Niharika Divorce: నిహారిక విడాకులపై నెట్టింట ఆసక్తికర చర్చ.. ఇద్దరిలో తప్పెవరిదంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Niharika Divorce: నిహారిక విడాకులపై నెట్టింట ఆసక్తికర చర్చ.. ఇద్దరిలో తప్పెవరిదంటే?

    Niharika Divorce: నిహారిక విడాకులపై నెట్టింట ఆసక్తికర చర్చ.. ఇద్దరిలో తప్పెవరిదంటే?

    January 27, 2024

    వివాహం జరిగిన మూడేళ్లలోనే విడాకులు తీసుకోవడంపై నటి నిహారిక (Niharika) స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. విడాకులకు ముందు, ఆ తర్వాత ఎదుర్కొన్న సమస్యలపై తొలిసారి పెదవి విప్పారు. దీనిపై నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ కూడా ఘాటుగా స్పందించడంతో వీరి విడాకుల అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ నిహారిక ఏమన్నది? దానికి ఆమె మాజీ భర్త వేసిన కౌంటర్‌ ఏంటి? నిహారిక విడాకులపై నెటిజన్లు ఏమనుకుంటున్నారు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 

    ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా: నిహారిక

    తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన నిహారిక విడాకులపై తన మనసులోని భావాలను పంచుకుంది. ‘పెళ్లి అనేది చిన్న విషయం కాదు. జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే అడుగులు వేశా. కానీ అనుకున్నవిధంగా పరిస్థితుల్లేవు. సులభంగా మనుషులను నమ్మకూడదనే విషయం అర్థమైంది. నేనొక జీవిత పాఠం నేర్చుకున్నా. ఆన్‌లైన్‌ వేదికగా చాలామంది నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నేను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నానో వాళ్లకు తెలియదు. క్లిష్ట సమయంలో నాన్న అండగా నిలబడి ధైర్యం చెప్పారు. నా కుటుంబం నన్ను ఎప్పటికీ భారం అనుకోలేదు. ప్రస్తుతానికి  నా ఫోకస్‌ మొత్తం సెల్ఫ్‌కేర్‌ పైనే ఉంది. నేను సంతోషంగా ఉంటూ కుటుంబానికి తోడుగా ఉండాలనుకుంటున్నా’ అని నిహారిక చెప్పారు.

    నాణానికి ఒక వైపే చూస్తే ఎలా: చైతన్య

    నిహారిక వ్యాఖ్యలపై (#NiharikaDivorce) ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda) రియాక్ట్ అయ్యారు. హోస్ట్‌ పోస్టు చేసిన వీడియో కామెంట్‌ సెక్షన్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘విడాకుల విషయమై ఒకరి వైపు నుంచే మాట్లాడకూడదు. ఇలాంటి విషయాల్లో బాధ ఇద్దరికీ ఉంటుంది. జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా జడ్జ్‌ చేయడం ఎంత తప్పో.. ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ప్రజలకు ఓ కోణంలోనే చెప్పడం అంతే తప్పు. విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా ప్రజలకు అసత్యాలను ప్రచారం చేయడం అన్యాయం. నాణేనికి ఒకవైపు మాత్రమే చూపించి నిజం అంటే ఎలా? అదే నిజం అంటూ ప్రజల్లోకి అసత్యాలను ప్రచారం చేస్తే ఎలా?’ అని ఘాటుగా బదులిచ్చారు. 

    నెటిజన్స్ ఏమంటున్నారంటే?

    నిహారిక – చైతన్య విడాకుల అంశంపై నెటిజన్లు (#NiharikaDivorce) తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మెగా ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున నిహారికకు అండగా నిలుస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ లాగే తమ సపోర్టు కూడా నిహారికకే ఉంటుందని భరోసా ఇస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం నిహారికను బాధ్యురాలిగా చేస్తూ నెగిటివ్‌ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మెగా ఫ్యామిలీకి ‘పెళ్లిళ్లు ఆపై వెంటనే విడాకులు’ అనే శాపం ఉందని పోస్టులు చేస్తున్నారు. విడాకుల విషయంలో తప్పు ముమ్మాటికీ నిహారికదేనని ఏకపక్షంగా తీర్పు ఇచ్చేస్తున్నారు. నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయి పోటాపోటీగా కామెంట్లు పెడుతుండటంతో నిహారిక విడాకుల (#NiharikaDivorce) అంశం మరోమారు నెట్టింట ట్రెండ్ అవుతోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version