OnePlus Open Review: ఒక్క ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా? ఐఫోన్‌ 15కి గట్టి పోటీ! ధర, ఆఫర్స్ ఇవే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OnePlus Open Review: ఒక్క ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా? ఐఫోన్‌ 15కి గట్టి పోటీ! ధర, ఆఫర్స్ ఇవే..!

    OnePlus Open Review: ఒక్క ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా? ఐఫోన్‌ 15కి గట్టి పోటీ! ధర, ఆఫర్స్ ఇవే..!

    October 25, 2023

    ప్రముఖ స్మార్ట్ ఫొన్ బ్రాండ్ OnePlus నుంచి తొలన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ OnePlus Open రిలీజైంది. అద్భుతమైన క్లీన్ డిజైన్, రెండు స్క్రీన్‌లు డాల్బీ విజన్ OLED డిస్‌ప్లేతో వచ్చాయి. వెనుకవైపు మూడు హాసెల్‌బ్లాడ్-మెరుగైన కెమెరా సెటప్‌తో వచ్చింది.  IPX4-స్ప్లాష్  రెసిస్టెన్స్‌తో ప్రత్యేకంగా తయారు చేయబడింది.

    ఇప్పటికే ఫొల్డబుల్ ఫొన్ల రేసులో ఓప్పో, శామ్‌సంగ్, ఎల్‌జీ బ్రాండ్లు ముందున్నాయి. తాజాగా ఈ రేసులోకి వన్ ప్లస్ అడుగుపెట్టింది అని చెప్పాలి. వన్ ప్లస్ బ్రాండ్‌కు ఇండియాలోని యూత్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్రాండ్ నుంచి విడుదలైన అన్ని ఫొన్లు దాదాపుగా హిట్ అయ్యాయి. అలాగే యూత్‌లో ఫొల్డబుల్ ఫొన్లకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘వన్ ఫ్లస్ ఓపెన్‌’ గ్యాడ్జెట్‌ను ప్రత్యేకంగా తయారు చేసింది. మరి ఈ ఫోన్ ప్రత్యేకతలు, డిస్‌ప్లే, కీ ఫీచర్స్‌పై YouSay రివ్యూలో ఇప్పుడు పరిశీలిద్దాం.

    వన్‌ప్లస్ ఓపెన్ అన్‌బాక్సింగ్

    వన్‌ప్లస్ ఫోన్ల మాదిరిగానే.. ఓపెన్ కూడా రెడ్‌కలర్ బాక్స్‌తో అయితే ప్యాక్ చేయబడింది. బాక్స్‌ లోపల SuperVOOC ఛార్జర్ ఉంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తుంది. దీనితో USB టైప్‌ సీ కేబుల్ కూడా చ్చింది.

    OnePlus ఓపెన్ ఫోన్ రెండు భాగాలకు ప్రొటక్షన్‌గా ప్లాస్టిక్ కేస్‌ను అయితే అందించారు. కేస్ వెనక భాగంలో లెదర్ లాంటి ఫినిషింగ్ ఇచ్చారు. ఈ కేస్ ఫోన్‌కు ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది. వీటితో పాటు బాక్స్‌వో కవర్ స్క్రీన్‌కు ప్రొటెక్షన్‌ ఫిల్మ్ అయితే ఇచ్చారు. ఇది ఫొన్ ఎడ్జెస్‌పై స్క్రాచెస్‌ పడకుండా రక్షిస్తుంది.

