Oppo A3x 4G: ఒప్పొ నుంచి సరికొత్త ఫొన్ లాంచ్, అమెజాన్‌లో అతి తక్కువ ధరకే అమ్మకం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Oppo A3x 4G: ఒప్పొ నుంచి సరికొత్త ఫొన్ లాంచ్, అమెజాన్‌లో అతి తక్కువ ధరకే అమ్మకం

    Oppo A3x 4G: ఒప్పొ నుంచి సరికొత్త ఫొన్ లాంచ్, అమెజాన్‌లో అతి తక్కువ ధరకే అమ్మకం

    October 29, 2024

    Oppo A3x 4G

    ఒప్పో సంస్థ ఇటీవల తన తాజా 4G వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌ “ఒప్పో A3x” ని(Oppo A3x 4G) భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇప్పటికే ఈ మోడల్‌ 5G వేరియంట్‌ అందుబాటులో ఉండగా, కొత్తగా విడుదలైన ఈ 4G మోడల్‌ అక్టోబర్ 25 నుంచి ఒప్పో అధికారిక స్టోర్‌లో లభ్యమవుతోంది. ఈ రోజు(అక్టోబర్ 29) నుంచిఅమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్‌ సేల్ ప్రారంభమైంది. మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ కలిగిన ఈ హ్యాండ్‌సెట్‌ 5100mAh భారీ బ్యాటరీతో అందుబాటులో ఉంది. ప్రారంభ ధర రూ.8,999 తో వినియోగదారులకు ఈ ఫోన్‌ మరింత ఆకర్షణీయంగా మారింది.

    వేరియంట్స్

    ఒప్పో A3x 4G ఫోన్‌ ప్రస్తుతం రెండు వేరియంట్‌లలో లభిస్తుంది:

    4GB ర్యామ్ + 64GB స్టోరేజీ – ధర: రూ.8,999

    4GB ర్యామ్ + 128GB స్టోరేజీ – ధర: రూ.9,999

    ఈ వేరియంట్‌లు ఒప్పో అధికారిక స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఓషన్ బ్లూ, నెబ్యూలా రెడ్ రంగులలో లభించే ఈ మోడల్ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

    ఒప్పో A3x 4G స్పెసిఫికేషన్‌లు

    డిస్‌ప్లే: 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 1604×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 264 PPI పిక్సెల్ డెన్సిటీ, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది.

    డిస్‌ప్లే కూడా పాండా గ్లాస్ రక్షణ కలిగి ఉంది. ఇది స్క్రీన్‌ మీద గీతలు, పగుళ్ల నుండి రక్షిస్తుంది.

    ప్రాసెసర్: ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6s 4G జెన్ 1 SoC చిప్‌సెట్‌ను వినియోగించారు, (Oppo A3x 4G)అది మంచి పనితీరును అందిస్తుంది. దీని సహకారంగా 4GB LPDDR4X ర్యామ్, 64GB లేదా 128GB eMMC 5.1 స్టోరేజీతో జతచేయబడి ఉంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని మరింత విస్తరించుకోవచ్చు.

    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14 లో పని చేస్తుంది, ఇది వినియోగదారులకు స్మూత్ అనుభవాన్ని అందిస్తుంది.

    బ్యాటరీ మరియు ఛార్జింగ్

    ఒప్పో A3x 4G హ్యాండ్‌సెట్ 5100mAh సామర్థ్యంతో కూడిన బ్యాటరీతో వస్తుంది, ఇది దీర్ఘకాలిక వాడకం కోసం అనువుగా ఉంటుంది. 45W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 30 నిమిషాల్లోనే 50% ఛార్జ్‌ అవుతుంది, తద్వారా త్వరగా ఫోన్‌ను రీచార్జ్‌ చేసుకునే వీలు ఉంటుంది.

    కెమెరా ఫీచర్లు

    ఈ ఫోన్ వెనుక 8MP ప్రధాన కెమెరాతో పాటు 0.08MP డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ కెమెరా వ్యవస్థ యూజర్‌కు సాధారణ ఫోటోగ్రఫీ అవసరాలకు సరిపడేలా ఉంది. వెనుక భాగంలో LED ఫ్లాష్‌ లైట్ కూడా కలిగి ఉంది, ఇది తక్కువ లైటింగ్‌లో కూడా తగిన ఫోటోలు తీసుకునేందుకు సాయపడుతుంది.

    కనెక్టివిటీ


    ఈ ఒప్పో A3x 4G స్మార్ట్‌ఫోన్ 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్ V5.0, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి(Oppo A3x 4G) ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ IP54 రేటింగ్‌ను కలిగి ఉంది, దీనివల్ల కొంతమేర డస్ట్ మరియు వాటర్ రేసిస్టెన్స్‌ను కల్పిస్తుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి, అలాగే మెరుగైన ఆడియో అనుభవం కోసం మోనో స్పీకర్‌ను కూడా పొందుపరిచారు.

    ఈ కొత్త ఒప్పో A3x 4G ఫోన్, ఆధునిక ఫీచర్లు అందిస్తూ, బడ్జెట్‌లో మంచి ఫొన్ కొనాలనుకునే వినియోగదారులకు ఇది ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు.

    Buy Now

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version