Noise ColorFit Pro 5: నాయిస్‌ నుంచి మరో అడ్వాన్స్‌డ్‌ స్మార్ట్‌వాచ్‌.. ధర, ఫీచర్లపై లుక్కేయండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Noise ColorFit Pro 5: నాయిస్‌ నుంచి మరో అడ్వాన్స్‌డ్‌ స్మార్ట్‌వాచ్‌.. ధర, ఫీచర్లపై లుక్కేయండి!

    Noise ColorFit Pro 5: నాయిస్‌ నుంచి మరో అడ్వాన్స్‌డ్‌ స్మార్ట్‌వాచ్‌.. ధర, ఫీచర్లపై లుక్కేయండి!

    November 29, 2023

    నాయిస్‌ (Noise) కంపెనీ విడుదల చేసే స్మార్ట్‌వాచ్‌లకు భారత్‌లో మంచి గుడ్‌విల్‌ ఉంది. మీడియం రేంజ్‌ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్‌ వాచ్‌లను రిలీజ్ చేస్తుందని నాయిస్‌కు పేరుంది. ఈ క్రమంలోనే నాయిస్‌ తాజాగా కొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ‘Noise ColorFit Pro 5’ పేరుతో వాచ్‌ను లాంచ్‌ చేసింది. టెక్‌ ప్రియులు కోరుకున్న అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఇందులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ వాచ్‌ ఫీచర్లపై ఓ లుకేద్దాం. 

    రెండు వేరియంట్లలో.. 

    Noise ColorFit Pro 5 స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ రెండు వేరియంట్లలో విడుదల చేసింది. నాయిస్‌ కలర్‌ఫిట్‌ ప్రో 5 (Noise ColorFit Pro 5), నాయిస్‌ కలర్‌ఫిట్‌ ప్రో 5 మ్యాక్స్‌ (Noise ColorFit Pro 5 Max) మోడల్స్‌లో ఈ వాచ్‌ లభించనుంది. 

    వాచ్ స్క్రీన్‌

    నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 5 స్మార్ట్‌వాచ్.. 390 x 450 రిజల్యూషన్‌తో 1.85 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే మాక్స్ వేరియంట్ మాత్రం 410 x 502 రిజల్యూషన్‌తో కొంచెం పెద్దగా 1.96 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ రెండు వేరియంట్లు 600నిట్స్ బ్రైట్‌నెస్‌ స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి. 

    వాటర్‌ రెసిస్టెన్సీ

    దుమ్ము – దూళి, నీటి నుంచి రక్షణ కోసం ఈ వాచ్‌లకు IP68 rating అందించారు. దీని వలన వర్షపు చినుకులు, చెమట, ఇసుక రేణువుల నుంచి వాచ్‌కు ప్రొటెక్షన్‌ లభిస్తుంది

    హెల్త్  ఫీచర్లు

    ఈ సరికొత్త నాయిస్ స్మార్ట్‌వాచ్‌లు అడ్వాన్స్‌డ్‌ హెల్త్‌ మానిటరింగ్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇవి హృదయ స్పందన రేటు, ఎస్‌పీఓ2 స్థాయిలు, నిద్ర విధానాలు, ఒత్తిడి స్థాయిలు వంటి వివిధ ఆరోగ్య కీలకాలను మానిటరింగ్ చేయడంలో సాయపడతాయి. అలాగే రోజువారీ రిమైండర్‌లు, వాతావరణ సూచనలను కూడా వాచ్‌ అందిస్తుంది. 

    స్పోర్ట్స్ మోడ్స్‌

    క్రీడాకారులు, రోజూ వాకింగ్‌, జాగింగ్ చేసే వారికి ఈ వాచ్‌ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో 100కి పైగా స్పోర్ట్స్‌ మోడ్స్ ఉన్నాయని కంపెనీ స్పెసిఫికేషన్స్‌లో పేర్కొంది. అలాగే 150 కన్నా ఎక్కువ వాచ్ ఫేస్‌లకు ఈ వాచ్‌లు సపోర్టు చేస్తాయని తెలిపింది. 

    బ్యాటరీ లైఫ్‌

    ఈ నయా నాయిస్‌ వాచ్‌.. బెటర్‌ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే ఏడు రోజుల పాటు నిర్విరామంగా పనిచేస్తాయని తెలిపింది. కాబట్టి ఛార్జింగ్ గురించి వినియోగదారులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

    కలర్‌ ఆప్షన్స్‌

    ఈ నాయిస్ వాచ్‌లు.. మిడ్‌నైట్‌ బ్లాక్‌ (Midnight Black), వింటేజ్‌ బ్రౌన్‌ (Vintage Brown), సన్‌సెట్‌ ఆరెంజ్‌ (Sunset Orange), క్లాసిక్ బ్లూ (Classic Blue), క్లాసిక్‌ బ్రౌన్‌ (Classic Brown), ఎలైట్‌ బ్లాక్‌ (Elite Black), ఎలైట్‌ రోజ్‌ గోల్డ్‌ (Elite Rose Gold), ఆలివ్ గ్రీన్‌ (Olive Green), రెయిన్‌బో వేవ్ (Rainbow Weave), స్టార్‌లైట్‌ గోల్డ్‌ (Starlight Gold) కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉన్నాయి. 

    ధర ఎంతంటే?

    నాయిస్ కలర్ ఫిట్ ప్రో 5 వాచ్‌ ప్రారంభ ధర రూ. 3,999గా ఉంది. నాయిస్ కలర్ ఫిట్ ప్రో 5 మ్యాక్స్ బేస్ వెర్షన్‌ను రూ.4,999కు సొంతం చేసుకోవచ్చు. అటు ఎలైట్ ఎడిషన్‌ ధరలను కంపెనీ వరుసగా రూ.4,999, రూ.5,999గా ప్రకటించింది. ఈ వాచ్‌లను GoNoise.com వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ఈ కామర్స్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version