    OnePlus Open డిజైన్ &లుక్

    OnePlus ఓపెన్ డిజైన్ అత్యుత్తమంగా ఉందని చెప్పవచ్చు.  నిర్మాణ నాణ్యత అద్భుతంగా ఉంది. ఫొన్‌ను చేతిలోకి తీసుకున్నప్పుడు ప్రీమియం ఫీలింగ్ అయితే వస్తుంది. వన్‌ప్లస్ ఓపెన్ మొబైల్‌ను ఎయిర్ స్పేస్ మెటిరియల్‌తో తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది.  కోబాల్ట్, మాలిబ్డినం, టైటానియం మిశ్రమంతో ఫోన్‌ను తయారు చేయడంతో స్మూత్ అండ్ స్టైలీష్‌ లుక్‌లో గ్యాడ్జెట్ కనిపిస్తుంది.  ఇది స్టెయిన్ లెస్ స్టీల్ కంటే దృఢమైనది, తేలికైనది. OnePlus ఓపెన్ ఫోన్ అయితే Samsung Galaxy Z Fold5, vivo X Fold2 మాదిరిగానే అవుట్‌వర్డ్ ఫోల్డింగ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. OnePlus ఫోల్డ్ నాజుకైన మెటల్ సైడ్‌లను, బ్యాక్‌సైడ్ లెదర్ లాంటి స్మూత్ ఫినిషింగ్ కలిగి ఉంది.  ఈ రెండు స్లైడ్స్‌పై పవర్ బటన్‌, ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. 

    OnePlus Open డిస్‌ప్లే

    వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ డిస్‌ప్లే 7.82 ఇంచెస్ పొడవు ఉంది. దీని బాహ్య డిస్‌ప్లే సిరామిక్ గార్డ్ అనే కొత్త గ్లాస్ ప్రొటెక్టర్‌తో తయారు చేశారు. ఇది గొరిల్లా గ్లాస్ విక్టస్ కంటే 20% ఎక్కువ దృఢమైనది. ఇన్నర్ డిస్‌ప్లేను BOE ప్యానెల్‌తో తయారు చేశారు.  2K రెజల్యూషన్ FHD+ 120Hz రిఫ్రెష్ రేటుతో వచ్చింది. దీని డిస్‌ప్లే 1440Hz PWM వద్ద డిమ్మింగ్, 2,800 nits వద్ద హైబ్రైట్‌నెస్‌ అయితే ఇస్తుంది. వన్‌ప్ల్ ఓపెన్ బ్యాక్ ప్యానెల్ బ్లాక్ వేగన్ లెదర్‌తో కప్పబడిన ప్లాస్టిక్ లేయర్‌ను కలిగి ఉంటుంది. దీని డీజైన్‌ ప్రీమియంగా ఉంది. ఫింగర్ ఫ్రింట్ రెసిస్టెన్స్‌ కలిగి ఉండటంతో చేతిలో చాలా గ్రిప్పీగా ఉంటుంది.

    స్పీకర్స్

    వన్‌ప్లస్ ఓపెన్ మూడు స్పీకర్‌లతో డాల్బీ అట్మోస్ సిస్టమ్‌ను కలిగి ఉంది. న్యూ ఫీచర్.. స్పేషియల్ ఆడియోను సపోర్ట్ చేస్తుంది.  మొత్తం మూడు స్పీకర్లలో రెండు స్పీకర్లు పైన, ఇంకొకటి దిగువన ఉంది. OnePlus ఓపెన్ సౌండ్‌ పరంగా యావరేజ్ లౌడ్‌నెస్‌ కలిగి ఉంది. బాస్ సౌండ్ నాణ్యత చాలా బాగుంది.

    కెమెరా

    ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టంను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 48-మెగాపిక్సెల్ డ్యూయల్-లేయర్ ట్రాన్సిస్టర్ ఔట్‌సోల్ మెయిన్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్/6x లాస్‌లెస్ జూమ్ సపోర్ట్‌తో కూడిన 64-మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుంది. మూడవ సెన్సార్ 48-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యూనిట్‌కు డెడికెట్ చేశారు. సెల్ఫీ కెమెరా డ్యుయల్ కెమెరా సిస్టంతో వచ్చింది. 32MP (OV32C) – outside, 20MP – inside ఆప్షన్లతో వచ్చింది.

