NTR30 చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఆమె రూ.5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సినిమాలకు రూ.3 నుంచి రూ.3.5 కోట్లు తీసుకున్న జాన్వీ.. తెలుగులో లాంచ్ అవ్వడానికి మాత్రం ఒకేసారి కోటిన్నర పెంచేసింది. కాగా RC15లో నటిస్తున్న మరో బాలీవుడ్ కియారా రూ.3.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
కల నెరవేరింది
టాలీవుడ్‌లో తారక్‌తో నటించాలని ఉన్నట్లు చాలాకాలంగా చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఆమె పేరు ఎక్కువగా వినిపించినప్పటికీ కన్ఫర్మ్ కాలేదు. ఇటీవల ఆమె పుట్టినరోజుకి చిత్రంలోకి ఆహ్వానిస్తూ నిర్మాతలు పోస్ట్ చేశారు.
భవిష్యత్తులో ఇంకా డిమాండ్?
తెలుగులో మెుదటి సినిమాకే రూ. 5 కోట్లు డిమాండ్ చేసిందంటే భవిష్యత్‌లో మరింత పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే కొరటాల శివ, తారక్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కచ్చితంగా హిట్ అవుతుందని చిత్రబృందం నమ్మకంతో ఉంది. ఒకవేళ బాక్సాఫీస్ వద్ద సినిమా ఆడితే ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడతాయి.
పెరిగిన ఫ్యాన్స్
జాన్వీకి బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్ చేసే హాట్ ఫొటోస్‌కు మంత్రముగ్దులైన యువత ఎక్కువే.
తెలుగులోకి ఎప్పుడు వస్తుందా అని చూసిన అభిమానులకు తారక్ సినిమాతో ఎంట్రీ ట్రీట్ లాంటింది.
టాలీవుడ్‌కి ఆమె ముందే పరిచయం కావటానికి ముఖ్య కారణం ప్రముఖ నటి శ్రీదేవి. వివిధ భాషల్లో ఆమె నటించినప్పటికీ తెలుగులో ఉన్న గుర్తింపు వేరు. అందువల్ల ఇప్పటికే జాన్వీ కపూర్ తెలుగులో సుపరిచితురాలు.
శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లోకి ధడ్ చిత్రం ద్వారా అడుగుపెట్టింది జాన్వీ.
మలయాళ చిత్రం సైరాత్ రీమేక్‌గా తెరకెక్కించిన ఈ సినిమా హిందీలో అంతంత మాత్రంగానే ఆడింది. జాన్వీకి పెద్దగా పేరు తీసుకురాలేదు ఈ చిత్రం
నటనపరంగా గుర్తింపు
నటనపరంగా జాన్వీకి గుర్తింపు తెచ్చిన సినిమా గుంజన్ సక్సేనా. నిజ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రంలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నిజంగా జాన్వీ ఇంత అద్భుతంగా నటించ గలదా అని అంతా అనుకున్నారు.
ఇటీవల మిలీ సినిమాతోనూ ప్రేక్షకులను పలకరించింది. అయితే, చిత్రం పెద్దగా ఆడలేదు. కానీ, జాన్వీ నటన చాలా మెరుగు పడిందంటూ ప్రశంసలు వచ్చాయి. నటనకు ఆస్కారమున్న పాత్రలు ఎంచుకుంటూ గుర్తింపు సంపాదిస్తుంది.
అదే జరిగితే..
జూనియర్ ఎన్టీఆర్‌తో నటనకు స్కోప్ ఉన్న పాత్ర పడితే టాలీవుడ్‌లో ఈ యంగ్ హీరోయిన్ దశ తిరిగినట్లే. ఆఫర్లకు కొదవ ఉండదు. ఈ పొడుగుకాళ్ల సుందరికి మహేశ్, ప్రభాస్ సరసన నటించే అవకాశాలు కూడా రావచ్చు.
ప్రస్తుతం జాన్వీ బాలీవుడ్‌లో రెండు ప్రాజెక్టుల్లో నటిస్తోంది. వరుణ్ ధావన్‌తో బావల్ చిత్రంతో పాటు మిస్టర్ అండ్ మిస్ మహీ చిత్రంతో బిజీగా ఉంది. వరుణ్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా.. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?