NBK 110 : బాలయ్య-బోయపాటి కొత్త సినిమా ప్రకటన.. సరికొత్త రోల్‌లో బాలయ్య చిన్న కూతురు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • NBK 110 : బాలయ్య-బోయపాటి కొత్త సినిమా ప్రకటన.. సరికొత్త రోల్‌లో బాలయ్య చిన్న కూతురు!

    NBK 110 : బాలయ్య-బోయపాటి కొత్త సినిమా ప్రకటన.. సరికొత్త రోల్‌లో బాలయ్య చిన్న కూతురు!

    June 10, 2024

    టాలీవుడ్‌లో హీరోలకే కాకుండా కొన్ని రకాల కాంబినేషన్స్‌కు కూడా సెపరేట్‌ ఫ్యాన్స్ బేస్‌ ఉంటుంది. అలాంటి వాటిలో బాలకృష్ణ – బోయపాటి కాంబో ఒకటి. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. ముఖ్యంగా మాస్‌ ఆడియన్స్‌లో ఈ కాంబోకు యమా క్రేజ్‌ ఉంది. గతంలో బాలయ్య – బోయపాటి చేసిన హ్యాట్రిక్‌ చిత్రాలు ఇండస్ట్రీని షేక్‌ చేశాయి. ఇవాళ (జూన్‌ 10) బాలకృష్ణ పుట్టని రోజు సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్‌లో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. దీంతో నందమూరి అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు. 

    బాలయ్య కుమార్తె సమర్పణలో..

    ఇవాళ (జూన్‌ 10).. బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకొని బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త సినిమా ఖరారైంది. ఇది ‘NBK 110’ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య – బోయపాటి అప్‌కమింగ్‌ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్ సంస్థ ఆధ్వర్యంలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించనున్నారు. ‘లెజెండ్‌’ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న ఈ ఇద్దరు నిర్మాతలు.. ‘NBK110’ చిత్రాన్ని కూడా రాజీ పడకుండా భారీ ఎత్తున తీయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ మూవీకి నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించనుండటం విశేషం.

    షూటింగ్‌ ఎప్పుడంటే?

    బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రం గురించి ఇప్పటి నుంచే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ సెట్స్‌ పైకి ఎప్పుడు వెళ్తుందా అని ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో టాక్‌ ప్రకారం.. ‘NBK110’ చిత్రం ఆగస్టులో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్‌ బాబీతో కలిసి ‘NBK109’ చిత్రంలో చేస్తున్నాడు. చివరి దశ షూటింగ్‌లో ఉన్న ఈ సినిమాకు ఏపీ ఎన్నికల నేపథ్యంలో కాస్త బ్రేక్ పడింది. మిగిలిన కాస్త షూటింగ్‌ను పూర్తి చేసిన బోయపాటి సినిమాను పట్టాలెక్కించాలన్న ప్లాన్‌లో బాలయ్య ఉన్నారు. 

    బోయపాటికే సాటి..

    ఇండస్ట్రీకి హ్యాట్రిక్‌ విజయాలను అందించిన బాలకృష్ణ – బోయపాటి జర్నీ.. ‘సింహా’ సినిమాతో మెుదలైంది. నందమూరి అభిమానులు బాలయ్య నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ విధమైన కథ, డైలాగ్స్‌తో సినిమా తీసి విజయం సాధించారు బోయపాటి. ఆ తర్వాత వచ్చిన ‘లెజెండ్‌’, ‘అఖండ’ చిత్రాలు సైతం ఈ కోవలోనే వచ్చి భారీ విజయాలు సాధించాయి. బాలయ్యకు ఎలాంటి కథలు సెట్‌ అవుతాయి.. పాత్రకు తగ్గట్లు ఆయన్ను ఎలా మౌల్డ్‌ చేయాలన్నది బోయపాటి తెలిసినంతగా మరే డైరెక్టర్‌కు తెలియదని నందమూరి ఫ్యాన్స్‌ అంటుంటారు. అటువంటి ఈ ఇద్దరి కలయికలో నాల్గో చిత్రం అనౌన్స్‌ కావడంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. వీరి కాంబో ఈసారి కూడా ఇండస్ట్రీని షేక్‌ చేస్తుందని నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 

    ‘NBK109’ నుంచి క్రేజీ గ్లింప్స్‌

    నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో NBK 109 పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ ప్రాజెక్ట్‌ నుంచి బాలయ్య బర్త్‌డే గ్లింప్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. “దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకి కూడా వరాలిస్తాడు.. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది.. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అర్థాలే తెలియని అసురుడు” అనే డైలాగ్‌తో గ్లింప్స్ మొదలైంది. ఇక డైలాగ్ పూర్తి కాగానే బాలయ్య అలా నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చారు. ఇక గ్లింప్స్ చివరిలో గుర్రంపై బాలయ్య కనిపించిన సీన్ హైలెట్‌గా ఉంది. మొత్తానికి బాలయ్య బర్త్‌డేకి మంచి ట్రీట్ ఇచ్చింది NBK109 టీమ్. మీరూ గ్లింప్స్‌ చూసేయండి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version