RRR: లాస్ వెగాస్‌లో ఎన్టీఆర్ అభిమానుల రచ్చ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RRR: లాస్ వెగాస్‌లో ఎన్టీఆర్ అభిమానుల రచ్చ

    RRR: లాస్ వెగాస్‌లో ఎన్టీఆర్ అభిమానుల రచ్చ

    March 25, 2022

    లాస్ వెగాస్ ప్రపంచ వినోద రాజధాని. అటువంటి చోట RRR సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు చేసిన రచ్చ మామూలుగా లేదు. ప్రపంచలోనే పెద్దదైన బిల్ బోర్డ్స్‌ ‌పైన RRR ప్రోమోను ప్రదర్శించారు. అమెరికాలో ఉంటున్న జూ. ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌లో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన RRR మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇది వరకే ఈ సినిమాను చిత్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు వాళ్ల కుటుంబసభ్యులు కూడా తిలకించారు. 

    ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అటు రామ్ చరణ్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు థియేటర్ల ముందు హంగామా చేస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందని చెబుతున్నారు. కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చిన ఈ సినిమా చివరికి ఈ రోజు రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ అలియా భట్ కూడా నటించింది. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, విలక్షణ నటుడు సముద్రఖని వంటి వారు కూడా ఉన్నారు. ఈ చిత్రానికి కీరవాణి  స్వరాలు సమకూర్చాడు.

    Ramaraju For Bheem - Bheem Intro - RRR (Telugu) | NTR, Ram Charan, Ajay Devgn, Alia | SS Rajamouli
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version