దేశంలో మంచి క్రేజ్ ఉన్న మెుబైల్ తయారీ సంస్థల్లో ‘వన్‌ప్లస్’ ఒకటి. ఈ కంపెనీ నుంచి కొత్త మెుబైల్ వచ్చిందంటే టెక్ ప్రియులకు ఇక పండగే అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వన్‌ప్లస్ నుంచి అదిరిపోయే వార్త బయటకొచ్చింది. ఆ సంస్థ నుంచి కొత్తగా ‘OnePlus 12’ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతున్నట్లు తెలిసింది. OnePlus 11 5G మెుబైల్‌లో భారీ మార్పులు చేసి దీన్ని తీసుకొస్తున్నట్లు సమాచాారం. అంతేగాక నయా స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు సైతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టైలిష్ డిజైన్
వన్‌ప్లస్ 12 మెుబైల్‌ను గ్లాసీ ఎక్స్‌టీరియర్ (glossy exterior) లుక్‌తో తీసుకొస్తున్నట్లు సమాచారం. దీని వల్ల ఫోన్ వెనుక భాగం అద్దంలా తళతళా మెరవనుందని లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
మెుబైల్ స్క్రీన్
ఈ నయా వన్‌ప్లస్ ఫోన్ 6.7 అంగుళాల Quad HD OLED స్క్రీన్‌తో రాబోతున్నట్లు తెలిసింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా అందిస్తారట. స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoC ప్రొసెసర్, Android 13 ఆధారిత MIUI 14 OSతో ఈ ఫోన్ వర్క్ చేయనున్నట్లు సమాచారం.
బిగ్ బ్యాటరీ
వన్‌ప్లస్ 12 మెుబైల్ శక్తివంతమైన 5,400mAh బ్యాటరీతో రానుంది. ఇది 100W ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. అలాగే 50W వైర్‌లెస్ చార్జింగ్ మద్దతును దీనికి అందిస్తారని తెలిసింది. దీని వల్ల ఫోన్‌ను నిమిషాల వ్యవధిలోనే ఛార్జ్ చేసుకోవచ్చు.
స్టోరేజ్ సామర్థ్యం
ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 24GB LPDDR5 RAMతో రానున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అంతేగాక 1 TB UFS 4.0 స్టోరేజ్ సామర్థ్యాన్ని ఈ ఫోన్ కలిగి ఉండనున్నట్లు టెక్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే నిజమైతే స్మార్ట్‌ఫోన్లలో ఇదొక విఫ్లవాన్ని సృష్టిస్తుందని చెప్పవచ్చు.
అద్బుతమైన కెమెరాలు
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌లో చెప్పుకోవాల్సిన మరో అద్బుతమైన ఫీచర్ కెమెరా. ఈ మెుబైల్ 50MP ప్రైమరీ, 50MP అల్ట్రా-వైడ్, 64MP పెరిస్కోప్ కెమెరా లెన్స్‌లతో రాబోతున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇక ఫ్రంట్ సైడ్ 32 MP సెల్ఫీ కెమెరా ఉండనుందట.
లాంచ్ & ధర
వన్‌ప్లస్ 12 మెుబైల్ ఈ ఏడాది డిసెంబర్‌లో తొలుత చైనాలో లాంచ్ కానుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.80,990 వరకూ ఉండొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. 2024 జనవరి 18న ఈ ఫోన్ భారత్‌లో అడుగు పెడుతుందని పేర్కొంటున్నాయి.