ప్రముఖ చైనా కంపెనీ ఒప్పో (Oppo) సరికొత్త ఫీచర్స్‌తో మరో స్టన్నింగ్ మెుబైల్‌ను లాంచ్ చేసింది. అదిరిపోయే లుక్‌తో బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఒప్పో ఏ59 పేరుతో 5జీ (Oppo A59 5G) స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ మెుబైల్ శుక్రవారం (డిసెంబర్ 22) లాంచ్ కాగా మార్కెట్ లో డిసెంబర్ 25వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఒప్పో అధికారిక వెబ్ సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫోన్ అమ్మకాలు మెుదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ప్రత్యేకతలు, ఫీచర్లు, ఇతర విశేషాలను ఈ కథనంలో చూద్దాం.
మెుబైల్ స్క్రీన్
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 (Android 13) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ మెుబైల్‌కు 6.56 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను అందించారు. దీనికి 90Hz రిఫ్రెష్ రేటును సమకూర్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity) 6020 ప్రాసెసర్‌ను కూడా ఫోన్‌లో ఫిక్స్ చేశారు.
ర్యామ్ & స్టోరేజ్
ఒప్పో కొత్త ఫోన్ రెండు వేరియంట్లలో లభించనుంది. 4GB RAM + 128GB ROM, 6GB RAM + 128GB స్టోరేజ్ ఆప్షన్స్‌లో ఫోన్ అందుబాటులో ఉంటుంది. 5mm ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు కూడా మెుబైల్ ఉన్నాయి.
బ్యాటరీ
ఒప్పో ఏ59 5జీ మెుబైల్‌ను పవర్‌ఫుల్ బ్యాటరీతో తీసుకొస్తున్నారు. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 mAh బ్యాటరీని అందించారు. కేవలం 30 నిమిషాల్లో 52 శాతం ఛార్జింగ్ అవుతుందని ఒప్పో వర్గాలు పేర్కొన్నాయి.
కెమెరా
ఈ మెుబైల్‌ను డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో తీసుకొచ్చారు. వెనకవైపు 13MP ప్రధాన కెమెరా, 2MP కెమెరాలను అమర్చారు. వీడియో కాల్, సెల్ఫీల కోసం ముందుభాగంలో 8 ఎంపీ కెమెరా ఇచ్చారు.
కలర్ ఆప్షన్స్
ఈ మెుబైల్ రెండు కలర్ వేరియంట్లలో మార్కెట్‌లో లభించనుంది. సిల్క్ గోల్డ్, స్టార్రి బ్లాక్ రంగుల్లో ఫోన్‌ను పొందవచ్చు.
కనెక్టివిటీ ఫీచర్లు
ఈ ఒప్పో మెుబైల్‌లో 5G SA/NSA, Dual 4G VoLTE, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), Bluetooth 5.3, GPS, USB Type-C వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా మెుబైల్ కలిగి ఉంది.
ధర ఎంతంటే?
Oppo A59 5G మెుబైల్ ధర దీనిలోని వేరియంట్ల ఆధారంగా ఉండనుంది. 4జీబీ+128జీబీ వేరియంట్ ధరను రూ.14,999గా కంపెనీ నిర్ణయించింది.6జీబీ+128 జీబీ వేరియంట్ ధరను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఆన్‌లైన్‌లో SBI కార్డ్, IDFC ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు. ఆరు నెలల వరకు నో కాస్ట్ EMI సదుపాయం కూడా అందిస్తున్నట్లు ఒప్పో పేర్కొంది.