Naga Chaitanya : పెళ్లి పనులు షురూ.. శోభితా దూళిపాళ్ల ఏం చేసిందో చూడండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Naga Chaitanya : పెళ్లి పనులు షురూ.. శోభితా దూళిపాళ్ల ఏం చేసిందో చూడండి!

    Naga Chaitanya : పెళ్లి పనులు షురూ.. శోభితా దూళిపాళ్ల ఏం చేసిందో చూడండి!

    October 21, 2024

    అక్కినేని ఇంట మరోమారు పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్‌ యంగ్‌ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha)తో విడాకులు అనంతరం ప్రముఖ నటి శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala)తో చైతూ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. ఇక వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అక్కినేని ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన పనులు అఫిషియల్‌గా మెుదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

    పెళ్లి పనులు షురూ

    టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ఎంగేజ్ మెంట్ ఆగస్టు 8న గ్రాండ్‌గా జరిగింది తెలిసిందే. ఈ తరుణంలో వీరి పెళ్ళికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇరువురి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి శోభితా ధూళిపాళ్ల తన పెళ్లి పనులు షురూ అయినట్టు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. తాను పసుపు దంచుతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ‘గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ ఫొటోస్ లో శోభిత చాలా సంప్రదాయంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. దాంతో అతి త్వరలోనే చై-శోభితా ఒక్కటవ్వనున్నారని తెలుస్తోంది. వైజాగ్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం.

    రెండేళ్లుగా ప్రేమాయణం!

    నాగ చైతన్య – శోభిత మధ్య నిశ్చితార్థం వ్యవహారం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఇందుకు కారణం వారు రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు రావడమే. చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి సైతం జరగబోతోంది. 

    ‘పెళ్లి గురించి కలలు కనలేదు’

    ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పొల్గొన్న శోభిత ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. తన నిశ్చితార్థం, పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలని ఎప్పుడు కలలు కనలేదని తెలిపారు. వాటి కోసం ప్రత్యేకంగా ప్లాన్స్‌ కూడా వేసుకోలేేదని చెప్పారు. పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలన్న కోరిక మాత్రం బలంగా ఉండేదని చెప్పుకొచ్చింది. అయితే తన పెళ్లి వేడుకలు సాంప్రదాయంగా సింపుల్‌గా జరిగితే చాలని భావించానని అన్నారు. అనుకున్నట్లే చైతూతో సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని అన్నారు. ఇక తన తల్లిదండ్రులు పాటించే సంసృతి, సంప్రదాయాలను తానూ గౌరవిస్తాని శోభిత స్పష్టం చేసింది. అందుకే తాను ఎంత ఎదిగిన నాకు సంబంధించినవి సాంప్రదాయంగా మా పేరెంట్స్ సమక్షంలో జరగాలని కోరుకుంటానని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే చైతూతో పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరుగుతుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

    శోభితా గురించి ఈ విషయాలు తెలుసా!

    శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్‌ రాఘవన్‌ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్‌’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్‌ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్‌, పొన్నియన్‌ సెల్వన్ 1 & 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల ‘మంకీ మాన్‌’ అనే అమెరికన్‌ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. తాజాగా హిందీలో ‘లవ్‌, సితారా’ అనే చిత్రంలో చేసింది. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్‌’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version