    ఫొటోల నాణ్యత

    OnePlus మెయిన్ కెమెరాతో తీసిన ఫోటోల నాణ్యత అద్భుతంగా ఉంది. ప్రధాన కెమెరా ఇన్-సెన్సర్..  2x జూమ్ మాగ్నిఫికేషన్‌ను అందిస్తుంది. 2X జూమ్‌లోను ఫోటోలు చాలా క్వాలిటీగా ఉన్నాయి. అన్ని కలర్స్‌ను నేచురల్‌గా క్యాప్చర్ చేశాయి. 100% జూమ్ చేసినప్పుడు మాత్రం నేచురల్ కలర్స్‌కు బదులు కృత్రిమ కలర్స్‌ జోడించినట్లు కపించాయి. సెల్ఫీ కెమెరా సైతం మంచి నాణ్యత కలిగిన ఫొటోలు క్యాప్చర్ చేసింది.  లోలైట్‌లోనూ ఫొటోలు హైక్వాలిటితో వచ్చాయి. ఎలాంటి నాయిస్ కనిపించలేదు. అన్ని డిటెయిల్స్‌ను క్యాప్చర్ చేశాయి. బ్యాక్ & ఫ్రంట్ కెమెరాల వీడియో క్వాలిటీ కూడా సూపర్బ్‌గా ఉంది. OIS ఫీచర్‌తో 4K క్వాలిటీతో వీడియోస్‌ను తీయగలవు.  

    సాఫ్ట్‌వేర్ &స్టోరేజ్ టైప్ 

    OxygenOS 13.2 సపోర్ట్ చేయనున్న వన్‌ప్లస్ ఓపెన్… క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoC ద్వారా నడుస్తోంది. ఆండ్రాయిడ్ లెటెస్ట్ వెర్షన్ 13 ఇన్‌స్టాల్ అయి ఉంది. 5 ఏళ్లవరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని వన్‌ప్లస్ కంపెనీ అయితే పేర్కొంది.  ఇక ఆక్సిజన్ ఓఎస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. పబ్‌జీ గేమ్స్ ఆడినప్పుడు ఎలాంటి ప్రేమ్ డ్రాప్స్ కనిపించలేదు. చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేసింది. OnePlus ఓపెన్ 16GB RAM, 512GB స్టోరేజ్‌ సామర్థ్యంతో వచ్చింది. 100జీబీ వరకు గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ ఫీచర్‌ను కలిగి ఉంది.

    కలర్స్:

    ప్రస్తుతం ఈ ఫోన్‌ రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. టైటాన్ బ్లాక్, ఎట్రెనల్ గ్రీన్. వీటీలో ఎట్రెనర్ గ్రీన్ కలర్ ఫోన్లు ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాయి.

    యాప్స్ కనెక్టివిటీ

    వన్ ప్లస్ ఓపెన్‌లో అన్నిరకాల యాప్స్ కనెక్టివిటీని ఆఫర్ చేయవచ్చు. GLONASS జీపీఎస్ కనెక్టివిటీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, Bluetooth, Wi-Fi, USB కనెక్టివిటీ వంటి ప్రత్యేకతలు ఉండనున్నట్లు తెలిసింది. డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ చేసే క్వాడ్ స్పీకర్స్‌ను ఇందులో అమర్చినట్లు సమాచారం.

    బ్యాటరీ సామర్థ్యం

    వన్ ప్లస్ 11 మాదిరి 5000mah బ్యాటరీ కెపాసిటితో కాకుండా OnePlus OPEN అయితే 4805mah బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది. దీనిని 1%-100% ఛార్జ్ చేసేందుకు 40 నిమిషాలు సమయం పట్టింది.

    ధర

    అమెజాన్‌లో ఈ హ్యాండ్‌సెట్ రూ. 1,39,999 ధర వద్ద ఉంది. లాంచింగ్ ఆఫర్ కింద ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, వన్‌కార్డు క్రెడిట్ కార్డులు రూ.5000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ అందిస్తున్నాయి.

    BUY NOW

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version