OPPO A79 5G: ఒప్పో నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OPPO A79 5G: ఒప్పో నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..!

    OPPO A79 5G: ఒప్పో నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..!

    November 1, 2023

    దేశంలో మంచి ఆదరణ కలిగిన మెుబైల్‌ తయారీ కంపెనీల్లో ఒప్పో (Oppo) ఒకటి. తక్కువ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్‌ మెుబైల్స్‌ను లాంచ్‌ చేస్తుందన్న పేరు ఈ కంపెనీకి ఉంది. ఈ క్రమంలోనే ఒప్పో మరో సరికొత్త మెుబైల్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ‘OPPO A79 5G’ పేరుతో ఆ మెుబైల్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ టెక్ ప్రియుల అంచనాలను కచ్చితంగా అందుకుటుందని ఒప్పో ధీమా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి అంశాలపై ఓ లుక్కేద్దాం. 

    ఫోన్‌ డిస్‌ప్లే

    ‘OPPO A79 5G’ మెుబైల్‌ను 6.72 అంగుళాల Full HD+ స్క్రీన్‌తో తీసుకొచ్చారు. 1,080×2,400 పిక్సెల్‌ రిజల్యూషన్‌, 90Hz రిఫ్రెష్ రేట్, 391 ppi పిక్సెల్ డెన్సిటీ, 6150నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను డిస్‌ప్లేకు అందించారు. ఈ ఫోన్‌ MediaTek Dimensity 6020 ప్రాసెసర్‌, Android 13 ఆధారిత ColorOS 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 

    బిగ్‌ బ్యాటరీ

    ఈ మెుబైల్‌కు శక్తివంతమైన బ్యాటరీని అందించారు. 5,000mAh బ్యాటరీని ఫోన్‌కు అమర్చారు. దీనికి 33W Super VOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా ఇచ్చారు. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే దాదాపు 27 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని ఒప్పో వర్గాలు తెలిపాయి.

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    ఈ మెుబైల్‌ 8GB RAM /128GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ పవర్‌ఫుల్‌ ర్యామ్‌ హెవీ గేమ్స్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లోని యాప్స్‌ వేగంగా రన్ అయ్యేందుకు దోహదం చేస్తుంది. 

    కెమెరా క్వాలిటీ

    OPPO A79 5G మెుబైల్‌ ఫీచర్లలో కెమెరా హైలెట్ అని చెప్పవచ్చు. 50MP AI ప్రైమరీ కెమెరాను ఫోన్‌కు అందించారు. ఇది ఫొటోలను అద్భుతంగా క్యాప్చర్‌ చేస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి తోడు 2MP Portrait కెమెరాను డ్యూయల్‌ కెమెరా సెటప్‌లో అందించారు. ఇక సెల్ఫీల కోసం  8MP ఫ్రంట్‌ కెమెరాను ఫోన్‌కు ఫిక్స్ చేశారు. 

    కలర్స్‌

    ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు కలర్‌ వేరియంట్లను కలిగి ఉంది. గ్లౌవింగ్‌ గ్రీన్‌ (Glowing Green), మిస్టరీ బ్లాక్‌ (Mystery Black) రంగుల్లో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

    ధర ఎంతంటే?

    ధర విషయానికొస్తే.. ఒప్పో A79 5G ఫోన్ సింగిల్ 8GB ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999గా ఉంది. ప్రస్తుతం ఇది ఒప్పో ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ప్రధాన రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయానికి సిద్ధంగా ఉంది. ఆన్‌లైన్‌లో కొన్ని బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version