‘One Powerful Scene’ that Carried the Entire Movie: ఈ సినిమాలను బ్లాక్‌ బాస్టర్స్‌గా నిలబెట్టిన సన్నివేశాలు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘One Powerful Scene’ that Carried the Entire Movie: ఈ సినిమాలను బ్లాక్‌ బాస్టర్స్‌గా నిలబెట్టిన సన్నివేశాలు ఇవే!

    ‘One Powerful Scene’ that Carried the Entire Movie: ఈ సినిమాలను బ్లాక్‌ బాస్టర్స్‌గా నిలబెట్టిన సన్నివేశాలు ఇవే!

    February 24, 2024

    కథను మలుపు తిప్పే సీన్లు ప్రతీ సినిమాలోనూ కచ్చితంగా ఉంటాయి. అయితే కొన్ని మాత్రమే ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. సాధారణంగా సాగిపోతున్న కథకు అవి బూస్టర్స్‌లాగా పనిచేస్తాయి. కథ గమనాన్ని మార్చి.. ప్రేక్షకుల అటెన్షన్‌ను తిరిగి సినిమాపై మళ్లేలా చేస్తాయి. అయితే ఇలాంటి సీన్లు ఒకే విధంగా ఉండాలన్న నిబంధన ఏమి లేదు. కథ అవసరాన్ని బట్టి డైరెక్టర్లు ఆ సీన్లను కామెడీ, యాక్షన్‌, సెంటీమెంట్‌ జానర్లలో ఎంచుకుంటూ ఉంటారు. టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ సీన్లు ఏవో ఇప్పుడు చూద్దాం. 

    సలార్‌ (Salaar)

    ప్రభాస్ హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్‌’ చిత్రంలో అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ మాత్రం పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ప్యాకేజీలా అనిపిస్తుంది. ప్రభాస్‌ గురించి నటి శ్రియా రెడ్డి ఇచ్చే ఎలివేషన్స్‌ మెప్పిస్తాయి. 

    ఆర్‌ఆర్‌ఆర్‌

    రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం గ్లోబల్‌ స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్‌ సీన్‌.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. బ్రిటీష్‌ బంగ్లాలోకి తారక్‌ జంతువులతో ప్రవేశించే సీన్‌ హైలేట్‌ అని చెప్పవచ్చు. అటు తారక్‌ – రామ్‌చరణ్‌ ఫైటింగ్‌ కూడా మెప్పిస్తుంది. 

    బాహుబలి 2 (Bahubali 2)

    బాహుబలి 2లో ప్రతీ సీనూ.. ఓ అద్భుతమే అని చెప్పవచ్చు. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే రానా పట్టాభిషేకం సన్నివేశం మాత్రం ప్రేక్షకలకు గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. రానా చక్రవర్తిగా పట్టభిషేకం చేసుకున్న తర్వాత ప్రభాస్ సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమవుతాడు. ఆ సమయంలో ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్‌ అదరహో అనిపిస్తాయి. 

    జెర్సీ (Jersey)

    నేచురల్‌ స్టార్‌ నాని తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న చిత్రాల్లో జెర్సీ ముందు వరుసలో ఉంటుంది. కొడుకు కోరిక మేరకు తిరిగి బ్యాట్‌ పట్టిన నాని.. జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. తన కల నెరవేరిన సమయంలో ట్రైన్‌ వెళ్తుండగా నాని అరిచే సీన్‌.. వీక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. 

    రేసుగుర్రం (Race Gurram)


    అల్లుఅర్జున్ (Allu Arjun) హీరోగా సురేందర్‌ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం (రేసుగుర్రం). అయితే ఈ చిత్ర విజయంలో బ్రహ్మీ (Brahmanandam) పాత్ర కూాడా కాస్త ఎక్కువగానే ఉంది. క్లైమాక్స్‌లో కిల్‌బిల్‌ పాండే పాత్రతో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బ్రహ్మీ.. ఫ్రస్టేషన్‌తో ఉన్న పోలీసాఫీసర్‌గా నవ్వులు పూయించాడు. ఈ సినిమాలో కిల్ బిల్ సీక్వెన్స్‌ చిత్రానికే హైలెట్

    వేదం (Vedam)

    క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ (Allu Arjun), మంచు మనోజ్ (Manju Manoj), అనుష్క (Anushka) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’ (Vedam). ఇందులో బన్నీ.. కేబుల్‌ రాజు పాత్రలో అదరగొట్టాడు. అయితే ద్వితియార్థంలో ఓ వృద్దుడి నుంచి అల్లు అర్జున్‌ డబ్బులు కొట్టేసే సీన్‌ సినిమాలో హైలెట్‌ అని చెప్పవచ్చు. పెద్దాయన కూతురు కిడ్నీ అమ్మగా వచ్చిన డబ్బును.. ఆస్పత్రిలో బన్నీ ఎత్తుకెళ్లేందుకు యత్నిస్తాడు. ఈ క్రమంలో ఆ వృద్ధుడు కాళ్లు పట్టుకొని బతిమాలగా.. వదిలించుకొని మరి వెళ్తాడు. అయితే తన తప్పును తెలుసుకొని బన్నీ డబ్బు తిరిగి ఇచ్చే సీన్‌ హృదయాలకు హత్తుకుంటుంది. 

    పోకిరి (Pokiri)

    మహేశ్‌ బాబు (Mahesh Babu), డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ ఎన్ని రికార్డులు తిరగరాసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని క్లైమాక్స్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుంది. అప్పటివరకూ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన మహేశ్‌.. పోలీసు ఆఫీసర్ అని తెలియడంతో అంతా షాక్‌కు గురవుతారు. 

