గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గేమ్ ఛేంజర్’ టీమ్ మరో అదిరిపోయే ట్రీట్ ఫ్యాన్స్‌కు ఇచ్చింది. ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్‌గా అమేజింగ్ మెలోడీ సాంగ్ (Naanaa Hyraanaa)ను రిలీజ్ చేసింది.
మెస్మరైజ్ చేస్తున్న మెలోడీ
‘గేమ్ చేంజర్’ (Game Changer) నుంచి ఇప్పటి వరకు వచ్చిన రెండు పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ‘జరగండి జరగండి’, ‘రా మచ్చా మచ్చా’ పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మూడో సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు ‘నానా హైరానా’ (Naanaa Hyraanaa) అంటూ సాగే ఈ పాటకు సంగీత ప్రియుల నుంచి విశేష స్పందన వస్తోంది. హృదయాలకు హత్తుకునేలా పాట ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మేఘాల్లో తేలేలా ఈ పాట ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పాటను స్టార్ సింగర్స్ శ్రేయా ఘోషల్, కార్తీక్ పాడారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు.
ప్రోమో నుంచే మెుదలైన హైప్
‘నానా హైరానా’ (Naanaa Hyraanaa) సాంగ్ రిలీజ్‌కు రెండ్రోజుల ముందు మేకర్స్ ఓ ప్రోమోనూ రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ వీడియోను విడుదల చేశారు. ఇందులో సింగర్స్ కార్తీక్, శ్రేయా ఘోషల్ సాంగ్‌ను పాడారు. అంతేకాదు ఆ పాట స్పెషాలిటీ వివరించారు. థమన్ దగ్గర పాడిన పాటల్లో ‘నానా హైరానా’ ది బెస్ట్ అంటూ శ్రేయా ఘోషల్ ఒక్కసారిగా పాటపై హైప్ పెంచారు. ఈ ప్రోమో దెబ్బకే పాటపై ఒక్కసారిగా అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్‌కు ముందే సాంగ్ సూపర్ హిట్ అన్న కామెంట్స్ వినిపించాయి. అటు ఈ పాట రిలీజ్‌కు సంబంధించిన ప్రచార చిత్రాలు సైతం ఫ్యాన్స్‌లో భారీగా అటెన్షన్ క్రియేట్ చేశాయి. ఇక సాంగ్ షూట్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మెుత్తంలో ఖర్చు చేసిన పాటను థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జగదేక వీరుడు అతిలోక సుందరి ఫోజు!
‘నానా హైరానా’ పాట రిలీజ్‌కు ముందు మేకర్స్ పోస్టు చేసిన పోస్టర్లలో ఒకటి మాత్రం హైలేట్‌గా నిలిచింది. అందులో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పోనీ టైల్ హెయిర్ స్టైల్‌లో డ్రెడిషనల్ దుస్తుల్లో కనిపించాడు. ఇక కియారా కూడా అతిలోక సుందరి లుక్‌లో కనిపించి మెస్మరైజ్ చేసింది. ఈ ఫోజు చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా గుర్తుకు వస్తోందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి, స్వర్గీయ నటి శ్రీదేవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా పోస్టర్‌ను పోలి ఉందని పోస్టులు పెడుతున్నారు. ‘అందాలలో‘ పాటలో శ్రీదేవి కాస్ట్యూమ్‌కు దగ్గర కియారా డ్రెస్ ఉందని అంటున్నారు.
Celebrities Featured Articles Political Figure
Revanth Reddy: టాలీవుడ్‌పై రేవంత్ సర్కార్ పగ? వరుస ఘటనలు ఏం చెబుతున్నాయి?