31 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మెగాస్టార్‌తో క‌లిసి న‌టిస్తున్న ముర‌ళీమోహ‌న్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 31 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మెగాస్టార్‌తో క‌లిసి న‌టిస్తున్న ముర‌ళీమోహ‌న్

    31 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మెగాస్టార్‌తో క‌లిసి న‌టిస్తున్న ముర‌ళీమోహ‌న్

    July 20, 2022

    screengrab youtube

    సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత ముర‌ళి మోహ‌న్, మెగాస్టార్ చిరంజీవి గ‌తంలో గ్యాంగ్‌లీడ‌ర్, త్రినేత్రుడు వంటి చిత్రాల్లో న‌టించాడు. ఈ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డంతో ఆయ‌న న‌ట‌న‌కు దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు చిరంజీవితో క‌లిసి మ‌ళ్లీ గాడ్‌ఫాద‌ర్ సినిమాలో ఒక కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. దీనికి సంబంధించిన విశేషాల‌ను ముర‌ళీమోహ‌న్ ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. చిరంజీవి ఒక‌సారి ఫోన్ చేసి మీ ఫోటోలు పంపించ‌మ‌న్నాడు. మీ నాన్న చ‌నిపోయిన‌ప్పుడు మీరు తెల్ల‌గ‌డ్డం, తెల్ల జుట్టుతో ఉన్నారు ఆ ఫోటోలు కావాల‌ని అడిగాడు. అవి పంపించేస‌రికి ఈ పాత్ర‌కి ఇలాంటి గెట‌ప్ బాగుంటుంద‌ని డైరెక్ట‌ర్ మోహ‌న్‌రాజా అన్నాడు. దీంతో అలాగే పెంచుకున్నాను అని వెల్ల‌డించాడు. నా పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింద‌ని ముర‌ళీమోహ‌న్‌ చెప్పాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version