Nothing Phone 2a VS Moto Edge 40 Neo: ఏది కొనాలో తెలియట్లేదా..? ఇది మీకోసమే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nothing Phone 2a VS Moto Edge 40 Neo: ఏది కొనాలో తెలియట్లేదా..? ఇది మీకోసమే!

    Nothing Phone 2a VS Moto Edge 40 Neo: ఏది కొనాలో తెలియట్లేదా..? ఇది మీకోసమే!

    March 6, 2024

    ప్రముఖ టెక్‌ కంపెనీ నథింగ్‌ (Nothing).. ఇప్పటివరకూ రెండు ఫోన్లను మాత్రమే విడుదల చేసింది.  అయినప్పటికీ కావాల్సినంత ప్రచారం ఈ సంస్థకు లభించింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన Nothing 1, Nothing 2 మెుబైల్స్‌కు టెక్‌ ప్రియుల్లో మంచి ఆదరణ లభించింది. దీంతో తాజాగా ఈ సంస్థ సరికొత్త మెుబైల్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. ‘Nothing Phone 2a’ పేరుతో మంగళవారం (ఫిబ్రవరి 5) కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో రిలీజ్‌ చేసింది. దీనిలోని స్టన్నింగ్‌ ఫీచర్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మోటోరోలా ఇటీవల తీసుకొచ్చిన ‘Moto Edge 40 Neo’ మెుబైల్‌కు పోటీగా ఈ నథింగ్‌ ఫోన్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్లలో ఏది బెటర్‌ ఫీచర్లు కలిగి ఉంది? వీటి ధరలు ఎలా ఉన్నాయి? ఈ రెండిటిలో ఏ ఫోన్‌ది పైచేయి? వంటి అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం. 

    మెుబైల్‌ స్క్రీన్‌

    Nothing 2a మెుబైల్‌.. 6.7 అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌తో లాంచ్ అయ్యింది. దీనికి  1,080×2,412 పిక్సెల్ రిజల్యూషన్‌, 30Hz – 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 394 ppi పిక్సెల్‌ డెన్సిటీ, Corning Gorilla Glass 5 ప్రొటెక్షన్‌,  Android 14 ఆధారిత Nothing OS 2.5 ఆపరేటింగ్‌ సిస్టమ్, octa-core 4nm MediaTek Dimensity 7200 Pro SoC ప్రొసెసర్‌ను అందించారు. అటు Motorola Edge 40 Neo మెుబైల్‌.. 6.55 అంగుళాల FHD+ P-OLED స్క్రీన్‌, 2412 x 1084 pixels రిజల్యూషన్‌,  MediaTek Dimensity 7030 (6 nm) ప్రొసెసర్‌, Android 13 ఆధారిత MiUX OS ఫీచర్లను కలిగి ఉంది. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    Nothing Phone 2a మెుబైల్.. మూడు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లాంచ్ అయ్యింది. 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్లలో ఈ మెుబైల్‌ను పొందవచ్చు. అటు Motorola Edge 40 Neo ఫోన్‌.. 8GM RAM / 128GB ROM, 12GB RAM / 256GB స్టోరేజ్‌తో లభిస్తోంది. ఈ రెండు ఫోన్లలో స్టోరేజ్‌ను microSD కార్డ్‌ ద్వారా 1TB వరకూ పెంచుకునే వెసులుబాటును కల్పించారు. 

    బ్యాటరీ

    Nothing Phone 2a మెుబైల్‌ను 5,000mAh బ్యాటరీతో తీసుకొచ్చారు. దీనికి 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు అందించారు. సింగిల్‌ ఛార్జ్‌తో రెండ్రోజుల బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చని నథింగ్‌ వర్గాలు తెలిపాయి. మరోవైపు Motorola Edge 40 Neo మాత్రం పవర్‌ఫుల్ బ్యాటరీతో వచ్చిందని చెప్పవచ్చు. దీనికి 68W టర్బో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు కలిగిన 5000mAh బ్యాటరీని ఫిక్స్‌ చేశారు. ఈ ఫోన్‌ను చాలా ఫాస్ట్‌గా ఛార్జ్‌ చేసుకోవచ్చు.

