Oppo F25 Pro 5G: రూ.25 వేల లోపు ఒప్పో నుంచి నెవర్‌ ఎక్స్‌పెక్టింగ్‌ మెుబైల్‌.. ఫీచర్లకు ఫిదా కావాల్సిందే!
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Oppo F25 Pro 5G: రూ.25 వేల లోపు ఒప్పో నుంచి నెవర్‌ ఎక్స్‌పెక్టింగ్‌ మెుబైల్‌.. ఫీచర్లకు ఫిదా కావాల్సిందే!

  Oppo F25 Pro 5G: రూ.25 వేల లోపు ఒప్పో నుంచి నెవర్‌ ఎక్స్‌పెక్టింగ్‌ మెుబైల్‌.. ఫీచర్లకు ఫిదా కావాల్సిందే!

  February 29, 2024

  ప్రముఖ మెుబైల్‌ కంపెనీ ఒప్పో (Oppo)కు భారత మార్కెట్‌లో మంచి గుడ్‌విల్‌ ఉంది. ఆ సంస్థ ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ టెక్‌ ప్రియులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే ఒప్పో.. మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌తో భారత్‌లో అడుగుపెట్టబోతోంది. ‘ఒప్పో ఎఫ్‌25 ప్రో 5జీ’ (Oppo F25 Pro 5G) పేరుతో నయా ఫోన్‌ను ఇండియాలోకి తీసుకొస్తోంది. Oppo Reno 11F 5G మెుబైల్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా ఇది వస్తోంది. ఇది పవర్‌ఫుల్‌ ప్రాసెసర్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌, హై పర్ఫార్మెన్స్‌ ఫీచర్‌లతో రాబోతున్నట్లు ఒప్పో వర్గాలు పేర్కొన్నాయి. ఈ మెుబైల్‌కు సంబంధించిన ఫీచర్లు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

  మెుబైల్‌ స్క్రీన్‌

  Oppo F25 Pro 5G స్మార్ట్‌ఫోన్‌.. 6.7 అంగుళాల AMOLED స్క్రీన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి 93.4 శాతం స్క్రీన్‌ రేషియో బాడీ, 7.54 థిక్‌నెస్‌, 120Hz రిఫ్రెష్‌ రేటును అందించినట్లు లీకైనా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ ఫోన్‌ Android 14 ఆధారిత ColorOS 14 ఆపరేటింగ్ సిస్టమ్, MediaTek Dimensity 7050 ప్రొసెసర్‌తో రావొచ్చని అంటున్నారు.

  ర్యామ్‌ & స్టోరేజ్

  ఈ నయా ఒప్పో ఫోన్ ప్రధానంగా రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌తో రాబోతున్నట్లు టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 8GB RAM / 128GB ROM, 8GB RAM / 256GB ROM వేరియంట్లలో ఇది లాంచ్ కావొచ్చని అభిప్రాయపడుతున్నాయి. 

  కెమెరా

  ప్రీవియస్ మెుబైల్‌ Oppo Reno 11F 5G లాగానే ‘Oppo F25 Pro 5G’ను కూడా నాణ్యమైన కెమెరా సెటప్‌తో తీసుకొస్తున్నారు. ట్రిపుల్‌ రియర్‌ కెమెరాలతో ఈ ఫోన్‌ రానుంది. ఇందులో AI ఆధారిత 64MP ప్రైమరి షూటర్‌ + 112 డిగ్రీల ఫీల్డ్‌ను కవర్‌ చేసే 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌ + 2MP మాక్రో కెమెరా ఉంటాయని సమాచారం. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ముందు వైపు 32MP ఫ్రంట్‌ కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది.

  బ్యాటరీ

  నయా ఒప్పో ఫోన్‌.. శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యంతో రాబోతున్నట్లు టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి.  67W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టు కలిగిన 5000 mAh బ్యాటరీని ఫోన్‌కు ఫిక్స్ చేస్తున్నట్లు తెలిసింది. దీని ద్వారా మెుబైల్‌ను చాలా వేగంగా ఛార్జ్‌ చేసుకునేందుకు వీలవుతుంది. అంతేకాకుండా ఈ మెుబైల్‌ బ్యాటరీ లైఫ్‌ కూడా ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. 

  అడిషనల్ ఫీచర్స్

  Oppo F25 Pro మెుబైల్‌ 5G నెట్‌వర్క్‌కు సపోర్టు చేస్తుంది. అలాగే 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.2, and USB Type-C వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఒప్పో మెుబైల్‌లో ఉండనున్నాయి. దుమ్ము, నీటి నుంచి రక్షణ కల్పించే IP65 రేటింగ్‌, డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ (In Display Fingerprint Sensor)తో ఈ ఫోన్‌ రానున్నట్లు తెలిసింది. 

  ధర ఎంతంటే?

  ఈ ఒప్పో మిడ్‌రేంజ్‌ ఫోన్‌.. ఫిబ్రవరి 29న భారత్‌లో లాంచ్‌ కానుంది. ఆ రోజున ‘Oppo F25 Pro 5G’ మెుబైల్‌ ధర, ఫీచర్లపై స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే కొన్ని టెక్‌ వెబ్‌సైట్స్‌ ఈ మెుబైల్‌ ధరను ముందుగానే అంచనా వేస్తున్నాయి. దీని ధర రూ.25,000 లోపు ఉండవచ్చని అభిప్రాయపడుతున్నాయి. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version