్రం చూసిన అనుభూతి మాత్రం పక్కా కలుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీకెండ్‌లో “127 హవర్స్” సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకోండి మరి.

    ఈ కథనం మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం YouSay Website ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version