Niharika Konidela Divorce: అక్కడ పెళ్లి చేసుకుంటే అంతేనా? నిహారిక- చైతన్య, సమంత- నాగచైతన్యకు కలిసి రాని డెస్టినేషన్ వెడ్సింగ్స్!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Niharika Konidela Divorce: అక్కడ పెళ్లి చేసుకుంటే అంతేనా? నిహారిక- చైతన్య, సమంత- నాగచైతన్యకు కలిసి రాని డెస్టినేషన్ వెడ్సింగ్స్!

    Niharika Konidela Divorce: అక్కడ పెళ్లి చేసుకుంటే అంతేనా? నిహారిక- చైతన్య, సమంత- నాగచైతన్యకు కలిసి రాని డెస్టినేషన్ వెడ్సింగ్స్!

    July 5, 2023

    మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, మాజీ ఐజీ ప్రభాకరరావు కుమారుడు చైతన్యలకు విడాకులు మంజూరు అయ్యాయి. ఏప్రిల్ 1న పరస్పర అంగీకారంతో విడాకుల కోసం కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకోగా.. జూన్ 5న వీరికి డైవర్స్ మంజూరు అయ్యాయి. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. 2020 డిసెంబర్‌లో నిహారిక, చైతన్యల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత 2 ఏళ్లపాటు ఈ జంట బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో కొద్దికాలం దూరంగా జీవనం సాగించారు. ఆ తర్వాత ఇక కలిసి ఉండలేమని భావించి పరస్పర అంగీకారంతో విడిపోయారు. 

    విడాకులకు అసలు కారణం ఇదేనా?

    నిహారిక- చైతన్య జొన్నలగడ్డ వివాహం తర్వాత నిహారిక చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. ఒకసారి ఓ పబ్‌ పార్టీలో నిహారిక పేరు వినిపించడం అప్పట్లో తెగ వైరల్ అయింది. ఓసారి అపార్ట్‌మెంట్‌ వాళ్లతో గొడవతో నిహారిక మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో చైతన్య- నిహారికల మధ్య మనస్పర్థలు పెరిగి విడాకులకు దారితీసినట్లు సమాచారం. పెళ్లికి ముందు గారాల పట్టిగా పెరిగిన నిహారిక వివాహా అనంతరం కాస్త ఫ్రీడమ్‌ను కోల్పోయినట్లు తెలిసింది.

    విడాకులపై నిహారిక స్పందన

    చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకోవడంపై మెగా డాటర్‌ నిహారిక తొలిసారి స్పందించింది. తాము పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ఈ సున్నిత సమయంలో తమని ఇబ్బంది పెట్టవద్దని కోరింది. అభిమానులు సంయమనం పాటించాలని కోరింది.  కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితంలో తాము ప్రైవసీని కోరుకుంటున్నట్లు పోస్టులో తెలిపింది. దీనిని అందరూ గౌరవించి  సహకరించాలని నిహారిక కోరింది. ఇంత కాలం తనకు అండగా ఉన్న కుటుంబసభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు అంటూ తన పోస్టును నిహారిక ముగించింది.

    చైతన్య ఎమన్నారంటే?

    నిహారికతో విడాకుల నేపథ్యంలో చైతన్య జొన్నలగడ్డ చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతిఒక్కరికి రుణపడి ఉంటా. 10 రోజులుగా నా జీవితంలో వచ్చిన ‘విపాసన’ ప్రక్రియ అద్భుతం. మనం ఒక ప్రాంతానికి ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి.. అద్భుత జ్ఞానంతో తిరిగొస్తుంటాం. ఇది కూడా అలాంటిదే అని పోస్ట్ పెట్టాడు. కాగా ప్రస్తుతం చైతన్య మానసిక ప్రశాంతత పొందేందుకు ముంబైలోని విపాసన మెడిటేషన్ సెంటర్‌లో ఉన్నట్లు తెలిసింది.

    అక్కడ పెళ్లి చేసుకుంటే అంతేనా?

    టాలీవుడ్‌లో సమంత- నాగచైతన్య (Samantha- Nagachithanya) విడాకులు పొందిన తీరును కొంతమంది.. నిహారిక- చైతన్య డైవర్స్‌తో పోలుస్తున్నారు. ఈ రెండు జంటలు సొంత ప్రాంతంలో కాకుండా బయటి ప్రదేశంలో (డెస్టినేషన్ వెడ్డింగ్) వివాహం చేసుకున్నారు. కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిహారిక- చైతన్య..  2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లో గ్రాండ్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination wedding) చేసుకున్నారు. అలా చేసుకున్న రెండేళ్లకే ఈ జంట విడిపోయింది. 

    అంతకు ముందు 2017 అక్టోబర్ 6న గోవాలో నాగచైతన్య- సమంత ఇదే తరహాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ జంట కాపురం కూడా కొద్ది కాలం సజావుగానే సాగింది. ఆ తర్వాత ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో 2021లో విడిపోయారు. దీంతో ఫ్యాన్స్ టాలీవుడ్ సెలబ్రెటీలకు డెస్టినేషన్ మ్యారెజెస్ కలిసి రావడం లేదని వాదిస్తున్నారు. వరుణ్ తేజ్‌- లావణ్య త్రిపాఠి అయినా ఇక్కడే పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version