నాగార్జున ‘ది ఘోస్ట్’ షూటింగ్ పూర్తి

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ‘ది ఘోస్ట్’ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సోనాల్ చౌహాన్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే ఈ మూవీ షూటింగ్ నేటితో పూర్త‌యిన‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది. పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ పనులు వేగంగా పూర్తిచేసి అక్టోబ‌ర్ 5న సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వీడియోను చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

Exit mobile version