    ఈగ (Eega)

    దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) అద్భుత సృష్టి ‘ఈగ’ (Eega) సినిమా. ఇందులో నాని (Nani), సమంత (Samantha), కన్నడ స్టార్‌ సుదీప్‌ (Sudeep) ప్రధాన పాత్రలు పోషించారు. పవర్‌ఫుల్‌ విలన్ అయిన సుదీప్‌ను క్లైమాక్స్‌లో ఒక చిన్న ఈగ చంపే సీన్‌ ఆకట్టుకుంటుంది.  

    ఛత్రపతి (Chatrapathi)

    ప్రభాస్‌ (Prabhas), రాజమౌళి కాంబినేషన్‌లో ఛత్రపతి సినిమా.. అప్పట్లో టాలీవుడ్‌ను షేక్‌ చేసింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ ఫ్యాన్స్ చేత విజిల్స్‌ వెేయిస్తుంది. ప్రభాస్‌ తొలిసారి విలన్లపై పిడికిలి బిగించే సీన్ అదరహో అనిపిస్తుంది.

    జనతా గ్యారేజ్‌ (Janatha Garage)

    కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్‌’లో తారక్‌ పవర్‌ ప్యాక్డ్‌ హీరోగా నటించాడు. మోహన్‌లాల్ నుంచి జనతా గ్యారేజ్ బాధ్యతలు తీసుకున్నాక వచ్చే తొలి ఫైట్‌ సీన్‌ మెప్పిస్తుంది. రాజీవ్‌ కనకాల సమస్యను తీర్చేందుకు తారక్‌ తన గ్యాంగ్‌తో వెళ్లి విలన్లకు బుద్ది చెప్తాడు.

    టెంపర్‌ (Temper)

    తారక్‌-పూరి కాంబోలో వచ్చిన టెంపర్‌ చిత్రంలో.. కోర్టు సీన్‌ సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. ఓ రేప్‌లో విలన్ సోదరులు తప్పించుకోకుడదన్న ఉద్దేశ్యంతో తారక్‌ తాను ఆ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఒప్పుకుంటాడు. ఈ ఊహించని పరిణామం ఆడియన్స్‌ను షాక్‌కు గురిచేస్తుంది. 

    విక్రమార్కుడు (Vikramarkudu)

    రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంలో రవితేజ (Ravi Teja) ద్విపాత్రాభినయం చేశాడు. విక్రమ్‌ రాథోడ్‌ అనే పోలీసు ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్‌ (Prakash Raj), రవితేజ (Ravi Teja) మధ్య వచ్చే సీన్ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది.

    మగధీర (Magadheera)

    రామ్‌చరణ్‌ (Ramcharan), రాజమౌళి (S S Rajamouli కాంబోలో వచ్చిన చిత్రం ‘మగధీర’. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ షేర్‌ఖాన్‌ పంపిన వందమంది సైనికులను చంపే సీన్‌ హైలెట్‌గా నిలుస్తుంది. ఈ సీన్‌ సినిమాను మలుపు తిప్పుతుంది. 

    మిర్చి (Mirchi)

    ప్రభాస్‌ హీరోగా కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్‌లో వచ్చిన ‘మిర్చి’.. టాలీవుడ్‌లో పలు రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో తండ్రిని బెదిరించిన విలన్‌ తరపు మనుషులకు ప్రభాస్‌ వార్నింగ్ ఇచ్చే ఆకట్టుకుంటుంది.

    ఆడవారి మాటలకు అర్థాలే 

    ఈ (Aadavari Matalaku Arthale Verule) సినిమాలో వెంకటేష్‌, కోటా శ్రీనివాసరావు తండ్రి కొడుకులుగా నటించారు. కొడుకు ప్రేమ విషయం చెప్పేందుకు వెళ్లిన కోటా శ్రీనివాసరావును హీరోయిన్‌ త్రిష అనుకోకుండా చెంపదెబ్బ కొడుతుంది. దీంతో మనస్తాపానికి గురైన అతడు నిద్రలోనే ప్రాణం విడిస్తాడు. తండ్రి శవం ముందు వెంకటేష్‌ పడిన బాధ.. ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టిస్తుంది. 

    ఇంద్ర (Indra)

    మెగాస్టార్‌ చిరంజీవి మరుపురాని చిత్రాల్లో ఇంద్ర కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాలోని ప్రతీ సీను అద్బుతమే. ముఖ్యంగా చిరంజీవి పవర్‌ఫుల్‌ గతాన్ని రివీల్‌ చేసే ఇంటర్వెల్‌ సీన్‌ను ఇప్పటికీ ఫ్యాన్స్‌ గుర్తు చేసుకుంటారు. 

    సింహాద్రి (Simhadri)

    రాజమౌళి దర్శకత్వంలో తారక్ హీరోగా చేసిన రెండో చిత్రం ‘సింహాద్రి’. ఇందులో తన అక్కను చంపిన విలన్లపై తారక్‌ ప్రతీకారం తీర్చుకునే సీన్‌ సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. తమను పట్టిపీడిస్తున్న రౌడీలను తారక్‌ చంపుతున్న క్రమంలో కేరళ ప్రజలు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ సూపర్‌గా అనిపిస్తుంది. 

    తులసి (Thulasi)

    బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన తులసి చిత్రంలో హీరో వెంకటేష్‌ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. కోర్టు పరిసరాల్లో తండ్రికి వార్నింగ్‌ ఇచ్చిన విలన్లపై అతడు ప్రతీకారం తీర్చుకునే సీన్‌ నెవర్‌బీఫోర్ అనిపిస్తుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version