Nayakudu 2023 Review: వడివేలు, ఉదయనిధి కెరీర్‌ బెస్ట్‌ నటన… నాయకుడు సినిమా ప్రేక్షకులను మెప్పించిందా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nayakudu 2023 Review: వడివేలు, ఉదయనిధి కెరీర్‌ బెస్ట్‌ నటన… నాయకుడు సినిమా ప్రేక్షకులను మెప్పించిందా?

    Nayakudu 2023 Review: వడివేలు, ఉదయనిధి కెరీర్‌ బెస్ట్‌ నటన… నాయకుడు సినిమా ప్రేక్షకులను మెప్పించిందా?

    July 14, 2023

    నటీనటులు : ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు, లాల్

    రచన, దర్శకత్వం : మారి సెల్వరాజ్

    ఛాయాగ్రహణం : తేని ఈశ్వర్

    ఎడిటర్ : ఆర్కే సెల్వ

    సంగీతం : ఏఆర్ రెహమాన్

    నిర్మాత : ఉదయనిధి స్టాలిన్

    దేశంలోని ప్రముఖ దర్శకుల జాబితాలో మారి సెల్వరాజ్‌ పేరు తప్పకుండా ఉంటుంది. తన సినిమాల ద్వారా ఆయన ప్రజా సమస్యలను టచ్‌ చేస్తుంటారు. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుందంటే ప్రతీ ఒక్కరిలోనూ అంచనాలు పెరిగిపోతుంటాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లేముందు ఉదయనిధి స్టాలిన్ తన చివరి సినిమా అవకాశాన్ని మారి సెల్వరాజ్‌కు ఇచ్చారు. తమిళనాట ‘మామన్నన్’గా విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే పెద్ద సక్సెస్ అయింది. ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఫహాద్ ఫాజిల్, వడివేలు, కీర్తి సురేష్ వంటి భారీ స్టార్ క్యాస్ట్ కూడా ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?

    కథ:

    రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. అతని తండ్రి తిమ్మరాజు (వడివేలు) రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే. లీల (కీర్తి సురేష్), రఘువీరా క్లాస్‌మేట్. కాలేజీ రోజుల నుంచి ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నప్పటికీ కనీసం మాట్లాడుకోరు. కాలేజీ అయిపోయాక లీల ఉచిత వైద్యం కోసం ఇన్‌స్టిట్యూట్ స్థాపిస్తుంది. దీనికోసం రఘువీరా తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఇచ్చేస్తాడు. ఓ రోజు రత్నవేలు (ఫహాద్ ఫాజిల్) అన్న (సునీల్ రెడ్డి) మనుషులు ఇన్‌స్టిట్యూట్‌ దాడి చేసి బిల్డింగ్‌ను ధ్వంసం చేస్తారు. గొడవ పెద్దది కావడంతో సెటిల్ చేయడానికి రత్నవేలు దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇది కులాల మధ్య గొడవగా ఎలా మారింది? అనేది అసలు కథ. ఇది తెలియాలంటే థియేటర్స్‌కు వెళ్లాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    ఈ సినిమాకు వడివేలు నటనే హైలెట్‌ అని చెప్పొచ్చు. ప్రథమార్థంలో అమాయకుడిగా, నిస్సహాయుడిగా, ద్వితీయార్థంలో కొడుకు కోసం ఎవరికైనా ఎదురించే ధైర్యవంతుడిగా వడివేలు నటన ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో కారులో ఫహాద్ ఫాజిల్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్‌లో, ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి కత్తి పట్టుకుని ఇంట్లో విలన్ కోసం ఎదురు చూసే సీన్‌లో ఆయన నటన గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక హీరో ఉదయనిధి స్టాలిన్‌ విషయానికొస్తే ఆయన కెరీర్‌లో ఇదే బెస్ట్‌ రోల్‌ అని చెప్పొచ్చు. ఎప్పటిలాగే ఉదయనిధి తన నటనతో ఆకట్టుకున్నాడు. అటు ఫహాద్‌ ఫాజిల్‌ కూడా అత్యుత్తమ నటన కనబరిచాడు. కీర్తి సురేష్‌ పాత్రకు నటనలో మంచి స్కోప్ ఉంది. లీల పాత్రలో ఆమె ఒదిగిపోయింది. మిగతా పాత్రదారులందరూ తమ పరిధి మేరకు నటించారు.

    ఎలా సాగిందంటే

    ప్రథమార్థం అంతా పాత్రలు, వాటి ఐడియాలజీల చుట్టూ తిరుగుతుంది. కీలకమైన అన్ని పాత్రల మధ్య ఫేస్ ఆఫ్‌కు రెడీ చేయడంతోనే ఫస్టాఫ్‌ అయిపోతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే ద్వితీయార్థం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. రాజకీయ పోరాటం, ఎత్తులకు పైఎత్తులు వేయడం ప్రేక్షకుడిలో ఆసక్తిని పెంచుతాయి. శాంతిని కోరుకునే వడివేలు పాత్ర ఆలోచించేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో బుద్ధుడి విగ్రహాన్ని చూపించడం వంటివి వీక్షకులకు ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తాయి. ఇక సినిమాకు డైలాగ్స్‌ ప్రధాన బలం అని చెప్పొచ్చు.

    టెక్నికల్‌గా

    మారి సెల్వరాజ్‌ ఈ సినిమాలోనూ తనదైన మార్క్‌ చూపించాడు.  హీరో, విలన్ ఇద్దరి పాత్రలనూ ఒకేసారి ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. పాత్రల పరిచయం వేగంగా చేసిన దర్శకుడు కొన్ని సీన్లను కూడా ట్రిమ్‌ చేసుంటే బాగుండేదని అనిపించింది. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ మధ్య వచ్చే  ఫ్లాష్ బ్యాక్ నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఇక సినిమాకు మరో బలం ఏఆర్ రెహమాన్ సంగీతం. ఆయన స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఎంతగానో దోహదం చేశాయి. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ ఆక్టటుకుంటుంది. ఈ సినిమాకు నిర్మాత కూడా ఉదయనిధి స్టాలినే కాబట్టి ఖర్చుకు వెనకాడలేదు.

    ప్లస్‌ పాయింట్స్‌

    • కథ
    • వడివేలు నటన
    • రెహమాన్‌ సంగీతం
    • ఇంటర్వెల్‌ బ్యాంగ్‌

    మైనస్ పాయింట్స్

    • సాగదీత సీన్స్
    • నెమ్మదిగా సాగే కథనం

    రేటింగ్‌: 3.25/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version