‘నాటు నాటు’ సాంగ్ మాత్రమే కాదు…. MM కీరవాణి స్వరపరిచిన టాప్ 10 సాంగ్స్ లిస్ట్ ఇదే
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘నాటు నాటు’ సాంగ్ మాత్రమే కాదు…. MM కీరవాణి స్వరపరిచిన టాప్ 10 సాంగ్స్ లిస్ట్ ఇదే

    ‘నాటు నాటు’ సాంగ్ మాత్రమే కాదు…. MM కీరవాణి స్వరపరిచిన టాప్ 10 సాంగ్స్ లిస్ట్ ఇదే

    January 21, 2023

    కీరవాణి స్వరపరిచిన RRR మూవీలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపింది. ఈ గీతానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వరించింది. నాటు నాటు పాటతో పాటు కీరవాణి ఎన్నో వీనుల విందైన పాటలను స్వరపరిచారు. వాటిలో టాప్ 10 పాటలు ఓసారి చూద్దాం.

    1. ఎత్తర జెండా- RRR

    RRRలోని నాటు నాటు పాటతో పాటు   ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మరో పాట ఎత్తర జెండా. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను విశాల మిశ్రా, హారిక నారాయణ్ అద్భుతంగా పాడారు.

    YouTube Video Click here

    2. శివుని ఆనా- బాహుబలి 

    https://youtu.be/Ig-oabRMdDQ

    ఎవడట, ఎవడట సాంగ్ ఆధ్యాత్మికత గల ప్రేక్షకులకు  గూస్ బంప్స్ తెప్పించింది. ఈ పాట సాహిత్యం అలాంటిది మరి. ఈ పాటను కీరవాణి, మౌనిమ ఆలపించారు.

    3.నీతో ఉంటె చాలు – బింబిసార

    Neetho Unte Chalu - Lyric Video | Bimbisara | Nandamuri Kalyan Ram | M.M. Keeravani | Vassishta

    కొత్త డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన తెలుగు ఫాంటసీ యాక్షన్ చిత్రం ‘బింబిసార’లోని పాట ‘నీతో ఉంటె చాలు’. శాండిల్య పిసాపతి పాడిన ఈ పాట సంగీత ప్రియులను ఎంతో అలరిస్తోంది.

    4. జామురాత్రి జాబిలమ్మ- క్షణక్షణం

    Kshana Kshanam Telugu Movie | Jaamu Rathiri Video Song | Venkatesh | Sridevi | SPB | Chitra

    రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన క్షణ క్షణం మూవీలోని క్లాసిక్ సాంగ్ ఇది. ఇప్పటికీ.. పాట తెలుగు పాటల్లో మెలోడి హిట్‌గా నిలిచింది. ఈ పాటను నాగూర్ బాబు, చిత్ర అద్భుతంగా పాడారు.

    5. ఎక్కడో పుట్టి- స్టూడెంట్ నంబర్ 1

    SS రాజమౌళి తొలి సినిమాలోని ఈ పాట సూపర్ హిట్‌ అయింది. ఇప్పటికీ కాలేజీ కల్చరల్ ఇవెంట్లలో ఈ పాట మోగకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ పాటను కీరవాణి ఆలపించారు.

    6. గుండు సూది.. ఛత్రపతి

    ‘గుండు సూది గుండు సూది.. గుచ్చుకుంటే తప్పునాది పాట కీరవాణి స్వరపరిచిన ఎవర్ గ్రీన్ రోమాంటిక్ సాంగ్. ఈ సాంగ్‌ను కీరవాణి, సునిత అద్భుతంగా పాడారు.

    7. అదివో అల్లదివో.. అన్నమయ్య

    అదివో అల్లదిలో పాట ఇప్పటికీ తిరుమల గిరుల్లో మార్మోగుతూనే ఉంటుంది. ఆ పాట ప్రాశస్త్యం అలాంటింది. అన్నమయ్య సినిమాకు గాను కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ స్థాయిలో అవార్డు పొందారు. ఎస్పీ బాలు ఎంతో చక్కగా ఆలపించారు.

    8.అంతా రామ మయం- రామదాసు

    ఈ పాట భక్త జనులను ఉర్రూతలూగించింది. ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయేలా చేసింది. ఈ గీతాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు.

    9.  రాలిపోయే పువ్వా నీకు..  మాతృదేవో భవ

    https://youtube.com/watch?v=zFE517YOjJU

    మాతృదేవో భవ సినిమాలోని ఈ పాటను కీరవాణి ఎంతో హృద్యంగా ఆలపించారు. ఈ పాట అంటే జూ.NTRకు చాలా ఇష్టమని చెప్పారు. ఈ పాట ఆయన సమక్షంలో తప్ప మరెక్కడ పాడనని ఓ ఇంటర్వ్యూలో కీరవాణి చెప్పారు.

    10. పుణ్యభూమి నా దేశం- మేజర్ చంద్రకాంత్

    ఈ పాట మేజర్ చంద్రకాంత్ సినిమాలోని దేశభక్తి గీతం. ఇప్పటికీ జాతీయ పండగల వేళ.. తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతూ ఉంటుంది. ఈ పాటను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆలపించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version