OnePlus 12 Mobile: మరో స్టన్నింగ్‌ మెుబైల్‌ను లాంచ్‌ చేసిన వన్‌ప్లస్‌.. ధర, ఫీచర్లు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OnePlus 12 Mobile: మరో స్టన్నింగ్‌ మెుబైల్‌ను లాంచ్‌ చేసిన వన్‌ప్లస్‌.. ధర, ఫీచర్లు ఇవే!

    OnePlus 12 Mobile: మరో స్టన్నింగ్‌ మెుబైల్‌ను లాంచ్‌ చేసిన వన్‌ప్లస్‌.. ధర, ఫీచర్లు ఇవే!

    February 28, 2024

    చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం వన్‌ప్లస్‌ (OnePlus) సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. స్వదేశంలో ఫ్లాగ్‌షిప్‌ ప్రీమియం 5జీ మెుబైల్‌ను విడుదల చేసింది. వన్‌ప్లస్‌ 12 (Oneplus 12) పేరుతో ఈ మెుబైల్‌ను తీసుకొచ్చింది. ఫిబ్రవరిలో ఈ ఫోన్‌ భారత్‌లోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ నయా ఫోన్‌ ఫీచర్స్‌, స్పెసిఫికేషన్స్‌, ధర తదితర వివరాలపై ఓ లుక్కేద్దాం.

    ఫోన్‌ స్క్రీన్‌

    ఈ వన్‌ప్లస్‌ 12 మెుబైల్‌.. 6.7 అంగుళాల QHD+ సూపర్​ ఫ్లూయిడ్​ అమోలెడ్​ డిస్​ప్లేతో వచ్చింది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 Soc ప్రొసెసర్‌పై ఇది పని చేస్తుంది. ఈ ప్రొసెసర్‌తో వచ్చిన తొలి ప్రీమియం ఫోన్ ఇదే కావడం విశేషం. ఆండ్రాయిడ్​ 14 బేస్డ్​ ఆక్సిజన్ OSను ఫోన్‌కు అందించారు. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ఫోన్ చైనాలో నాలుగు వేరియంట్లలో విడుదలైంది. 12GB + 256GB, 16GB + 512GB, 16GB + 1TB , 24GB + 1TB ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇదే స్టోరేజ్‌ ఆప్షన్లతో భారత్‌లో ఈ ఫోన్‌ అడుగు పెట్టే అవకాశముంది.

    కెమెరా క్వాలిటీ

    ఈ వన్‌ప్లస్‌ మెుబైల్‌ వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా విత్ Sony LYT-808 సెన్సార్ + 64 MP టెలిఫొటో కెమెరా + 48 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌ ఫోన్‌కు అందించారు. అలాగే సెల్ఫీల కోసం ముందు వైపు 32MP కెమెరాను ఫిక్స్‌ చేశారు. వీటి సాయంతో నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. 

    పవర్‌ఫుల్ బ్యాటరీ

    ఈ మెుబైల్‌కు శక్తివంతమైన బ్యాటరీని అందించారు. 5400mAh బ్యాటరీని ఫోన్‌కు అమర్చారు. ఇది ఏకంగా 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సహకరిస్తుంది. వీటి ద్వారా ఫోన్‌ను చాలా వేగంగా ఛార్జ్‌ చేసుకోవచ్చు. 

    కనెక్టివిటీ ఫీచర్లు

    ఈ మెుబైల్‌.. 5జీ, 4జీ LTE, వై-ఫై, బ్లూటూత్​ V5.3, NFC, GPS, యూఎస్​బీ టైప్​-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే IP65 rating వాటర్‌, డస్ట్ రెసిస్టెన్స్‌ను కూడా ఫోన్‌ కలిగి ఉంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే పైన ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను ఫిక్స్ చేశారు.

    కలర్‌ ఆప్షన్స్‌

    ఈ వన్‌ప్లస్‌ 12 మెుబైల్‌ చైనాలో మూడు కలర్‌ ఆప్షన్స్‌లో రిలీజయ్యాయి. పైల్‌ గ్రీన్‌, రాక్ బ్లాక్‌, వైట్‌ రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. ఇవే కలర్స్‌తో ఈ ఫోన్‌ భారత్‌లో అడుగుపెట్టే అవకాశముంది. 

    ధర ఎంతంటే?

    వన్‌ప్లస్‌ 12 మెుబైల్‌ ధర భారత్‌లో ఎంత ఉంటుందన్న దానిపై కంపెనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే మెుబైల్‌ వేరియంట్‌ను బట్టి ధర ఉండవచ్చు. చైనాలో నిర్ణయించిన ధరలను బట్టి భారత్‌లో 12GB + 256GB వేరియంట్ ధర రూ.50,700 ఉండవచ్చని అంచనా. అలాగే 12GB + 256GB రూ.56,600, 16GB + 1TB రూ.62,500, 24GB + 1TB  వేరియంట్ ధర రూ.68,400 ఉండే అవకాశముంది. ధరలపై త్వరలోనే స్పష్టత రానుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version