NIHARIKA NM: యూట్యూబ్‌ సెన్సేషన్‌ నిహారిక NM గురించి ఈ నిజాలు తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • NIHARIKA NM: యూట్యూబ్‌ సెన్సేషన్‌ నిహారిక NM గురించి ఈ నిజాలు తెలుసా?

    NIHARIKA NM: యూట్యూబ్‌ సెన్సేషన్‌ నిహారిక NM గురించి ఈ నిజాలు తెలుసా?

    April 27, 2023

    నిహారిక NM. బహుశా ఈ యూట్యూబర్‌ గురించి తెలయని వారుండరనుకుంటా. బాలీవుడ్‌, టాలీవుడ్‌ ఇలా ఏ ఇండస్ట్రీలోనైనా సినిమా రిలీజ్‌ ఉందంటే ఆమెతో ప్రమోషన్ చేయించుకునేందుకు స్టార్స్ ఆసక్తి చూపిస్తుంటారు.

    విభిన్నమైన కాన్సెప్ట్స్‌తో యూట్యూబ్ రీల్స్‌ చేసి ఒక్కసారిగా ఫేమ్‌ను అందుకుంది. మహేశ్‌ బాబు, విజయ్ దేవరకొండ, అమీర్‌ ఖాన్‌, రణ్‌బీర్ కపూర్‌ ఇలా అందరితోనూ రీల్స్‌ చేసింది.

     

    ఈ బెంగళూరు భామ ముంబై ఫ్యాషన్‌షోలో తళుక్కున మెరిసింది. ఫ్యాషన్ డిజైనర్ సమీర్‌ మదన్ కోసం ర్యాంప్‌పై హోయలొలకించింది నిహారిక. 

    ఓ తెలుపు రంగు డ్రెస్‌లో దానిపై అదే కలర్ జాకెట్‌ వేసుకొని ఎరుపు రంగు లిప్‌ స్టిక్‌ పెట్టి సూపర్‌హాట్‌గా కనిపించింది. పులి చారలుండే బెల్ట్‌ను కూడా పెట్టింది సుందరి. 

    ఏదో సరాదాగా యూట్యూబ్‌లో వీడియో తీసింది నిహారిక. చదువులో ఒత్తిడి నుంచి బయటపడేందుకు 2016లో పుట్టినరోజు వేడుకల్లో ఎలా ఉంటారని తీసి పోస్ట్ చేసింది. 

    వరుసగా అలాంటి కంటెంట్‌ పెడుతూ ఫేమస్ అయ్యింది. తర్వాత ఇన్‌స్టా గ్రామ్‌ రీల్స్‌ ప్రారంభం కావటంతో వాటిపై ఫోకస్‌ పెట్టింది. 

    ఇన్‌స్టా చాలా హిట్‌ రీల్స్‌ చేసింది నిహారిక. వన్‌ వే స్ట్రీట్‌ అనే రీల్‌ దాదాపు 10 మిలియన్ వ్యూస్ సంపాదించింది. 

    సామాజిక మాధ్యమాల్లో త్వరగా పేరు సంపాదించుకుంది ఈ యూట్యూబర్‌. కేవలం 2 నెలల్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ పెరిగారు. ప్రస్తుతం ఆమెకు 3.2 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు.

    కంటెంట్‌తోనే కాదు అందంతోనూ ఆకట్టుకుంటుంది ముద్దుగుమ్మ. ఈ అమ్మడి హాట్‌ లుక్స్‌కి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. 

    తెలుగు స్టార్స్‌తోనే ప్రమోషనల్‌ రీల్స్ చేసింది నిహారిక NM. సర్కారు వారి పాట , మేజర్‌ కోసం మహేశ్‌బాబు, లైగర్‌ విజయ్ దేవరకొండ, కేజీఎఫ్‌ 2 యశ్‌తో చేసిన రీల్స్‌ చాలా ఫేమస్. 

    నిహారిక ఫ్యాషన్ ఫ్రీక్‌. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా డ్రెస్సింగ్‌ వేస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తుంది. 

    బెంగళూరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి లాస్‌ ఏంజెల్స్‌లో MBA చేసింది. కాస్త బ్రేక్‌ తీసుకోవటానికి వీడియోలు చేయడం ప్రారంభించింది. 

    కామెడీలో నిహారిక టైమింగ్ వేరే లెవల్. హాలీవుడ్‌ నటులు జిమ్ క్యారీ, రోవన్‌ అట్కిన్సన్, బ్రహ్మనందం, వడివేలు, వెన్నెల కిషోర్ స్ఫూర్తి అని చెప్పింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version