హీరో ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ ‘ఆదిపురుష్’ డిజిటల్(OTT) హక్కులు రికార్డు ధరకు అమ్ముడైనట్లు తెలిసింది. నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.250 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మూవీ వీఎఫ్‌ఎక్స్ కోసం నిర్మాతలు విదేశీ స్టూడియోలతో ఒప్పందం కుదుర్చుకొని కోట్లలో ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీత పాత్రలో కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, లంకేశ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.
ఆదిపురుష్‌ను రూ.500 కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అయితే అందులో సగం రూ.250 కోట్లు ఇప్పటికే డిజిటల్ రైట్స్‌తోనే సంపాదించింది. ఇక శాటిలైట్ రైట్స్ , థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపితే విడుదలకు ముందే సినిమా బడ్జెట్ మొత్తం తిరిగి వచ్చేలా కనిపిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే షూటింగ్ పూర్తయింది. కానీ పలు కారణాలతో విడుదల వాయిదా పడుతూ వస్తుంది. దీంతో చివరికి వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ సినిమా కోసం ప్రభాస్ రూ.100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. టి-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
ఈ మైథాలజికల్ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రభాస్‌ను రాముడిలా ఎలా చూపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆదిపురుష్ అప్‌డేట్స్ గురించి ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. త్వరలో టీజర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. షూటింగ్ త్వరగా పూర్తయినప్పటికీ వీఎఫ్ఎక్స్ కోసం చాలా సమయం తీసుకుంటున్నారు. ప్రభాస్ నేరుగా హిందీలో నటిస్తున్న సినిమా ఇది. దీన్ని ఇండియాలో అన్ని భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. బాహుబలి నుంచి ప్రభాస్ సినిమాలకు విదేశాల్లోనూ క్రేజ్ ఏర్పడటంతో వారిని కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందిస్తున్నారు.
ఆదిపురుష్ విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో ఒక సినిమా, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చేస్తున్నాడు. కొరటాల శివ కూడా మరోసారి ప్రభాస్‌తో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే ఇతర చిత్రాలు తెరకెక్కే అవకాశముంది.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..