Nayanthara: భర్తతో రొమాంటిక్‌ ఫొటోలు షేర్‌ చేసిన నయనతార.. ముద్దులతో ముంచెత్తి మరి విషెస్‌! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nayanthara: భర్తతో రొమాంటిక్‌ ఫొటోలు షేర్‌ చేసిన నయనతార.. ముద్దులతో ముంచెత్తి మరి విషెస్‌! 

    Nayanthara: భర్తతో రొమాంటిక్‌ ఫొటోలు షేర్‌ చేసిన నయనతార.. ముద్దులతో ముంచెత్తి మరి విషెస్‌! 

    September 18, 2024

    తన భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) పుట్టినరోజును పురస్కరించుకొని నటి నయనతార (Nayanthara) తాజాగా కొన్ని స్పెషల్‌ ఫొటోలు షేర్‌ చేశారు. 

    ఇందులో ఆమె ఆయన్ని ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ‘హ్యాపీ బర్త్‌డే మై ఎవ్రీథింగ్‌. నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవు. నువ్వు కన్న కలలు నిజం అయ్యేలా దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

    ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. క్యూట్‌ కపుల్‌ అని పలువురు అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.

    ‘నేనూ రౌడీనే’ సినిమా కోసం నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ తొలిసారి కలిసి వర్క్‌ చేశారు. ఆ సినిమా చిత్రీకరణలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది. 

    ఆ స్నేహం కొద్ది కాలంలోనే ప్రేమగా మారింది. అలా సుమారు ఏడేళ్ల పాటు ఈ జంట ప్రేమించుకుంది.  2022లో పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

    ఆ తర్వాత సరోగసి విధానంలో ఇద్దరు కవల పిల్లలకు నయన్‌ జంట తల్లిదండ్రులయ్యారు. ఇద్దరు మగ పిల్లలకు ఉయిర్‌ రుద్రోనిల్‌ ఎన్‌.శివన్‌, ఉలగ్‌ దైవాగ్‌ ఎన్‌. శివన్‌ అని పేర్లు పెట్టారు.

    ఇక సినిమాల విషయానికి వస్తే విఘ్నేశ్‌ శివన్‌ ప్రస్తుతం ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

    ‘అన్నపూరణి’ సినిమాకు గాను నయనతార (Nayanthara) ఉత్తమ నటిగా ఇటీవల సైమా అవార్డును సొంతం చేసుకుంది. 

    నయనతార ప్రస్తుతం టెస్ట్‌’, ‘డియర్ స్టూడెంట్స్‌’, ‘తన్ని ఒరువన్‌ 2’ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. 

    నయనతార వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె పుట్టుకతో మలయాళీ. మల్లువుడ్‌లో జయరాం నిర్మించిన ‘మనస్సినక్కరే’(2003) చిత్రంతో ఆరంగ్రేటం చేసింది.

    ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో నయన్ పేరు మార్మోగిపోయింది. ఇక అప్పటి నుంచి నయన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

    తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో వరుస పెట్టి సినిమాలు చేసి సక్సెస్‌ అయ్యింది. అన్ని భాషల్లో తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. 

    ఈ అసాధారణ నటి తన జీవితంలో అతి పెద్ద తప్పిదాలు కూడా చేసింది. నయనతార వ్యక్తిగత జీవితంలో కూడా కష్ట సమయాలు ఉన్నాయి.

    తొలుత తమిళ నటుడు శింబుతో ప్రేమాయణం సాగించింది. శింబు వీరిద్దరి వ్యక్తిగత ఫొటోలను బయటపెట్టడంతో మనస్తాపానికి గురై అతడిని వదిలించుకుంది.

    ఆ తర్వాత నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం నడిపింది. ‘విల్లు’ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

    వీరిద్దరి వ్యవహారం ప్రభుదేవా భార్య దృష్టికి వెళ్లడం, ఆమె ప్రభుదేవా నుంచి  విడాకులు కోరడం చకచకా జరిగిపోయాయి.

    ఈ క్రమంలో ప్రభుదేవా నయనతారను పక్కనబెట్టాడు. ఈ పరిణామంతో నయనతార హతాశయురాలైంది. ఇది నయన్ జీవితంలో ఒక కోలుకోలేని దెబ్బ.

    ప్రభుదేవాతో బ్రేకప్ అనంతరం నయన్‌ జీవితంలోకి తమిళ డైరెక్టర్ విఘ్నేశ్‌ వచ్చాడు. అప్పటి నుంచి ఈ ‌అమ్మడు సినిమాల పరంగా వ్యక్తిగతంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

    ప్రస్తుతం దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో నయనతార అత్యధిక పారితోషికం తీసుకుంటోంది. ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version