ప్రముఖ స్మార్ట్ ఫొన్ల తయారీ కంపెనీ OnePlus నుంచి మరో సరికొత్త ఫొన్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీగా అమ్ముడు పోతున్న OnePlus 11కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్. వన్‌ప్లస్ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ పేరుతో OnePlus 12గా త్వరలో విడుదల కానుంది. ఈ ఫోన్ ప్రత్యేకతలు, డిస్‌ప్లే, కీ ఫీచర్స్ తాజాగా లీకయ్యాయి. వాటిని ఓసారి పరిశీలిద్దాం.
OnePlus 12 డిస్‌ప్లే
వన్‌ప్లస్ 12 డిస్‌ప్లే 2K OLEDతో రానుంది. ఇది 6.7 అంగుళాలతో కర్వ్‌డ్ డిస్‌ప్లే కాగా.. దీనిపై హోల్ పంచ్ కట్‌అవుట్ టాప్‌లో ఉంటుంది.120Hz రీఫ్రేష్ రేటుతో పాటు QHD+ రెజల్యూషన్‌ను డిస్‌ప్లే కలిగి ఉండనుట్లు తెలిసింది.
కెమెరా
ప్రధాన కెమెరా 50MP సోనీ IMX890 (OIS సపోర్ట్)తో రానుంది. సోనీ IMX581 (FOV: 115 డిగ్రీ)తో 48MP అల్ట్రావైడ్ కెమెరా, సోనీ IMX709 (2X ఆప్టికల్ జూమ్)తో 32MP టెలిఫోటో లెన్స్, 16MP ఫ్రంట్ (సెల్ఫీ) కెమెరాలు రానున్నాయి. నైట్ విజన్‌లో అట్రాక్టివ్ ఫొటోల కోసం ప్రత్యేక సెన్సార్లు అమర్చినట్లు తెలిసింది.
ఆపరేటింగ్ సిస్టమ్
వన్‌ప్లస్ 12 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoC ద్వారా నడవనుందని టాక్. ఆండ్రాయిడ్ లెటెస్ట్ వెర్షన్ 13 ఇన్‌స్టాల్ అయి ఉంటుంది.
స్టోరేజ్ టైప్ &స్పీకర్స్
OnePlus 11 మాదిరి 16GB RAM, 256GB స్టోరేజ్ సామర్థ్యంతో వన్‌ప్లస్ 12 రానుంది.100జీబీ వరకు గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ ఫీచర్‌ను కలిగి ఉండనుంది. స్పీకర్స్ Dolby atoms ఫీచర్స్‌ను కలిగి ఉండనున్నట్లు తెలిసింది.
వన్ ప్లస్ 11కు అందిస్తున్నట్లుగా స్పోర్టిఫై మ్యూజిక్ యాప్‌ను ఫ్రీగా 6 నెలల వరకు వన్ ప్లస్ 12తో అందించే ఛాన్స్ అయితే ఉంది.
కలర్స్
ఈ ఫోన్ కలర్స్ వేరియంట్లపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే మూడు కలర్స్‌లో లభించే అవకాశం ఉన్నట్లు టాక్. టైటాన్ బ్లాక్, ఎట్రెనల్ గ్రీన్, మార్బల్ ఓడెస్సీ కలర్స్ వేరియంట్లలో లభ్యమయ్యే ఛాన్స్ ఉంది.
యాప్స్ కనెక్టివిటీ
OnePlus 11 మాదిరి వన్ ప్లస్ 12లో కూడా సేమ్ యాప్స్ కనెక్టివిటీని కలిగి ఉండే అవకాశం ఉంది. GLONASS జీపీఎస్ కనెక్టివిటీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, Bluetooth, Wi-Fi, USB కనెక్టివిటీ వంటి ప్రత్యేకతలు ఉండనున్నట్లు తెలిసింది.
బ్యాటరీ సామర్థ్యం
OnePlus 11లో అయితే 5000mah బ్యాటరీ అయితే ఇచ్చారు. మరి OnePlus 12లో బ్యాటరీ సామర్థ్యాన్ని ఎంత వరకు పెంచుతారో వేచి చూడాల్సి ఉంది.
ధర
దీని ధరపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. వన్ ప్లస్ 11 కంటే కాస్త ఎక్కువగా రూ.65,000- రూ.70,000 ప్రైస్ రేంజ్‌లో ఉండే అవకాశం ఉన్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఎప్పుడు అందుబాటులో?
ప్రస్తుతం వన్‌ప్లస్ 12ను చైనాలో విడుదల చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది చివర్లో ఇండియా సహా ఇతర ప్రపంచ దేశాల్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!