‘స‌ర్కారు వారి పాట’ నుంచి ‘మురారివా’ వీడియో సాంగ్ రిలీజ్‌
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘స‌ర్కారు వారి పాట’ నుంచి ‘మురారివా’ వీడియో సాంగ్ రిలీజ్‌

  ‘స‌ర్కారు వారి పాట’ నుంచి ‘మురారివా’ వీడియో సాంగ్ రిలీజ్‌

  July 20, 2022

  మ‌హేశ్‌బాబు, కీర్తిసురేశ్ జంట‌గా న‌టించిన‌  ‘స‌ర్కారు వారి పాట’ సినిమా నుంచి ‘మురారివా’ విడియో సాంగ్ రిలీజైంది. అయితే ఈ పాట‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంది. సినిమా విడుద‌లైన‌ప్పుడు మొద‌ట ఈ పాట లేదు. త‌ర్వాత కొన్ని రోజుల‌కు దీనిని మూవీలో యాడ్ చేశారు.  ఈ సాంగ్‌లో మ‌హేశ్, కీర్తి సురేశ్ అందంగా క‌నిపిస్తున్నారు. ఈ క‌ల‌ర్‌ఫుల్ సాంగ్‌లో ఇద్ద‌రూ డ్యాన్స్‌తో ఇర‌గ‌దీశారు. దీనికి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించ‌గా శృతి రంజ‌నీ, శ్రీకృష్ణ‌, గాయ‌త్రి క‌లిసి పాడారు.  త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు.

  స‌ర్కారు వారి పాట సినిమాలో పాట‌ల‌న్నీ సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా క‌ళావ‌తి సాంగ్ కొత్త‌ రికార్డు క్రియేట్ చేసింది.  అయితే ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట అమెజాన్ ప్రైమ్‌లో రూ.199  చెల్లించి చూసే అవ‌కాశం ఉంది. మ‌రికొన్ని రోజుల్లో సినిమాలో అమెజాన్ ప్రైమో ఓటీటీలో ఉచితంగా అందుబాటులోకి రాబోతుంది. స‌ముద్ర‌ఖ‌ని, సుబ్బ‌రాజు, వెన్నెల కిశోర్, త‌నికెళ్ల భ‌ర‌ణి త‌దిత‌రులు మూవీలో కీల‌క పాత్ర‌ల్లో కనిపించారు. ఈ సినిమా ద్వారా మ‌రోసారి పోకిరి స‌మ‌యంలో ఉన్న‌ మ‌హేశ్‌బాబును చూశామంటూ ఫ్యాన్స్ ఆనంద‌ప‌డ్డారు. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ స‌మ్మ‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

  https://youtu.be/tCI5wz2rEbY

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version