    కెమెరా

    ఏ మెుబైల్‌కైనా కెమెరా ఫీచర్లు చాలా ప్రధానం. Nothing Phone 2a మెుబైల్‌ వెనకవైపు డ్యూయల్‌ కెమెరా సెటప్‌ ఉంది. 50 MP ప్రైమరీ + 50 MP సపోర్టింగ్‌ సెన్సార్‌ చొప్పున రెండు కెమెరాలు అమర్చారు. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంది. అటు Motorola Edge 40 Neo కూడా డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తోనే వచ్చింది. 50MP ప్రైమరి కెమెరా + 13MP అల్ట్రావైడ్‌ కెమెరాను ఫోన్‌కు అమర్చారు. ఇక ముందు వైపు సెల్ఫీల కోసం ఏకంగా 32MP సెన్సార్‌ను ఇవ్వడం విశేషం. 

    కనెక్టివిటీ ఫీచర్లు

    Nothing Phone 2a..5G, 4G LTE, Wi-Fi 6, Wi-Fi 6 Direct, Bluetooth 5.3, NFC, GPS, GLONASS, GALILEO, QZSS, 360 డిగ్రీ యాంటెన్నా, USB Type-C port వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే యాక్సిలోమీటర్‌, ఎలక్ట్రిక్‌ కంపస్‌, గైరోస్కోప్‌, అంబియంట్‌ లైట్‌, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఫోన్‌లో ఉన్నాయి. అటు Motorola Edge 40 Neo ఫోన్‌ కూడా Wi-Fi 802.11 a/b/g/n/ac/ax, GPS, Bluetooth v5.00, NFC,  USB Type-C వంటి కనెక్టివిటీ ఫీచర్లతో పాటు.. నథింగ్‌ ఫోన్‌ తరహాలోనే ఒకే విధమైన సెన్సార్లను కలిగి ఉంది. 

    కలర్ ఆప్షన్స్‌

    Nothing Phone 2a మెుబైల్ కేవలం రెండు కలర్ ఆప్షన్స్‌ను మాత్రమే కలిగి ఉంది. వైట్‌ (White), బ్లాక్‌ (Black) కలర్స్‌లో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. Motorola Edge 40 Neo ఫోన్‌.. మూడు రంగుల్లో సేల్ అవుతోంది. బ్లాక్‌ బ్యూటీ (Black Beauty), క్యానిల్‌ బే (Caneel Bay), షూటింగ్‌ సీ  (Soothing Sea) కలర్‌ వేరియంట్లలో ఇది లభిస్తోంది. 

    ధర ఎంతంటే?

    Nothing Phone 2a మెుబైల్‌ ధరను వేరియంట్ల ఆధారంగా కంపెనీ ప్రకటించింది. 8GB + 128GB మోడల్‌ రూ.23,999, 8GB + 256GB రూ.25,999, 12GB + 256GB రూ.27,999కు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. మార్చి 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా మెుబైల్‌ సేల్స్‌ మెుదవుతాయని స్పష్టం చేసింది. ఇక Motorola Edge 40 Neo మెుబైల్స్ ధరలకు వస్తే 8GB RAM / 128GB రూ.22,999, 12GB RAM / 256GB వేరియంట్‌ ధర రూ.24,999గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌ అవుతోంది. 

    దేనిది పైచేయి?

    Nothing Phone 2a, Motorola Edge 40 Neo ఒకే ప్రైస్‌ సెగ్మెంట్‌లో రిలీజ్‌ కావడంతో పాటు దాదాపుగా ఒకే తరహా ఫీచర్లను కలిగి ఉన్నాయి. అయితే ఆపరేటింగ్ సిస్టమ్‌ పరంగా మోటో (ఆండ్రాయిడ్‌ 13) కంటే నథింగ్‌ (ఆండ్రాయిడ్‌ 14) ఫోన్‌ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. రియర్‌ కెమెరాలు పరంగా చూసిన నథింగ్ ఆకట్టుకుంటోంది. ఇక బ్యాటరీ పరంగా మోటో చాలా బెటర్‌గా కనిపిస్తోంది. దీనికి ఏకంగా టర్బో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను అందించడం విశేషం. ఓవరాల్‌గా చూస్తే మోటో కంటే లేటెస్ట్‌ ఫీచర్లతో వచ్చిన నథింగ్‌ కాస్త బెటర్‌ ఛాయిస్‌గా అనిపిస్తోంది. మీ అంచనాలకు, అవసరాలకు అనుగుణంగా ఉన్న ఫోన్‌ను పొందేందుకు కింద ఉన్న లింక్స్‌పై క్లిక్ చేయండి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version