Mrunal Thakur: సీతారామం బ్యూటీకి తెలుగు కష్టాలు.. భాషపై పట్టుకోసం శ్రమిస్తున్న మృణాల్‌ ఠాకూర్‌..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mrunal Thakur: సీతారామం బ్యూటీకి తెలుగు కష్టాలు.. భాషపై పట్టుకోసం శ్రమిస్తున్న మృణాల్‌ ఠాకూర్‌..!

    Mrunal Thakur: సీతారామం బ్యూటీకి తెలుగు కష్టాలు.. భాషపై పట్టుకోసం శ్రమిస్తున్న మృణాల్‌ ఠాకూర్‌..!

    September 14, 2023

    సీతారామం సినిమాతో నటి మృణాల్‌ ఠాకూర్ రాత్రికి రాత్రే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఆమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఈ మరాఠీ బ్యూటీకి తెలుగు నేర్చుకోవడం తప్పనిసరిగా మారిపోయింది. దీంతో ఈ భామ తెలుగు భాషపై ఫోకస్‌ పెట్టింది.

    మృణాల్‌ తెలుగు నేర్చుకునేందుకు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ క్లాసులకు అటెండ్‌ ‌అవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు టీచర్‌ను ఏర్పాటు చేసుకొని భాషపై పట్టు సాధించేందుకు ఆమె యత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ల్యాప్‌టైప్‌ ముందు తెలుగుతో ఈ భామ కుస్తీ పడుతున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

    నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ చిత్రంలో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.  కొన్నిరోజుల క్రితం నాని పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘సమయమా’ అనే సాంగ్‌ కూడా రిలీజ్‌ కాబోతోంది. ఈ పాట లిరికల్‌ వీడియోను సెప్టెంబర్‌ 16న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఓ పోస్టర్‌ ద్వారా తెలిపారు. 

    విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘VD 13’ మూవీలో కూడా మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా చేస్తోంది. రెండు పెద్ద చిత్రాలు చేతిలో ఉండటంతో లాంగ్వేజ్‌ ప్రాబ్లమ్‌ రాకుండా మృణాల్‌ జాగ్రత్త పడుతోంది. ఎలాగైన తెలుగు నేర్చుకొని టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఈ బ్యూటీ భావిస్తోంది

    అటు చిరంజీవితోను కలిసి నటించే ఛాన్స్‌ను ఈ  భామ కొట్టెసినట్లు వార్తలు వస్తున్నాయి.  ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ.. చిరుతో 157వ చిత్రాన్ని చేయనున్నారు. ఇందులో హీరోయిన్‌ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని, ఆ క్యారెక్టర్‌కు మృణాల్‌ అయితేనే సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

    టెలివిజన్ తెరపై సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్.. మరాఠి సినిమా ‘విట్టి దండు’తో వెండితెర ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత మరాఠీతో పాటు హిందీ సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

    సీతారామం తర్వాత మృణాల్ ఈ యేడాది అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సెల్ఫీ’తో ఆడియన్స్‌ను పలకరించింది. ఈ సినిమా మలయాళీ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్‌కు రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమా టాక్ బాగానే ఉన్న కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఈ సినిమాతో అక్షయ్ కుమార్ స్టార్‌డమ్‌పై అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేసాయి. 

    మృణాల్‌కు తెలుగుతో పాటు తమిళం, మలయాళం ఇండస్ట్రీల నుంచి కూడా ఎన్నో ఆఫర్లు వస్తున్నాయట. అక్కడ అరంగేట్రానికి మంచి కథ కోసం ఈ భామ వెతుకుతోందట. మృణాల్‌ త్వరలోనే తన తమిళం లేదా మలయాళీ సినిమా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ తమిళ హీరో సూర్య మూవీలో మృణాల్‌కు ఓ  కీలక పాత్ర ఆఫర్ చేసినట్లు పుకార్లు ఉన్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version