OTT Suggestion: పోలీసులు vs నక్సలైట్లు.. ఓటీటీలో థ్రిల్లింగ్‌ తమిళ్ డబ్బింగ్‌ చిత్రం!
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • OTT Suggestion: పోలీసులు vs నక్సలైట్లు.. ఓటీటీలో థ్రిల్లింగ్‌ తమిళ్ డబ్బింగ్‌ చిత్రం!

  OTT Suggestion: పోలీసులు vs నక్సలైట్లు.. ఓటీటీలో థ్రిల్లింగ్‌ తమిళ్ డబ్బింగ్‌ చిత్రం!

  April 22, 2024

  ప్రస్తుతం ఓటీటీలో కంటెంట్‌కు కొదవ లేదు. అయితే ఏది చూడాలనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. మర్డర్‌ మిస్టరీస్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌, హార్రర్‌, సోషియో ఫాంటసీ, సస్పెన్స్ ఇలా వివిధ జానర్స్‌లో రూపొందిన చాలా చిత్రాలు ఓటీటీలో ఉన్నాయి. అయితే ఇందులో క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారి సంఖ్య మిగతా వాటితో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వారి కోసం YouSay ఓ అద్భుతమైన ఓటీటీ సజీషన్‌ను తీసుకొచ్చింది. అస్సలు మిస్‌ కాకూడని ఓ తమిళ్‌ డబ్బింగ్‌ చిత్రాన్ని మీకు పరిచయం చేస్తోంది. ఈ మూవీ మిమ్మల్ని అస్సలు నిరాశపరచదు. ఇంతకీ ఏంటా చిత్రం? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఆ మూవీ ప్రత్యేకతలేంటి? వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం. 

  ఆ సినిమా ఏదంటే?

  ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ (Vetrimaaran)కు కోలీవుడ్‌లో చాలా క్రేజ్‌ ఉంది. ఆయన తన పదహారేళ్ల కెరీర్‌లో తెరకెక్కించిన చిత్రాలు ఏడే అయినప్పటికీ.. ప్రతీ చిత్రం ఎంతో ప్రత్యేకమైనది. సమాజంలోని అట్టడుగు వర్గాలను రిప్రజెంట్ చేస్తూ వెట్రిమారన్ సినిమాలు తీస్తుండటంతో సహజంగానే విమర్శకుల ప్రశంసలూ ఆయా చిత్రాలకు లభిస్తుంటాయి. అలా వెట్రిమారన్ తీసిన చిత్రం ‘విడుదలై’. గతేడాది తమిళంలో రిలీజైన ఈ సినిమా.. తెలుగులో ‘విడుదల’ పేరుతో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘జీ 5’ (Zee 5) ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ ప్రసారం చేస్తోంది. 

  సినిమా ప్రత్యేకత ఏంటి?

  డైరెక్టర్‌ వెట్రిమారన్‌ ‘విడుదల’ చిత్రాన్ని పోలీసులు, ప్రజాదళం అనే ఒక విప్లవ పార్టీకి మధ్య జరిగే సంఘర్షణ కోణంలో తెరకెక్కించారు. 1987 ప్రాంతంలో పోలీసులు, నక్సలైట్ల మధ్య పోరు కారణంగా సామాన్య ప్రజలు ఎలా నలిగిపోయారో కళ్లకు కట్టారు. ముఖ్యంగా పెరుమాళ్‌ (విజయ్‌ సేతుపతి) కోసం ఊర్లోని ఆడవాళ్లను పోలీసులు హింసించే సీన్స్‌ కంటతడి పెట్టిస్తాయి. మరోవైపు కుమారేశన్‌ (సూరి) పాత్ర ద్వారా పై అధికారులు కిందిస్థాయి అధికారులతో ఎలా ప్రవర్తిస్తారేనేది చూపించారు. అంతేకాదు ఆడియన్స్‌ను అలరించేందుకు మంచి లవ్‌స్టోరీని కూడా వెట్రిమారన్‌ ఈ సినిమాలో పెట్టారు. ఇప్పటివరకూ చూసిన క్రైమ్‌ థ్రిల్లర్స్‌తో పోలిస్తే ఇది మంచి ఎక్స్‌పిరీయన్స్‌ను ఇస్తుందని చెప్పవచ్చు. 

  కథేంటి?

  కుమరేశన్‌ (సూరి) పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అతనికి కొండ ప్రాంతంలో పోస్టింగ్‌ ఇస్తారు. అక్కడ ప్రజాదళం సభ్యులకు, పోలీసులకు నిత్యం ఎన్‌కౌంటర్‌ జరుగుతుంటాయి. ప్రజాదళం లీడర్‌ పెరుమాళ్‌(విజయ్‌ సేతుపతి)ని పట్టుకునేందుకు ప్రైవేట్‌ కంపెనీతో కలిసి క్యాంపుని నిర్వహిస్తుంది పోలీసు శాఖ. డ్రైవర్‌ కుమరేశన్‌ అడవి ప్రాంతంలో డ్యూటీ చేసే పోలీసులకు నిత్యం ఆహారం సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో పాప (భవాని శ్రీ)తో ప్రేమలో పడతాడు. ఓరోజు పెరుమాళ్‌ ఆచూకి కోసం పాపతో సహా కొండప్రాంతంలో నివసించేవారందరిని పోలీసులు అరెస్ట్‌ చేసి చిత్రహింసలు పెడుతుంటారు. పోలీసులు పెట్టే చిత్ర హింసలు చూడలేక కుమరేశన్‌ ఏం చేశాడు? పెరుమాళ్‌ కోసం సాగించే వేటలో కుమరేశన్‌ ఎలాంటి పాత్ర పోషించాడు? చివరకు పెరుమాళ్‌ దొరికాడా? లేదా? అనేది మిగతా కథ. 

  Telugu.yousay.tv Rating : 3/5

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version